Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3 485 గోలకొండ సుల్తానులు

చిత్రము - 130

పటము - 4

మోతీమహల్ సింహద్వార కవాటమునకుగల ఘనమైన గుబ్బర్దము కలదగుటచేత, మూసీతీరమున సుందర నగరముగా భాగ్యనగరమును నిర్మించిన తర్వాత గోలకొండ ప్రాభవము క్రమముగ సన్నగిల్లినది. మహమ్మద్ ఖులీ రసజ్ఞుడు, మహాకవి, పరిపాలనా దక్షుడు, భాగ్యనగర నిర్మాణ మను సుందర స్వప్నమును రూపొందించినవాడు. ప్రియాపరి రంభసౌఖ్యరసై కలోలుడయ్యు, ప్రజాహితై కాభిలాషిగా వరలినవాడు. ఈతని ఏకైక దుహిత హయాత్ బక్ బేగమ్. ఈ రాజకుమార్తె పట్టపురాణికి జన్మించినదని స్థానిక చరిత్రకారులు అభిప్రాయ పడుచున్నను, ఈమె భాగ్యమతి యొక్క కుమార్తె యనియే ప్రబలమైన జన శ్రుతి కలదు. ఈమెను సుల్తాన్ మహమ్మద్ అను నాతనికిచ్చి 1607 లో వివాహము గావించిరి.

మహమ్మదు ఖుతుబుషా : మహమ్మద్ ఖులీ త ర్వాత సుల్తాన్ మహమ్మద్ గోలకొండ ప్రభు వయ్యెను (1612- 1626). కాని అతడు తన 84 వ ఏటనే మరణించెను.

అబ్దుల్లా ఖుతుబుషా : ఇతడు బాలుడుగా నుండుటచే తల్లియగు హయాత్ బక్షీ బేగమ్ రాజ్యరక్షణ భారమును స్వీకరించి, కుమారుడగు అబ్దుల్లా ఖుతుబ్ షాకు (1626- 1672) చేదోడుగా నుండెను. గోలకొండ పట్టపు రాణు లలో హయాత్ బక్షీ బేగము గొప్ప అదృష్టవంతురాలని చెప్పవచ్చును. ఏల యన ఈమె తండ్రి, భర్త, కుమారుడు వరుసగ గోలకొండ సుల్తాను లగుటచేత ఈమె రాజ కుమార్తెగను, పట్టపురాణిగను, రాజమాతగను మూడు కాలాలపాటు సుఖముగా జీవించి మహోన్నత దశను అనుభవించిన భాగ్యమతి ఈమె.

అబుల్ హసన్ కుతుబుషా : కుతుబషాహి వంశ మున చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా (1672_1687). అక్కన్న మాదన్నల మూలమునను, భక్త రామదాసు మూలమునను తెలుగువారికి సుపరిచితుడైన భోగియు, విలాసజీవియు నైన తానాషా ఈతడే. మహోన్నత ప్రాభవ వై భవముల ననుభవించిన గోలకొండ రాజ్యము ఈతని కాలమున మొగలు సామ్రాజ్యాధిపతుల దృష్టి నాకర్షింప గలిగినది. స్వయముగ ప్రభువు భోగలాలసు డగుటచేతను, హిందూ మంత్రులగు అక్కన్న మాదన్నల ప్రాభవమును ద్వేషదృష్టితో చూచిన మొగలుల అగ్రహ మునకు గురియగుటచేతను, దురాశాపరులును, మూఢా త్ములు నైన మహమ్మదీయుల విద్రోహచర్యల ఫలితము గను, గోలకొండ రాజ్యము కొన్ని మాసములలో ఔరంగ జేబు వశమయ్యెను. క్రీ.శ. 1687 లో సుల్తానుల ధ్వజము గోలకొండదుర్గమునుండి తిరోధానము నొం దెను.

ఇక గోలకొండ యుగమునకు సంబంధించిన ఇతర విష యము లెన్ని యోకలవు. గోలకొండసుల్తానుల ప్రజాహిత కార్యములు, కట్టడములు, వాఙ్మయ పోషణము, నాటి సాంఘిక పరిస్థితులు, మున్నగునవి చరిత్రకారుల దృష్టి నాకర్షించినవి.

ప్రజాహితకార్యములు; కట్టడములు : గోలకొండ సుల్తా నులు పెక్కు ప్రజాహిత కార్యముల నొనర్చిరి. అందు హర్మ్య, ప్రాసాద, తటాకాది నిర్మాణములు ముఖ్య మైనవి. గోలకొండను స్మరించుసరికి మొదట మన మనః ఫలకమున ప్రతిబింబించునది గోలకొండ దుర్గము. ఆంధ్ర ప్రాంతమునగల సుప్రసిద్ధములైన దుర్గములలో నిది