పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేంద్రకిరణ శాస్త్రము సంగ్రహ ఆంధ్ర


శాస్త్రమునందలి మరియొక బ్రహ్మాండమయిన నూతన విషయము కనుగొనబడెను. హెన్రీ బెక్వెరెల్ అను ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త ఈ క్రొత్త విషయమును కనుగొనుట కేవలము కాకతాళీయము. 'ఎక్స్' కిర ణములకు సంబంధించిన ఒక నూతనాంశమును అతడు ౨ ఒక నాడు శ్రద్ధాసక్తులతో పరిశోధించుచుండెను. ఈ పరి శోధనలో అతడు కొలది మాత్రముగ యు రేనియమ్ ఉపయోగించుచుండెను. ఆదినమున గంధకితమును ఈ పదార్థము సూర్యరశ్మి సోకుట లేదు. అందువలన కాగితముతో పొట్లముగా కట్టబడి డ్రాయరులో ఉంచ ఆ డ్రాయరునందే కొన్ని ఫొటోగ్రాఫిక్ ప్లేట్లు ఒక నల్లని కాగితములో భద్రముగా చుట్టి పెట్టబడెను. కొన్ని దినములయిన తరువాత ఫొటోగ్రాఫిక్ ప్లేట్ల యందు కలిగిన మార్పును గమనించి బెక్వెరెల్ ఆశ్చర్య చకితుడా యెను. దానినిబట్టి యురేనియమ్ లవణము నల్లని కాగితముగుండా దూసుకొని పోగలిగి, ఫొటో గ్రాఫిక్ ప్లేట్లయందు మార్పును తేగలిగిన కొన్ని నూతన కిరణములను ప్రసరింపజేసి యుండవచ్చునని బెక్వెరెల్ సరిగ నే ఊహించెను. తనఊహ శాస్త్రీయమైనదో కాదో అని పరీక్షించుటకై ఆతడు వెనువెంటనే ప్రయోగములు జరిపెను. పైన ఉదహరింపబడిన లక్షణములుగల శక్తి మంతమయిన కిరణములను యు రేనియమ్ ప్రసరింప జేయగలదని ఈ ప్రయోగముల వలన రుజువయ్యెను. యురేనియమ్ నుండియేగాక తరువాత కనుగొనబడిన థోరియమ్, పొలోనియమ్, రేడియమ్ వంటి పదార్థముల నుండి కూడ బయలు వెడలు అట్టి కిరణములను ప్రసరింప జేయు ధర్మమును ' రేడియో యాక్టివిటీ' (కేంద్రకణకిరణ ప్రసరణము) అనబడును. మరికొన్ని రేడియోధార్మిక పదార్థములను కనుగొను టకై 'పియరీ', 'మేడమ్క్యూరీ' అను ఫ్రెంచి దంపతులు చేసిన ప్రయత్నము ఫలించి, 1898వ సంవత్సరము డిసెంబరు మాసములో యురేనియమ్కన్న వేయి రెట్లు ఎక్కువ ధార్మికశక్తిగల రేడియమ్ అను పదార్థము కను గొనబడినది. 'పిచ్ బ్లైండ్' అనబడు 30 టన్నుల ముడి యురేనియమ్ నుండి దీర్ఘ కాలముగా విశేష మైన శ్రమను ఓర్చి చేసిన ప్రక్రియా ఫలితముగా 2 మిల్లి గ్రాముల

రేడియము మాత్రమే తయారు కాబడినది. పైన పేర్చొన బడిన పరిశోధనల ఫలితముగా 1903 వ సంవత్సరములో, బెక్వెరెల్, క్యూరీదంపతులు 'నోబెల్' బహుమానముతో సత్కరింపబడుట మిక్కిలి సమంజసమయిన విషయము. పరమాణు కేంద్రకము (nucleus of atom) ను విచ్ఛిన్నము చేయుటవలన ఉత్పన్నమయ్యెడు కేంద్ర కణమునుండి రేడియోధార్మిక కిరణప్రసారము బయలు దేరునని ప్రారంభము నుండియు స్పష్టమగుచు వచ్చెను. కేంద్రకము విచ్ఛిత్తి నొందుట చాల గొప్ప విషయము. దాని ఫలితముగా తక్కువ ద్రవ్యరాశి గల నూతన పర మాణువు రూపొందును. ఈ విచ్ఛిత్తి స్వయంసిద్ధముగా జరుగు సంఘటనమే గాని, అది ఉష్ణము, చల్లదనము, విద్యుచ్ఛక్తి, అయస్కాంత క్షేత్రము-ఇట్టి బాహ్యమగు భౌతిక, లేక రాసాయనికము లయిన ప్రభావములకు— అవి యెంత శక్తికలవై నను లోబడి యుండదు. స్వాభా విక మనదగు ఈ రేడియోధార్మిక ప్రసారము (Radio activity) అంతర్గతమయిన కారణముల వలననే ఉత్పన్న మగుచున్నది. మరియు, 82వ పరమాణు సంఖ్యను (atomic number) దాటిన బరువైన పరమాణువు లందుగల కేంద్రకణముల (nuclei) కు మాత్రమే ఈ స్వాభావిక మైన రేడియోధార్మిక ప్రసారము పరిమితమై యుండును. అదియునుగాక ఇది దీర్ఘకాలిక మును, ఆలస్య మును అగు పరిణామక్రియ. భౌతిక పదార్థము సృష్టి నాటినుండి ఈ పరిణామక్రియ ఎడతెగకుండ కొనసాగుచునే యున్నది. ఈ రేడియో ధార్మిక ప్రసరణ మును గూర్చి కావింపబడిన సూక్ష్మపరిశీలన ఫలితముగా పరమాణువులో ముఖ్యమయిన అంతర్భాగము కేంద్ర కణముయొక్క నిర్మాణమును గూర్చియు, దాని స్థిరత్వ మును గూర్చియు, మిక్కిలి అమూల్యమయిన సమా చారమును గ్రహింపగల్గితిమి. ఈ విధముగా 'కేంద్రకణ భౌతిక శాస్త్రము' (Nuclear Physics) అను భౌతిక శాస్త్రమునకు చెందిన విచిత్రమయిన ఒక శాఖ సృష్టింప బడి అపరిమితముగా వృద్ధి కావింపబడెను. అయిన లార్డు రూథర్ ఫర్డ్, అతని సహచరులు కలిసి ఈ విషయములో తీవ్రమైన, విస్తృతమైన పరిశోధనలు జరిపిరి. ఈ పరిశోధనల ఫలితముగా వికిరణ ప్రసారము 20