విజ్ఞానకోశము - 3
ఘటికాస్థానములు
సంపూర్తి చేసికొనగోరి పల్లవ పృథ్వీపతులకు రాజధాని యైన కాంచీపురమున కరిగి అచ్చటి ఘటికలో ప్రవేశించెను. కాంచీపురమున నుండగా అతనికి పల్లవ రాజాశ్వికునితో వైరము సంభవించినది. అది కారణముగా మయూరశర్మ జీవితమే మారిపోయినది. అతడు పల్లవ భూవల్లభులపై పగ పాటించి, బ్రాహ్మమును పరిత్యజించి, క్షాత్రధర్మమును చేపట్టి, తుదకు కదంబ రాజ్యస్థాపకు డయ్యెను. నాటినుండి కదంబులు బ్రహ్మక్షత్రియులై వర్మోపపదాంచితులైరి. మయూరశర్మ సంతతివా డైన కాకుత్థ్సవర్మ చెక్కించినదే తాలగుండ శాసనము. ఈ శాసనమున తేదీ లేదు. అందువలన లిపి స్వరూపము ననుసరించియే ఈ శాసనకాలము నిర్ణయింపవలసి యుండును. అట్లగుటజేసి ఏతత్కాల నిర్ణయమున చరిత్ర పరిశోధకులలో భేదాభిప్రాయములు కలవు. ఈ శాసనము అయిదవ శతాబ్దము నాటిదని, మరికొందరు అభిప్రాయ పడిరి. కాకుత్థ్సవర్మకును, మయూరశర్మకును మధ్య ఎన్నో తరములు లేవు. కాకుత్సవర్మ అయిదవ, ఆరవ శతాబ్దమువా డైనచో మయూరశర్మ అంత కింకను పూర్వుడు కావలెను. 'కదంబకుల' చరిత్రకారుని అభిప్రాయము ప్రకారము మయూరశర్మ క్రీ. శ. 345-370 ప్రాంతము అనగా క్రీస్తుశకము నాలుగవ శతాబ్ద మధ్యమునం దుండినవాడు. అందువలన కాంచీపురములోని ఘటికాశాల క్రీస్తుశకము నాలుగవ శతాబ్దమునాటికే యుండియుండ వలెను. తాలగుండ శాసనములో ఘటికా ప్రస్తావ మీ క్రింది శ్లోకములో నిట్లున్నది.
"యః ప్రయాయ పల్లవేంద్రపురీం గురుణా సమం
వీర శర్మణా అధిజిగాంసుః ప్రవచనం నిఖిలం
ఘటికాం వివేశాశు తార్కుకః"
దీనికి పూర్వ శ్లోకముతో నన్వయము. యః అనగా పూర్వ శ్లోకము నందు చెప్పబడిన “శ్రుతశీల శాచాద్యలంకృతు” డైన మయూరశర్మ. అతడు తన గురువైన వీరశర్మతో గలసి 'నిఖిల ప్రవచనము'ను పరిపూర్తి చేసి కొను తలంపుతో పల్లవేంద్ర రాజధానియైన కాంచీపురము నందలి ఘటికలో తార్కుకుడుగ ప్రవేశించెను. తార్కుక శబ్దమును హేమచంద్రుడు తన అభిధాన చింతామణిలో యాచక పర్యాయ పదముగా నిచ్చి యున్నాడు. దీని ననుసరించి శ్రీ యస్. వి. వేంకటేశ్వర పండితుడు 'ఇండియన్ కల్చర్ త్రూ ది ఏజెస్ ' అను గ్రంథములో మయూరశర్మ విజ్ఞాన భిక్షువై కాంచీ ఘటికాశాలయందు ప్రవేశించెనని చెప్పుచు దీని కుపబలకముగ బౌధాయన ధర్మ సూత్రమునందలి 'పిండతార్కుక' పదమును ఉదాహరణముగ నిచ్చియున్నాడు, 'నిఖిల ప్రవచన' మనుట వలన ఘటిక యనునది వేద విద్యా సంస్థయని తేలుచున్నది. నాగాయి శాసనములీ విషయమును ధ్రువపరచుచున్నవి. పశ్చిమ చాళుక్య చక్రవర్తియైన త్రైలోక్యమల్ల, ఆహవమల్ల సో మేశ్వరుని కొలువుకాడు. వానసవంశ సంజాతుడును, వసిష్ఠసగోత్రుడును, దండనాథ త్రినేత్ర బిరుదాంచితుడును, కర్ణాట సంధి విగ్రహాధిపతియు నైన మధుసూదనుడు 'పరమేశ్వర దత్తి'గా తామ్రశాసనము వ్రాయించి నాగవావి (ఇప్పటి నాగాయి) అగ్రహారములోని, చతుర్వేద పారగులైన నన్నూర్వురు విప్రోత్తముల భరణము నిమిత్తము త్రైలోక్య మల్ల మహీపతి వలనను, హైహయ కులజుడైన అయ్యపరసు వలనను కొంత భూమిని మాన్యముగా బడసి ఆ యగ్రహారమున కటక కమలార్కుడను పేరు త్రైపురుషదేవర కొక యాలయమును, తనపేర మధుసూదన దేవుని కొక యాలయమును, రామేశ్వరుని కొక యాలయమును, వేదాధ్యేత విన్నూర్వరి కొరకును, శాస్త్రాధ్యేత కేబది యిర్వుర కొరకును, నిజ ధర్మకారితాధికార పదవీ విద్యాపకులు మూవురను, శాస్త్రోపాధ్యాయులు మూవురను, భట్టదర్శన, న్యాస, ప్రభాకర వ్యాఖ్యాతలను మూవురను, శాలలోని సరస్వతీ భండాగారికుల నార్వురను నియమించి మొత్తము 267 (శాసనములో పొరపాటున 257 అని యీయబడినది) గురి అశన, ఆచ్ఛాదనాదుల నిమిత్తము వృత్తు లేర్పాటు చేసెను. ఈ శాసనము క్రీ. శ. 1058 నాటిది. సింహాచలములోని యొక శాసనమునందు ఇతర నిబంధములతో పాటు 'కాండవ తై త్తిరీయ శాఖలు చదివించ్చెటి ఘడి శాసులైన బ్రాహ్మణుల కిద్దఱకు' కూడ నిబంధములు చేయబడినవి. సింహాచల దేవాలయమున ఘటిక యుండె ననియు అచ్చటి ఘడి శాసులకును నిబంధములు (వర్షాశనములు మొదలైనవి) చేయబడెననియు ఈ శాసన
539