ఘనాదేశము
సంగ్రహ ఆంధ్ర
వ్యాపారముల నెల్లను అతిశయించుటకు పూర్వము, యూరపియనులకు ఈ రేవులనుండి లభించు ముఖ్యమైన వర్తకపు సరకు బంగారమై యుండెను. తీరప్రదేశమున కావల 'ఆశాంతి' యను రాజ్య ముండెను (kingdom of Ashanthi). దాని కుత్తరపు సరిహద్దున ఐరోపావాసు లెరుగని రాజ్య మొకటి యుండెను.
పూర్వము వలసప్రాంతము (colony)గా వ్యవహరింప బడిన ప్రదేశములో పెక్కురాజ్యము లుండెను. స్వతంత్ర ప్రతిపత్తి గలిగి (autonomous) నేటికి అవి స్వతంత్రాధికారము ననుభవించుచుండెను.
'ఆశాంతి' యందు మాత్రమే ప్రజలలో చాలవరకు ఐక్యత ఉండియుండెను. ఆ దేశమందు శక్తిసంపన్నులైన 'ఒసెయ్‌టుటు' (Oseitutu) ప్రభృతిరాజులు క్రమముగా అనేక రాష్ట్రములను ఏక ఖండముగా (unit) సంఘటించిరి. దానికి 'అశాంతి సమాఖ్య' (Ashanthi Confederacy) అని పేరిడిరి. ఈ సమాఖ్య అధినేతలు, సమీపమున గల రాష్ట్రములను జయించి, స్వీయరాజ్యమున కలుపుకొనుట యందు నిమగ్నులై యుండిరి. నేడు ఘనా యందు 108 దేశీయసంస్థానములు (native states) కలవు. ఒక్కొక్క సంస్థానము యొక్క వైశాల్యము 25 నుండి 2000 చ. మైళ్లవర కుండును. ఒక్కొక్క దాని జనాభా 2000 నుండి 228,000 వర కుండును. ప్రతి సంస్థానమునకును ప్రధానాధికారి (paramount chief) యొక డుండును. ఆతని క్రింద చిన్న అధికారులు అనేకులుందురు.
వర్తమాన శతాబ్ది ఆరంభము వరకును పశ్చిమ ఆఫ్రికా యందలి పెక్కు భాగములందు వలె ఈ దేశమందును యుద్ధములు సాధారణములై యుండెను. బలీయమైన ప్రభుత్వములో సభ్యత్వమును సంపాదించుకొనుటయే శత్రుదాడులనుండి ఆత్మరక్షణమొనర్చుకొనుటకు మిక్కిలి శక్తిమంతమైన మార్గమై యుండెను.
పరస్పరముగ స్పర్థించు ఐరోపియన్ ప్రభుత్వముల దుర్గములు సముద్రతీరమువెంబడి యుండుటచే, సమీపమున గల రాజ్యములలో కొన్నిటి యందు చీలిక లేర్పడుటకు కారణమయ్యెను.
బ్రిటిష్ ప్రభుత్వముచే ప్రవేశపెట్టబడిన పరోక్ష పరిపాలనా పద్ధతి ననుసరించి కొందరు తెగ నాయకులు (chiefs) స్థానిక ప్రభుత్వపు ఏజెంట్లుగా నియమింపబడిరి. ఈ పద్ధతి ఆ దేశమున స్వదేశ సంస్థానముల వ్యవస్థ కొనసాగుటకును, స్థిరపడుటకును దోహదమొనర్చెను. మండలములుగా వ్యవహరించు విశాల పాలిత ప్రాంతములలో చిన్న చిన్న రాజ్య సమూహములు ఏర్పడెను. ఈ మండలములు మరల ' కాలనీ', 'ఆశాంతి', 'ఉత్తర పరగణాలు', 'టోగో లెండు' అను బహు విశాలములైన రాజ్యములలో రాష్ట్రములుగా అంతర్భూతము చేయబడెను.
దీనివలన ఫలమిది. దేశీయ సంస్థానములు సాధారణ పరిపాలనా విభాగములందు అంతర్గత భాగములుగా సమీకరింపబడి, అవి ఆక్రా (Accra) అను రాజధానీ నగరము నుండి పరిపాలింపబడునట్లొనర్ప బడినవి. కావున దేశీయ సంస్థానములు నిలిచియున్నను, వాటికి లోగడ నున్న స్వాతంత్ర్యము నశించెను.
నేడు పరిపాలనా సౌకర్యము కొరకు దేశము ఆరు ప్రాంతములుగా విభజింపబడినది. 1. ప్రాక్పశ్చిమ ప్రాంతములు. ఇది పూర్వపు 'గోల్డుకోస్టుకాలనీ' యొక్క తూర్పు, పశ్చిమ విభాగములకు ప్రతియైనవి (corres ponding); 2. ఆశాంతి- బ్రాంగ్ - అహాఫో (Ashanthi - Brong - Ahafo) ప్రాంతములు. వీటికి పూర్వము 'ఆశాంతి' అని పేరుండెడిది. 3. ఉత్తరప్రాంతము . ఇది పూర్వపు ఉత్తరమండలములకును (Northern territories), టోగోలెండుయొక్క ఉత్తరభాగమునకును ప్రతిగా నున్నది. 4. వోల్టా ప్రాంతము (Volta Region). ఇది టోగోలాండు యొక్క దక్షిణభాగమున నున్నది. ప్రభుత్వాధికారము రాజధానీనగరమగు ఆక్ర్ (Accra) యందున్న పార్లమెంటు (National Assembly) నందు కేంద్రీకరింపబడెను. కాని పూర్వము ప్రతి ప్రాంతమునందును ఒక ప్రాంతీయ శాసనసభ యుండెడిది. అది కొన్ని ప్రాంతీయ వ్యవహారములను చూచు చుండెను. ఇప్పటికిని దేశీయ సంస్థానములు గుర్తింపబడు చున్నవి. వాటికి ప్రాతినిధ్యము వహించిన ప్రముఖులతో వేర్వేరు ప్రాంతములందు 'ప్రముఖుల సభలు' (Houses of chiefs) ఏర్పడుచున్నది.
దేశాంతర్గతములైన వాయుమార్గములు (inter air transport), న్యాయస్థాన వ్యవహారములు మున్నగు
544