Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8

లేదు. కొంతకాలమునుండి గ్రామీణ ప్రాంతములలో విద్యుత్తు లభించుటచే ఈ పరిశ్రమ ఇప్పుడు అభ్యుదయ పథమున పురోగమించుచున్నది.

విద్యుత్తు సహాయమున గ్రామ ప్రజలకు కలుగు ప్రయోజనములలో కొన్నిటినిగూర్చి మాత్రమే పైన ముచ్చటింపబడినది.

పైన పేర్కొనినవాటికి తోడుగా గ్రామసీమలయందు స్థాపింపబడుచున్న లఘుపరిశ్రమలయందును, గృహ పరి శ్రమలయందును విద్యుచ్ఛక్తి అతి ప్రధానమైన పాత్ర వహించుచున్నది. ఉదాహరణమునకు, పీచు పరిశ్రమ, తాళ్ళ పరిశ్రమ, ఇత్తడి పాత్రలను పాలిమ్చేయు పరి శ్రమ, కమ్మరి పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ. కుమ్మరి పరి శ్రమ ఇత్యాది పెక్కు లఘు పరిశ్రమలు విద్యుత్తు మూల మున పొదుపుతనమును (economy), సామర్థ్యమును, అధికోత్పత్తియును సాధింపగలవు. శతాబ్దముల నుండియు బండచాకిరిచేయ నలవాటుపడిన మానవున కీనాడు విద్యుత్తువలన విముక్తి చేకూరినది.

గ్రామ విద్యుదీకరణమునకు అవసరమైన పెట్టుబడిని గూర్చి విచారించినచో, అట్టి పెట్టుబడిని వెచ్చించుట లాభదాయకమైన విషయముకాదు. నగర ప్రాంతము లతో పోల్చి చూచినచో, దూర ప్రాంతములం దుండు గ్రామములకు విద్యుచ్ఛక్తిని అందించుట కష్టతరమైన విషయము. సాం కేతిక మైనవి ఇందులకు కారణములు గలవు. అట్లని ఈ సమస్యపట్ల ఉపేక్షాభావము గాని, ఉదాసీన భావము గాని వహింపగూడదు. గ్రామ సీమల యొక్క ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనములు దృష్ట్యా, ప్రజానీకము యొక్క సంక్షేమము దృష్ట్యా, విద్యుత్తును గ్రామసీమలకు వ్యాపింపజేయుట అభిలషణీయమైన అంశ ముగా గుర్తింపబడినది. అంతేకాని ఈ సమస్యను రూపా యలు, పైసల దృష్టితో విచారింపగూడదు. విద్యుదీకర ణమువలన గ్రామీణులనుండి ప్రభుత్వమునకు ఎంత ఆదా యము వచ్చునా అను ఆలోచనయే కూడదు. ఈ దృక్ప ధము ననుసరించియే భారత ప్రభుత్వమును, వివిధ రాష్ట్ర ప్రభుత్వములును గ్రామ విద్యుదీకరణ కార్యక్రమమునకు పూనుకొని వివిధ దశలలో దానిని అమలు జరుపుచున్నవి. ఈ ఆశయమును సాధించుటకై, పెట్టుబడి వ్యయమును

గ్రామవిద్యుదీకరణము

తగ్గించు నుద్దేశ్యముతో గ్రామీణ పరిస్థితులకనుగుణ్య మైన కొన్ని ఆర్థిక ప్రణాళికలను గూడ ఆచరణయం దుంచుచున్నవి. ఈ కార్యక్రమమును కొనసాగించుటకై వడ్డీ లేనట్టియు, వాయిదాల పద్ధతిపై వడ్డీ చెల్లించు నట్టియు దీర్ఘకాలిక ఋణములు సేకరింపబడుచున్నవి.

ఆంధ్రరాష్ట్రములో విద్యుదీకరణ కార్యక్రమము ఎంతవరకు ముందడుగు వేసినదో విచారించుదము. మన రాష్ట్రములో 3 కోట్ల 50 లక్షలమంది ప్రజలు కలరు. రాష్ట్ర విస్తీర్ణము 1.08 లక్షల చ. మైళ్ళు; గ్రామములు 26,500. నూటికి దాదాపు 80 శాతము ప్రజలు గ్రామ ములలో నివసించుచున్నారు.

ప్రథమ పంచవర్ష ప్రణాళి కాంతమునకు (1956 మార్చి) 700 గ్రామములు మాత్రమే విద్యుదీకరణము గావింప బడెను. కాని రెండవ ప్రణాళికదశయందు (1956 ఏప్రిల్ నుండి 1961 మార్చి వరకు) విద్యుదీకరణ కార్యక్రమము చాల చురుకుగా సాగుటచే, అదనముగా 2450 గ్రామము లును, నగరములును విద్యుదీకరణము గావింపబడెను. రాష్ట్రమందలి జిల్లా, తాలూకా ముఖ్య కేంద్రములన్నియు విద్యుదీకరణము గావింపబడెను. ఇట్లు విద్యుదీకరణ మొనర్పబడిన గ్రామములసంఖ్య మొత్తము 3150 వరకు పెరిగెను. పెరి గెను. రెండవప్రణాళిక కాలములో ఒక గ్రామవి ద్యుదీ కరణమునకై 19 కోట్ల రూప్యములు వ్యయపరుపబడెను. 1956 మార్చి నెలాఖరునకు వ్యవసాయదారులకు విద్యు తుతో సహా సరఫరా చేయబడిన పంపు సెట్లు (pumpsets) 4,800 మాత్రమే కాగా, 1961 ఏప్రిల్ మాసాంతమునకు దాదాపు అట్టి సెట్లు 18,000 సరఫరా చేయబడెను. రా రాష్ట్ర మంతటిలో 1961 మార్చి నెలాఖరునకు విద్యుత్తును విని యోగించెడి గ్రామీణులసంఖ్య 2,68,000 వరకు పెరి గెను. అదనముగా సంవత్సరమునకు 500 గ్రామములచొప్పున విద్యుచ్ఛక్తిని ప్రవేశ పెట్టుటకు అవకాశ మేర్పడెను.

కాని ఇంతవరకు జరిగిన ఈ యభివృద్ధిని బట్టియైనను, రాష్ట్రములోగల 26,500 గ్రామములలో నూటికి 12 శాతముగల గ్రామములలో మాత్రమే విద్యుత్తు ప్రవేశ పెట్టబడెను. 1961 మార్చి ఆఖరుకు తల ఒకటికి 15 యూనిట్ల విద్యుత్తు మాత్రమే వినియోగమయ్యెను. 3వ ప్రణాళికాంతమునకు (1968 మార్చి) 40 యూనిట్లవరకు