Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొడ సుల్తానులు


గోలకొండ దుర్గమున నిర్మాణదశయందున్న యొక మశీదు నకు నమాజు నిమి త్తమై వచ్చిన తండ్రిని వధింపజేసెను (1548). ఇంతియే కాక రాజ్యము నాక్రమించుకొనిన తర్వాత రహస్యములు తెలిసికొని యుండిన దుర్గపాల కుని వధింపచేసిన కఠినహృదయుడు జమీదు. దేశ ప్రజలు, అధికారవర్గమువారు, జంషీద్ కుతుబ్ షాసుల్తాను ప్రవర్త నమును ఏవగించుకొనిరి. సోదరుడైన ఇబ్రహీం విజయ నగరము చేరి, మహమ్మదీయ చరిత్రకారులవలన 'రాయ్ ఆజమ్'గా కీర్తింపబడిన అళియ రామరాయలను శరణు వేడెను. ఈ విధముగ దాదాపు ఏడు సంవత్సరముల వరకు నిరంకుశముగ పాలించి జమీర్ ఖుతుబ్ షా' మరణించెను (1550). కొన్నాళ్లవరకు సుభాన్ ఖులీ నామమాత్రముగ పాలించెను. పిదప విజయనగరము నుండి ఇబ్రహీం కుతుబ్ వచ్చి గోలకొండ సామ్రాజ్యాధిపత్యమును స్వీకరించెను (1550).

ఇబ్రహీం కుతుబ్షా : తెలుగు కవులచేత 'మల్కిభ రాము'గా ప్రశంసింపబడిన గోలకొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్షాషాయే. సుల్తాన్ ఖులీ తర్వాత రాజ్యభారమును అత్యంత సామర్థ్యముతో నిర్వహించిన ఇబ్రహీం కుతుబ్ షా ప్రశంసాపాత్రుడు. ఈతడు రాజ్యమును స్థిరపరచుట యే కాక, నిర్మాణ కార్యకలాపములందు కూడ అధికముగ కృషి సలిపినవాడు. కత్తిని, కలమును ఏక ధాటిగా నడపిన మహనీయుడు. ప్రజాసం క్షేమ కార్యములను రూపొందిం చుటలోను, రాజ్య వి స్తరణ బాధ్యతను స్వీకరించుటయం దును కవియై, పండితుడై, కవిపండిత పోషకుడై వాఙ్మ యమును పోషించుట యందును, కుల మత వర్గ తము లేక అశేషజనాదరణము నొందుటయందును, 8 హీం కుతుబ్ షాకు సాటియగు మరియొక గోలకొండ సుల్తాను లేడనియే చెప్పవచ్చును. ఇట్టి మహనీయ బహు గుణ విరాజితుని కీర్తి కాయమున స్వామిద్రోహ రూప కళంక మేర్పడుట దురదృష్టము. దాదాపు ఏడు సంవత్స రముల వరకు అళియ రామరాయల భుజదండము నా నాశ్ర యించియుండి తాళికోట యుద్ధమున (1565) అతని పరాజయమునకు కారకులైనవారిలో ఇబ్రహీం ఒకడై యుండెనని గ్రహించినవారు 'ఇబ్రహీమును' స్వామి ద్రోహిగ పరిగణింపక మానరు.

484 చిత్రము - 128 పటము - 2 "ఫతేదర్వాజా" సంగ్రహ ఆంధ్ర

మహమ్మదు ఖులీ కుతుబుషా : ఇబ్రహీం మరణానంత రము ఆతని మూడవ కుమారుడు మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా గోలకొండ రాజ్యాధికారి యయ్యెను (1560- 1612). హైదరాబాదు నగరమును స్థాపించినవా డీతడే (1591). ఈ సుల్తాను భాగ్యమతి యను హిందూసుందరిని ప్రేమించి, వివాహమాడి ఆమె పేర భాగ్యనగరమును నిర్మించెను (1591). కాని దర్బారులోని మహమ్మదీ యానుచరుల తీవ్ర విమర్శలకు గురియగుటచే మహమ్మదు ఖులీ ఖుతుబుషా భాగ్యమతికి 'హైదర్ మహల్' అను బిరుదము నొసగి, భాగ్యనగర మను పేరును హైదారా బాదుగా మార్చెను. గోలకొండ ప్రాంతము జనసమ్మ