Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3

మగుటకు సంక ల్పించుకొని ప్రభువుయొక్క అనుమతి నర్థించెను. కాని స్నేహప్రియుడగు మహమూదుషా, సుల్తాన్ ఖులీని వెడలనీయలేదు. కాలక్రమమున దేశములో ఒకా నొక ప్రాంతమున చెలరేగిన విప్లవమును అణచుటలో తోడ్పడి, తనకుగల గణితశా స్త్రాది విద్యలయందలి ప్రావీణ్య మును ప్రదర్శించి, బీదరు సుల్తాను మన్ననలనొంది, బిరుదు సత్కారములచే పూజితుడై సుల్తాన్ ఖులీ ఒక గ్రామాధి పత్యమును సంపాదించుకొనెను. ఇంతలో తెలంగాణా సుబేదారు మరణించెను. తర్వాత తత్కార్యభారమును నిర్వహించు నిమి త్తము సుల్తానుఖులీ నియుక్తుడయ్యెను. (1496). కొన్ని సంవత్సరములవరకు సుబేదారుగా నుండి సుల్తాన్ ఖులీ, మహమూద్ యొక్క మరణానంత ర ము క్రీ. శ. 1512 లో గోలకొండ ప్రాంతమున స్వాతంత్ర్య మును ప్రకటించెను. ఈ సంఘటన క్రీ. శ. 1518 ప్రాంతమున జరిగియున్నట్లు కొందరు మహమ్మదీయ చరిత్రకారులు విశ్వసించుచున్నారు.

నాటి తెలంగాణాసుబా, కోహిరు-వరంగల్లుల మధ్య ప్రాంతము నావరించియుండెను. ఈ ప్రాంతమునకు అధిపతియై, స్వతంత్రుడై రాజ్యస్థాపన మొనర్చిన సుల్తాన్ ఖులీ బలవంతుడై ఇరుగుపొరుగు ప్రాంతములను, దుర్గ గోలకొండ సుల్తానులు ములను జయించుకొనుటకు సంకల్పించుకొనెను. సంక ల్పించుకొని, రాచకొండ, దేవరకొండ, కొండపల్లి, కంభముమెట్టు, మెతుకు, పానగల్లు, కోయిలకొండ దుర్గములను క్రమముగ అచిర కాలమున సాధించి ఆక్రమించెను. ముప్పది సంవత్సరముల పరిపాలానా మున, సుల్తాన్ ఖులీ గోలకొండ రాజ్యమునకు గట్టిపునాదు లేర్పరచెను. ఒక విజయనగర ప్రభువులను మాత్రము ఎదుర్కొని పరాజితుడయ్యెను.

30. సుల్తాన్ ఖులీకి హైదర్, జమీదు, ఇబ్రహీం అను మువ్వురు కుమారులుండిరి. ఇంకను మువ్వురు కుమారు లుండిరనియు, వారేనాడో మరణించిరనియు కొందరు చరిత్రకారు లూహించుచున్నారు. ఆ మువ్వురు కుమారులలో నొకరిద్దరు విద్రోహచర్యలకు పాల్పడినందున బందీ, కృతులై యుండిరని కొందరి యూహ. హైదర్ ఖులీ అను కొడుకు సుల్తాన్ ఖులీ జీవిత కాలముననే మరణించెను.

జమీదుఖులీ-ఇతడు మొదటి నుండియు తండ్రి రాజ్యము నాక్రమించుకొనవలయునని విద్రోహచర్యల నొనర్చు చుండెను. తత్ఫలితముగ అతడు గోలకొండదుర్గమున బంధింపబడెను. కా రాగారమున నుండి కూడ రాజ్యమును చేబట్టవలయునని సంకల్పించి, ఒక దుర్గపాలకుని లోగొని

చిత్రము - 128 పటము - 2 క్రిందిభాగముననున్న బురుజులు 483 - సాధారణ దృశ్యము