Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఘనాదేశము

క్రీ. శ. 1290 నాటి యొక తెలుగుదేశపు తామ్ర శాసనమునందు వివిధగోత్రములకు చెందిన ఘటశాసులైన వృత్తిమంతు లనేకులు (వామదేవ ఘటశాసి, కంచి ఘటశాసి, పోతె ఘటశాసి, సూరే ఘటశాసి మున్నగువారు) పేర్కొనబడియున్నారు. శాసి యన అపదేష్ట, శాసించువాడు గురువు అని యర్థము చెప్పుకొనవచ్చును. ఘళిశాసి, మైసాసి శబ్దములలోని 'సాసి' యన్నది ఒక వేళ 'శాసి' పదమునకు తప్పుగ వ్రాయబడినదేమో తెలియదు. 'సాసి' యన్నది కన్నడములోని 'సాసిర్ ' పదమునకు రూపాంతరమైనను కావచ్చును.

కన్నడదేశ శాసనములలో వ్యక్తుల పేర్లముందు 'ఘటికాసాహస్ర' గౌరవబిరుదు వాచకముండుట మనకు దెలిసినవిషయమే. 'ఘళిసాసి' 'ఘైసాసి' అనునవి 'ఘటికా సాహస్ర' పదభ్రష్టరూపము లగునేమో విచారింపవలసి యున్నది.

మ. సో.


ఘనాదేశము :

స్థానము, వి స్తీర్ణము : ఆఫ్రికా ఖండములో గినియా తీరముననున్న దేశములలో ఘనా అనునది దాదాపు మధ్య గతముగ నున్నది. ఈ దేశమునకు తూర్పుగా ఫ్రెంచి టోగోలెండు (French Togoland) కలదు. దానికావల ఫ్రెంచి దహోమీ (French Dahomey) విస్తృతమైన నైగీరియా సమాఖ్యయు (Federation of Nigeria) కలవు. పశ్చిమముగా ఫ్రెంచి ఐవరీ కోస్టు (French Ivory Coast), లైబీరియా రిపబ్లిక్ (Liberia Republic), బ్రిటిష్ సైర్రాలియోన్ (British SierraLeone), ఫ్రెంచి గినియా, (French Guinea) అను దేశములు కలవు.

ఈ రాజ్యములన్నియు సముద్ర తీరమువరకు విస్తరించి యున్నవి. కాని వాటి లోతట్టు ప్రదేశపు (inland) సరిహద్దులపై సామూహికముగా ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా అనబడు విశాల ప్రాంతమునకు చెందిన ఇతర రాజ్యము లున్నవి. ఈ లోతట్టు ప్రదేశములలో నొకటియైన 'ఫ్రెంచి అప్పర్ వోల్టా' (French upper volta) 'ఘనా' అను దేశముయొక్క ఉత్తరపు సరిహద్దు వెంబడిగా నున్నది.

సముద్ర తీరమునుండి లోగర్త ప్రదేశములో ఉత్తర మున అక్షాంశము 11° వరకును 'ఘనా' దేశము వ్యాపించి యున్నది. ఇట్లది దక్షిణమునుండి ఉత్తరమునకు సుమారు 420 మైళ్ళ దూరము ఆక్రమించియున్నది. ఈ విశాలతమమైన భాగమున కడ్డముగా తూర్పునుండి పశ్చిమమునకు గల దూరము స్వల్పము. అనగా రేఖాంశ వృత్తము 11/2° తూర్పునకును, రేఖాంశవృత్తము 31/2° పశ్చిమమునకును నడుమగల దూరము సుమారు 334 మైళ్లు మాత్రమే. బ్రిటిష్ సామ్రాజ్యకూటము (British Commonwealth) లో 'ఘనా' అను నొక్కదేశము మాత్రమే స్వతంత్రమైన పశ్చిమ ఆఫ్రికను దేశమై యున్నది. ఈ దేశముయొక్క మొత్తము వైశాల్యము 91,843 చ. మైళ్లు. 1948 సంవత్సరములో జరిగిన జనాభా లెక్కలనుబట్టి అందలి జనాభా 4,118,450 మంది.

గినియాతీరమునందలి ఇతర భాగములకువలెనే ఘనా యొక్క దక్షిణతీర వైశాల్యమునకు ప్రబలమైన సముద్రపు పోటు తగులుచున్నది. ఓడలు సురక్షితముగా లంగరు వేసికొనగల సహజ నౌకాశ్రయములు లేని సముద్రపు ఒడ్డుకు ఎడ తెగని ఈ సముద్రపు పోటువలన దెబ్బ తగులు తున్నది. కావున ఎక్కువ ధన వ్యయముతో కృత్రిమము లైన (artificial) నౌకాశ్రయ నిర్మాణములుగల టాకోరడీ (Takoradi), టెమ (Tema) అను తావులందు తప్ప, సముద్ర ప్రయాణముచేయు ఓడలు సముద్రతీరమునకు సమీపముగా అరమైలు దూరమున లంగరువేసికొన వలసివచ్చుచున్నది. చిన్నసైజు సర్ఫ్ బోట్లు (surf boats) మాత్రమే ఒడ్డునకును, గర్జించుచున్న అలలకు అవల నున్న లోతైన, ప్రశాంతమయిన నీటికిని నడుమ ప్రమాదభరితమైన ప్రయాణము చేయగలుగు చున్నవి.

రాజకీయ పరిణామము : ఈ దేశము 1957 వ సంవత్సరము మార్చి 6 వ తేదీన స్వాతంత్ర్యమును పొంది 'ఘనా’ అను ప్రాచీననామము ధరించినది. దీనికి 'గోల్డు కోస్టు' అని ఇంగ్లీషుపాలకులు పేరుపెట్టి యుండిరి.

బహుకాలమువరకు 'గోల్డు కోస్టు' అను పదము, స్థానిక ప్రజలు అందజేయు బంగారముతో యూరపియనులు వర్తకముచేయుసముద్రతీర ప్రదేశమునకుమాత్రమే వర్తించెను. 'గోల్డు కోస్టు' అను పదము మిక్కిలి సముచితముగ నున్నది. ఎందుకనగా, బానిస వర్తకము తదితర

543