పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేంద్రకిరణ శాస్త్రము సంగ్రహ ఆంధ్ర


సగము మనుగడ - సగటు మనుగడ (Half life period and average life): సగము మనుగడ (Half life period) అనగా ఒక రేడియో ధార్మిక శక్తి గల పదార్థము యొక్క మూల ద్రవ్యరాశి యందు సగము భాగము క్షీణించుటకు పట్టు కాలము అని నిర్వచింప బడెను. రూథర్ ఫర్డు యొక్క సిద్ధాంతము ననుసరించి దానిని ఇట్లు చూపవచ్చును : t=0.6931 x T ౨ t= సగము మనుగడ; T = సగటు మనుగడ వివిధములగు రేడియో ధార్మిక - ఉత్పత్తుల (Radio active products) యొక్క స్థిరత్వము విపరీతమగు అవ ధులమధ్య భేదించుచుండునని తెలియుచున్నది. థోరియమ్ యొక్క సగము మనుగడ యొక్క విలువ 1.4× 10 10 సంవత్సరములు. థోరియము c యొక్క అట్టి విలువ 10 సెకండ్లు. వెనుక చెప్పినట్లు ప్రతి రేడియో ధార్మిక శ్రేణి యొక్కయు అంతిమ ఉత్పాదము సీసము అగును. ఒక రేడియో ధార్మిక శక్తి గల నమూనా శిల యందు మాతృకా పదార్థము (parent substance) అత్యల్ప పరిమాణములోను, అంతిమోత్పాదితమగు సీసము అంత కంటె మిక్కిలి అధిక పరిమాణములోను ఉండును. ఈ పరిమాణములను నిర్ణయింపగలిగినచో, రేడియో ధార్మిక సూత్రముల ననుసరించి ఆ శిల యొక్క వయస్సును కను గొనవచ్చును. ఈపద్ధతి ననుసరించి అత్యంత ప్రాచీనమగు శిల యొక్క వయస్సు 2000 మిలియనుల సంవత్సరము లుండుననియు, అది ఇంచుమించుగా భూమి యొక్క వయస్సుతో సమానమనియు కనుగొనబడెను. ఈ విధ ముగా రేడియో ధార్మికశక్తి భూమి వయస్సును నిర్ణ యించుటలో మొట్టమొదటగా ఒక అప్రతిహతమగు విధానమును సమకూర్చెను. రూధర్ పర్డ్ చ్చే a కణములు హిలియం యొక్క 'పరమాణువులు కేంద్రకములని సహేతుకముగా చూప బడెను. వాటియొక్క బహిర్గమన వేగము కాంతి వేగ ములో దాదాపు వ వంతు ఉండును. 1 గ్రాము రేడి యము సెకండు 13.72×101°a కణములను వెడల గ్రక్కును. ఈ కణములకు అయోనై జింగ్్శక్తి విస్తారము గను, చొచ్చుకొనిపోవుశక్తి అల్పముగను ఉండును. a B

కణములుగాని, రేడియో ధార్మికశక్తిగల పదార్థముల ఉనికిగాని, అవి ఎంత స్వల్ప పరిమాణములో నున్నప్పటి కిని వాటిని శోధించి తెలుపుటకై గీజర్ ముల్లర్ కౌంటర్ (Geiger Muller Counter) అను పరికరము ఉపయో గింపబడును. a కిరణములు జింకు సల్ఫైడ్ (యశదగం ధకిదము) వంటి కొన్ని పదార్థములమీద పడినపుడు ప్రకా శమును ఇచ్చును. ఆ పదార్థము సింటిలేషనులు (Scinti llations) అనబడు సూక్ష్మమైన వెలుగుమచ్చలను కన బరచును. ఒక సూక్ష్మదర్శిని ఒక సూక్ష్మదర్శిని సహాయమున ఈ మచ్చలను పరిశీలించి 4 కణముల యొక్క సరియగు సంఖ్యను లెక్కింప వచ్చును, ఆకణములు విద్యుత్ క్షేత్రముచేతను, అయ స్కాంత క్షేత్రముచేతను అతిక్రమణము (deflection) నొందును. సామాన్యమగు పీడనము, ఊష్ణోగ్రతలలో నుండు గాలిలో ఆ కణములు కొలది సెంటి మీటర్లు పోవును. అటుపిమ్మట అది వాటి ధర్మముల నన్నింటిని కోల్పోవును. ఈ దూరము గాలిలోని పరిమితి (Range in air) అనబడును. ఈ పరిమితిలో పల 4 కణము వేలకొలది అయాన్ జంటల (ion pairs) ను ఉత్పత్తి చేయును. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ అయానుల చుట్టు నీటిఆవిరికూడు కొను (condensed) నట్లు చేయ వచ్చును. ఇట్లొక నీటిబిందువులు మేఘము ఏర్పడును. ఆ మేఘమును సరియగు విధానములో ప్రకాశవంతముగా చేసి ఫొటోగ్రాఫు తీయవచ్చును. ఈ మేఘములచే ఆవరింపబడు కాశీలయొక్క ఫొటోగ్రాఫులు తిన్నని. బాటలను చూపుచు, గాలిలోగాని, మరేదైన వాయు వులోగాని, వాటి అవధియొక్క పరిమితిని చక్కగా తెలుపును. రూధర్ ఫర్డ్ కొన్ని ఫొటో గ్రాఫులలో రెండుగా చీలిన (forked) చివరలను పరిశీలించెను. దానినిబట్టి a కణము ఒక వాయుకణము గుండా పోవునవుడు ఒక పెద్ద కోణ ములో అతిక్రమణము నొందునని తెలియుచున్నది. ఈ పెద్దకోణముతో కూడిన అతిక్రమణములను వివరించుట కొరకు రూధర్ పర్డ్ నిజస్వరూపమునకు మిక్కిలి సన్ని హితమని అప్పటివరకు రుజువుచేయబడిన ఒక పరమాణువు యొక్క మాదిరిని భావించెను. ఈ మాదిరినిబట్టి ఒక పర మాణువు కేంద్రక (necleus) మనబడు అంతర్భాగమును 22