పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేంద్రకిరణ శాస్త్రము

బీజములు చాల ఎక్కువగతి (kinetic) శక్తిని కలిగి యుండవలెను. తాపక్రమ బీజ ప్రతిక్రియలు (Thermonuclear Rea- ctions) : అణువుల ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగునో వాటి గతి శక్తి అంత హెచ్చును. సుమారు పదిలక్షల డిగ్రీల ఉష్ణోగ్రత సంయోజన విధానము జరుగుటకు ఎక్కువగా తోడ్పడును. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద జరుగు బీజక్రియలను తాపబీజ ప్రతిక్రియలందురు. మనకు అమితముగా శక్తిని ప్రసరించుచున్న నక్షత్ర ములలో తాపబీజ ప్రతిక్రియలే జరుగుచున్నవని విజ్ఞాన శాస్త్రవేత్తలగు 'బేథె' 'గేమో'లు చూపిరి. సూర్య శక్తికికూడ మూలము ఈ ప్రతిక్రియలే. ఉదజని హిలి యంగా పొందు రూపాంతరమే సూర్యశక్తికి కారణమని `బేకె' సూచించెను. ఇతని సిద్ధాంతము ప్రకారము ఈ విధముగ సూర్యశక్తి మనకు ఇంకను 8 వేలకోట్ల సంవత్సరముల వరకు లభించును. హైడ్రొజను బాంబు : పాపబీజ ప్రతిక్రియలు జరుగు టకు అవకాశమిచ్చు అధికోష్ణోగ్రతలు పరమాణు బాంబు పేలినపుడు లిప్తపాటు లభించును. భేదనము పరమాణు కాంబుల మూలసూత్రము. సంయోజనము హైడ్రొజను కాంబుల మూలసూత్రము. పరమాణుబాంబు పేలినపుడు ఉద్భవించు ఉష్ణోగ్రతలు హైడ్రోజను బాంబును రగుల్చు టకు ఉపయోగపడును. హైడ్రొజనుబాంబు పరమాణు కాంబుకంటే చాల శక్తిమంతమైనది. స్వాధీన తాపబీజ ప్రతిక్రియలు (Controlled Ther- monuclear Reactions): తాపబీజ ప్రతిక్రియలో విడుదలయిన శక్తి స్వాధీనపరచుకొనబడిన యెడల, ఈ శక్తి పెక్కు శాంతియుత ప్రయోజనములకు ఉపయోగ వడపను. ఈ శక్తి అమితమైనది. ఈ శక్తి మనకు లభించి నచో, మామూలు శక్త్యుత్పత్తి స్థానములైన రాక్షస బొగ్గు, పెట్రోలియం మొదలగునవి తరగిపోయినను అంతగా బాధయుండదు. తక్కువ పీడనములవద్ద వాయుఉత్సర్గముల (gaseous discharges) వలన తాపబీజ ప్రతిక్రియలు నిర్వహణము నకు అనుకూలించు ఉష్ణోగ్రతలను ప్రయోగశాలలలో పొందుటకు నేడు పెక్కు ప్రయత్నములు జరుగుచున్నవి.

ఎక్కువ ఉత్సర్గములతో పాటు ఎక్కువ విద్యుత్ ప్రవా హము, దానితో పాటు ఎక్కువ ఉష్ణోగ్రత లభించును. ధనావేశ అయనములతోను, ఎలక్ట్రానులతోను గూడి యున్న ఈ యానకమును ప్లాస్మా (plasma) అందురు. ప్లాస్మా చక్కని విద్యుద్వాహకము. పదిలక్షల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహము సుమారు పదిలకుల డిగ్రీల ఉష్ణోగ్ర తను జనింపజేయును. బీజ శ క్తితో పరమాణుశక్తి శాంతిప్రయోజనములు : నడుపబడు విద్యుత్ కేంద్రములు ఇప్పుడు అమలులో నున్నవి. నీటి యొక్క లేక ఇతర అనుకూల ద్రవ్యము యొక్క అవిరహిత (continuous) ప్రవాహము ఉష్ణ మును పీల్చి, ఎక్కువ పీడన బాష్పముగా (vapour) మారి, యంత్రములను నడపి విద్యుత్తును సృష్టించును. ప్రతిక్రియాజనకము, బీజ ఇంధనము (nuclear fuel) రేడియో యాక్టివ్ సమస్థానీయములను ఇచ్చును. పరమాణు శక్తి వలన భారీ యంత్రములను ఎక్కువ కాలము అవిరామముగా నడుపవచ్చును. ఈ రోజున పరమాణుశ క్తి చే నడుపబడు జలాంతర్గాములును (sub- marines), _మంచుకొండల విభేదనా యంత్రములును (Ice-breakers) ఆచరణలో నున్నవి. బీజ ను, నేడు రేడియో యాక్టివ్ సమస్థానీయముల ప్రయో జనములు మిక్కుటముగ నున్నవి. పెక్కు రకముల పరిశ్రమలలోను, వ్యవసాయములోను, వైద్య, శస్త్ర వై ద్యములలోను, భూగర్భ పరిశోధనలలోను, యంత్ర నిర్మాణములోను, దాదాపు అన్ని రంగములలోను అవి ఉపయోగపడుచున్నవి. గామా కిరణములను, ధాతువు లలో దాగియుండిన దోషములను తెలిసికొనుటకును, బీటాకిరణములను ఆహార పదార్థములను భద్రపరచుట కును ఉపయోగించుచున్నారు. పరమాణుశక్తి వహించు పాత్రను బట్టియే ఈ కాల మును 'పరమాణు యుగ'మని (Atomic age) అందురు. డి. యస్. ఆర్. మూ. కేంద్రకిరణ శాస్త్రము : (Radio Activity) 1896 వ సంవత్సరములో అనగా 'ఎక్స్ రే’లను కనుగొన్న కొలది మాసముల అనంతరము భౌతిక

19