పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కేరళదేశము (చరిత్ర)


భూగర్భ ప్రక్షోభములవలనను, సముద్రము మేట వేయుట వలనను, నదుల వరదలవలనను, చాలవరకు ప్రస్తుత కేరళ తీరము ఏర్పడి యుండునని కొందరి అభిప్రాయమై యున్నది. కేరళ తీరమునకును మధ్య ప్రాచ్యదేశములకును నడుమ ప్రాచీన కాలము నుండియు సన్నిహిత సంబంధ ముండియున్నట్లు నిదర్శనములు కలవు. యూఫ్రటీస్ (Euphrates) నదీతీరమునగల ప్రపంచ విఖ్యాతమయిన , 'ఉర్' అను పట్టణమునందు చంద్రదేవుని దేవాలయ మొకటి కలదు. దానియొక్క శిథిలములందు కానబడు టేకుకలప అట్టి సన్నిహిత సంబంధమునకు నిదర్శనము. అదియునుగాక క్రీ. పూ. 8000 సంవత్సరముల క్రిందట మలబారునుండి నూలుబట్టలను కొనిపోయి ఈజిప్టు దేశ ము నందు వాడినట్లు తెలియుచున్నది. క్రైస్తవ మత గ్రంథ మగు పాత టెస్టమెంటు వలన సోలమన్ (Soloman) అనురాజు దంతముతో చేయబడిన నెమళ్ళు, కోతులు మొదలగు బొమ్మలను సేకరించుటకై తన వ్యాపార నౌకాదళమును మలబారుతీరమునకు పంపినట్లు తెలియు చున్నది. తూర్పు తీరమున గల సముద్ర తీరములలో అతిముఖ్య మయిన ముజిరిస్ (Musiris) (ఇప్పటి కాంగనూరు) అను పట్టణము ముఖ్యమయిన రేవుపట్టణమై యుండెను. ముజిరిస్, నెల్ సిర్ డా, బార్ కర అను ముఖ్యమయిన రేవుతీరములు వ్యాపార కార్యకలాపములందు ప్రసిద్ధము లయి యున్నట్లు గ్రీకులును, రోమనులును, వ్రాసిన చరిత్రలవలన తెలియుచున్నది. ముజిరిస్ అను పదమునకు ముఖ్యముగా 'ముజిరిస్' లేక 'మరిచ' అనగా మిరియాల పట్టణము అని అర్థము. ఈ పట్టణమునుండి, మిరియాలు, -అల్లము, ఏలకులు, ఇంకను అనేక సుగంధ ద్రవ్యములు విదేశములకు ఎగుమతి అయినట్లు తెలియుచున్నది. అనాదిలో రాజకీయముగా చేరులు, చోళులు, పాండ్యులు అను మూడు వంశముల రాజులచే దక్షిణ దేశము పరిపాలింపబడెను. వీరిలో చేరులే కేరళ ము యొక్క ముఖ్య పరిపాలకులు. అందుచేతనే ఈ దేశము నకు 'చేరళం' అను నామము ప్రసిద్ధమైనది. 'చేరళం' శబ్దమే 'కేరళం'గా మారినదని చారిత్రికులు నుడువు 4

చున్నారు. ఈ ఆధారములను బట్టియే కేరళ మొక ప్రత్యేక దేశముగా ప్రాచీన కాలమునుండియు, పరిగణింప బడుచుండెనని తెలియుచున్నది. పై నుదాహరింపబడిన తెగలనుగూర్చి సరియైన చరిత్ర లేదు. ఐనను తమిళ సంఘమునకు చెందిన కొన్ని కొన్ని గ్రంథములను బట్టి కొంతవరకు స్థూలముగా ఈ తెగల చరిత్ర మనకు తెలియుచున్నది. ఇందు మనకు తోడ్పడు గ్రంథములు 'పురననురు', 'లికననురు’, ‘పదట్టుపట్టు', 'సిలప్పాధి కారము'. 'పెరియ పురాణము', 'తొల్కాప్పి యము' అనునవై యున్నవి. సిలప్పాధి కారమను గ్రంథ మును వ్రాసిన 'ఇలన్ ఆదిగము' అను నాతడు ఈ దేశ భాగమును పరిపాలించిన చేర పెరుమాళ్ యొక్క సోదరుడు. 'ఉదయన్ చేరలతన్' (సుమారు క్రీ.శ. 130) అను రాజు ఈ దేశమును పరిపాలించిన రాజులలో మొదటి వాడని తెలియుచున్నది. గ్రంథములయం దితడు ' పెరుము కొట్టు' అని వర్ణింపబడెను. ఇతని కి పేరు వచ్చుటకు ఇతని ఘనమైన అతిథి సత్కారమే కారణము. ఈతని పుత్రు డును, రాజ్యాధి కారియునగు 'నెడుమ్ చేరల్ ఆడన్' అను నాతడు మలబారు తీరమునందలి కొందరు స్థానిక శత్రువు లను జయించెననియు, గ్రీకు వ్యాపారస్థులను చెరబెట్టె ననియు తెలియుచున్నది. ఇతడు ఇంకను అనేకులగు రాజులను జయించి, తన్మూలమున 'అధిరాజు' అను బిరుద మును, తదుపరి 'ఇయమ వరంబన్' అను బిరుదమును పొందెను. హిమాలయపర్వతములను తన రాజ్యమునకు సరిహద్దుగా నేర్పరచెనని ఈ రెండవ బిరుదమున కర్థము. తన శౌర్య సాహసములచే హిందూ దేశము నెల్ల జయించి, హిమాలయపర్వతములవద్ద తనయొక విల్లు ఆకారమున ఒక చిహ్నమును నిలబెట్టెను. కానిచిట్టచివరకు సమకాలికు డగు చోళరాజుతో ఘటిల్లిన యుద్ధములో అతడు చోళ రాజు_ఉభయులును తమ రాణులతో సహా మృతులైరి. CO 'నెడుమ్ చేరల్ ఆడన్' యొక్క సోదరుడును రాజ్యాధి కారియు నగు 'పల్ యానై కుట్టువన్' అను నాతడు 'బహుగజ కుట్టువన్ కొంగూను' అను నతని జయించి తన రాజ్యమును పశ్చిమ తీరమునుండి తూర్పు తీరము వరకు విస్తరింపజేసెను. ఆడన్ అను నాతనికి ఇరువురు

25