Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామవిద్యుదీకరణము

సంగ్రహ ఆంధ్ర

భాస్కరాచార్యోక్తి ననుసరించియు 56 లిప్తలే. కాని సూర్యగ్రహణ విషయములో భాస్కరాచార్య మతమునకు, నవీనమతమునకు కొంత తేడా కలదు. నవీన మతములో భూగోళమం దెచ్చటనైనా సూర్యగ్రహణము సంభవించునా అని తర్కించెదము. కాని ప్రాచీనమతములో స్వదేశములో సూర్యగ్రహణము సంభవించునా అని తర్కించుటచేత మానై క్యార్ధము చంద్రరవిబింబ యోగార్ధముగానే గ్రహించి 32 లిప్తలుగా గ్రహించిరి. ఇదియు గణితోపపన్నమే.

భాస్కరాచార్యుడు చంద్రుని పరమ విక్షేపమును 4 భాగల 30 లిప్తలుగా గ్రహించెను. నవీన మత ప్రకారము ఈ పరమ విక్షేపము 4 భాగల 58 లిప్తలనుండి 5 భాగల 18 లిప్తలవరకు మారుచుండును. అట్లే భాస్కరుడు గ్రహించిన భూఛావ్యాసార్ధముకూడ నవీన మతమునకు సరిపోవును. నవీన మతమునందు గ్రహణ గణితములో ఏయే సూక్ష్మాంశములు గలవో వాటినన్నిటిని భాస్కరుడు చక్కగా ప్రతిపాదించి ప్రాచీన భారతీయుల గణిత నై శిత్యమును ప్రకటించియుండెనని తెలియనగును.

ధూ. అ. సో.


గ్రామ విద్యుదీకరణము :

ఆధునిక యుగమున ప్రతి దేశముయొక్క ఆర్థికాభి వృద్ధియందును విద్యుత్తు సరఫరా అత్యంత ప్రముఖమైన పాత్ర వహించుచున్నది. ప్రతి దేశముయొక్క అభ్యుదయము, ఆ దేశ మందలి ప్రతి వ్యక్తియు సంవత్సరమున కుపయోగించు కిలోవాట్ల విద్యుత్తుపై ఆధారపడియుండు నని సర్వత్ర ఆమోదింపబడిన సిద్ధాంతము. అనగా ప్రజా సంక్షేమమును, వినియోగ మగుచున్న విద్యుత్పరిమాణమును (కిలో వాట్ల సంఖ్యలో) బట్టి లెక్కించెదము. ఇదియే సాంకేతికముగా 'పర్ కాపిటా కన్సంప్షన్' (percapita consumption) అనబడుచున్నది.

గ్రామములయందు విద్యుచ్ఛక్తి సరఫరా యగుటచే అందలి ప్రజల ఆర్థికజీవితము అతిత్వరితముగ పరివర్తనము చెందుచున్నది. సహజముగ పేద స్థితియందుండి, జీవన ప్రమాణమును, ఉత్పత్తి పాటవమును అత్యంత హీనస్థితిలో నున్న గ్రామము, విద్యుత్ సరఫరా ఫలితముగా, ఉత్పత్తిశక్తి యందును, జీవన ప్రమాణము నందును ముందంజ వేయుచున్నది. విద్యుత్తువలన పెక్కు కార్యకలాపములలో మానవుడు తన శరీర శ్రమను తగ్గించుకొనుటయో, కాక కొన్ని రంగములలో అట్టి శ్రమతో అవసరమే లేకుండుటయో సంభవించుచున్నది.

ఎలెక్ట్రిక్ మోటారులవలన నీటిపారుదల ఈనాడు సుకర మయినది. అందుచే ప్రాచీనకాలము నుండియు ఎద్దుల సహాయముతో నీటిని తోడు విధానమునకు వ్యవసాయదారుడు స్వస్తి చెప్పగలుగుచున్నాడు. వ్యయశీల మైన అట్టి ప్రాచీన విధానము ఈనాడు క్రమముగా అంతమొందుచున్నది. విద్యుచ్ఛక్తివలన చెఱకును నలగ గొట్టుటకును, ధాన్యమును నూర్పిడిచేసి చెరగుటకును, ఇతర వ్యయసాయ కార్యక్రమములను కొనసాగించుటకును సాధనము లేర్పడినవి. అందుచే మానవుని శ్రమకు అవసరము తగ్గిపోవుచున్నది. వ్యవసాయ కలాపము లన్నియు చౌకగా, త్వరితముగా జరిగిపోవుచున్నవి. తత్ఫలితముగా, వ్యవసాయదారునకు విరామ మేర్పడుచున్నది. ఆ విరామమును వినోదములకును, ఇతర సాంఘిక కార్య క్రమములకును వినియోగించుకొన గల్గుచున్నాడు.

ఆధునికములైన పాడికేంద్రముల (Dairy Farming) యందును, కోళ్ళ పెంపకము (Poultry Farming) నందును, పాలుపితుకుట, గ్రుడ్లను పొదుగుట మున్నగు ప్రక్రియలందును విద్యుత్తు ప్రముఖమైన పాత్ర దాల్చుచున్నది. ఉద్యానకృషి రంగములో పండ్లరసమును శాస్త్రీయ పద్ధతులపై నిలువచేయగలుగుట వలన, తోట యజమాని విపణివీథిలో తన ఉత్పత్తి ఫలితముమ తన ఇష్టము వచ్చినప్పుడు ఎక్కువ లాభకరముగా అమ్ముకొనుటకు అవకాశము గల్గుచున్నది. తన ఫలములు చెడి పోవునను భయము ఆతనికి లేకపోవుచున్నది. అంతేకాక మార్కెటులో వాటిని చవుకపారుగా తెగనమ్ముకొన వలసిన దుస్థితియు తప్పుచున్నది. దీనికంతకును కారణము ఆతనికి విద్యుత్తు లభించుటయే. విద్యుత్తు వలన పండ్లరసమును నిలువచేయ గలుగుటచే తోట యజమానికి న్యాయమైన లాభము ప్రాప్తించుచున్నది. అందువలన ఆతడు క్రమబద్ధముగా తన ఉత్పత్తిని వివణి వీధికి వంప గలుగుచున్నాడు. మొన్న మొన్నటివరకు వండ్లరసమును నిలువచేయు విధానము భారతదేశములో అభివృద్ధి నొంద

510