ఘటికాస్థానములు
సంగ్రహ ఆంధ్ర
యొక చెట్టు క్రింద నిలువుగా పాతబడియున్నది. ఈ స్తంభము యొక్క ముందుభాగమునందును, కుడి ప్రక్క యందును మాత్రమే నగిషీపని చేయబడియున్నది. మిగిలిన రెండు భాగములు నున్నగా నున్నవి. స్తంభపు అడుగుభాగమున గుండ్రని పాత్రాకార మొకటి కలదు. ఆ పాత్రాకారము నుండియే బయలుదేరినట్లు కమలగుచ్ఛములును, పుష్పపత్రాదులును ఒక దానిపైనొకటి మిక్కిలి సుందరముగా చెక్కబడియున్నవి. స్తంభపు కుడిప్రక్కన శిల్పము గూడ దాదాపు ఇట్లే యున్నది. సాంచీలోని ఉత్తర ద్వారమున గల శిల్పముతో దీనికి పోలిక గలదు. ఈ స్తంభము బహుశః బౌద్ధమత స్మారక చిహ్నముగా నెలకొల్పబడియుండును.
వేరొక శిలాస్తంభము : గ్రామపు సరిహద్దులలో నున్న దిబ్బ వద్ద ఈ స్తంభము భూమిలో పాతబడియున్నది. దీని శిరోభాగము విరిగిపోయినది. మిగిలియున్న భాగము అష్టముఖములతో నున్నది. రెండు ప్రక్కలలో మాత్రమే శిల్పము కలదు. మొదటి ప్రక్కన క్రింద నొక సింహాసనము, దాని కిరువంకల రెండు పద్మపుష్పములు, చక్రము, దాని చుట్టును త్రిశూలాలం కారము కనుపించుచున్నవి. రెండవ ప్రక్క గూడ నిట్టి శిల్పమే కలదు గాని అది చాలవరకు అస్పష్టముగా నున్నది. దీనికి సమీపమున నాలుగు విరిగిన స్తంభములు పాతబడియున్నవి. ఇవి పూర్వము మండపాకారమున నుండియుండును.
ఇవిగాక స్తూపమున నున్న పాలరాతి పలకలు అచ్చటచ్చట కనుపించును. అందు బౌద్ధ మతస్థుల పవిత్ర చిహ్నములు కనుపించును. బోధివృక్షము, బౌద్ధస్తూపాకృతి, బౌద్ధవిగ్రహము, ఛత్రము, భిక్షువులు, అర్హతుడు, కలశము మొదలైనవి ఇట్టి చిహ్నములు.
బౌద్ధమతము క్షీణించినతరువాత బౌద్ధశిల్పవిన్యాసము గల పాలరాతి పలకలను చెడగొట్టి, వాటిపై హిందూ దేవతా విగ్రహములను చెక్కినారు. ఇచట కనుపించు భైరవస్వామి విగ్రహము, సరస్వతీదేవి విగ్రహము. రతీదేవి విగ్రహము ఇట్టివే. మూడును మిక్కిలి మోటుగా నుండి శిల్పనైపుణ్య రహితములుగా నున్నవి.
జలధీశ్వరాలయము : ఘంటశాలలో నున్న జలధీశ్వరాలయమున శివుడు జలధీశ్వరనామముతో ఆరాధింప బడుచున్నాడు. గంటసాల యోడరేవగుటచే ఇచటి నుండి నౌకాయానముచేయు వర్తకులు మహాదేవుని తమ ప్రయాణము సఫలమగుటకై పూజించి ప్రార్థించుచుండిరి. రోమనులు సముద్రయాన సందర్భమున సముద్రదేవతను (నెప్త్యూనును) పూజించునట్టిదే ఇది. భారతదేశమున శివుడు జలధీశ్వర నామముతో మరియెచటను పూజింపబడినట్లు కానరాదు. ఈ ఆలయమున శివుడు లింగరూపమున లేడు. ఇందు పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠమున నున్నట్లు వెలసియున్నారు.
ఈ ఆలయ మెపుడు నిర్మితమయ్యెనో చెప్పుటకు సరియైన ఆధారములు లేవు. ఇది బహు పురాతనమైనది. క్రీస్తుశకారంభమునాటికే ఈ యాలయము నిర్మింపబడి యుండును. ఇచట నున్న దాన శాసనములను బట్టి ఈ దేవాలయము ఎనిమిదివందల సంవత్సరములకుపూర్వము కూడ నుండెనని చెప్పుటకు వీలగుచున్నది. పూర్వకాలమున ఈ ఆలయము మహావైభవ సమన్వితమై గొప్ప పుణ్య క్షేత్రముగా ప్రసిద్ధిచెంది, దూరదూర ప్రదేశముల నుండి భక్తుల నాకర్షించుచుండెననుటకు ఇచటి శాసనములు సాక్ష్యములుగా నున్నవి.
ఇట్లు పూర్వము ప్రసిద్ధినందిన ఘంటశాల బౌద్ధ క్షేత్రముగను, ఓడ రేవుగను, వాణిజ్య కేంద్రముగను ప్రఖ్యాతిని బడసి, నేడు ఆంధ్రదేశపు ప్రాచీనపు టౌన్నత్యమునకును, నౌకాయాన ప్రావీణ్యమునకును, బౌద్ధమత ప్రాశస్త్యమునకును ప్రత్యక్ష చిహ్నముగా నున్నది.
మ. కు.
ఘటికాస్థానములు :
ఘటిక, ఘటికాస్థానము అను పదములు శిలాతామ్ర శాసనములలో మాత్రమే కానవచ్చును. అందువలన ఘటిక యన్ననేమో, ఎట్టిదో తెలిసికొనుటకు ఈ పదము వచ్చు శాసనములను, ఆ సందర్భమున చెప్పబడిన విషయములను తెలిసికొనవలసి యుండును.
మొదటిమారు పరిశోధకుల దృష్టి నాకర్షించుటకు హేతువైన ఘటికా పదాన్విత లేఖ్యము కదంబ కులజుడైన కాకుత్థ్సవర్మ తాలగుండ శిలాస్తంభశాసనము. ఇది మైసూరురాష్ట్రము లోనిది. కదంబులు బ్రాహ్మణులు. కదంబ వంశజుడైన మయూరశర్మ వేదాధ్యయనమును
538