Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ సుల్తానులు సంగ్రహ ఆంధ్ర


చిత్రము - 127 పటము - 1 గోలకొండ దుర్గము

చుండిరి. ఆ కారణమున వీరు విజయనగర సమ్రాట్టులకు కంటక ప్రాయులై యుండిరి. సమయానుకూలముగ వివిధ మండలాధిపతులతో చేతులు కలిపి తమ స్థానములను స్థిర పరచుకొనుటకై మహమ్మదీయులు అహోరాత్రములు కృషిసలిపిరి. విజయనగర ప్రభువుల ఔదార్యముకూడ కొంతవరకు వీరికి అనుకూలమయ్యెను. మహమ్మదీయుల రాజకుటుంబములలో ప్రస్తుతము పేర్కొనదగినది గోల కొండ సుల్తానులను గూర్చియే. కొంతవరకు దేశ ప్రజల యొక్క సంస్కృతికి దోహదమొనర్చి, భాషాపోషణ మొనర్చి గౌరవమునకు పాత్రమైనది ఈ గోలకొండ కుతుబుషాహి రాజకుటుంబమే (1512 - 1888). ఈ కుటుంబము 66

గోలకొండ సుల్తాన్ ఖులీ : ఈతడు తుర్కిస్థాన్లోని

ఈతడు తుర్కిస్థాన్లోని

సుప్రసిద్ధ కుటుంబమునకు చెందినవాడు. వారు వీరాధివీరులై దక్షిణ ఇరాన్ లోని “హమ్దన్ "అను దానిని రాజధానిగచేసికొని దేశమును పాలించి కీర్తి నొందిరి. అట్టి రాజన్యులలో పీర్ ఖులీ సుప్రసిద్ధుడు. ఈతడు హమ్దన్ లోని సంపన్నుడగు 'మలిక్సాలె' అను నాతని కుమా ర్తెయగు "మరియమ్ ఖాతూన్" అను నా మెను వివాహమాడెను. ఈ దంపతులకు జన్మించినవాడే గోల కొండ రాజ్యస్థాపకుడుగ కీర్తింపబడుచున్న సుల్తాన్ ఖులీ కుతుబుషా అను నాతడు.

దేశమున శత్రువర్గము విజృంభించి, సుల్తాన్ ఖులీకి ప్రాణభయ మేర్పడినందున అతడు తండ్రి ఆనతి ననుసరించి హిందూ దేశమునకు వచ్చెను. కొందరు చరిత్రకారు లీతని రాక కేవలము గుఱ్ఱములు వ్యాపారము నిమిత్తమే యై యుండెనని భావించుచున్నారు. ఏది యెటులున్నను సుల్తాన్ ఖులీ మాత్రము హిందూ దేశ మువచ్చి దక్కనులో బీదరు ప్రాంతమును పాలించుచున్న మహమూద్ షా దర్బారులో ప్రవేశించెను. ఆనాడు విదేశములనుండి వచ్చిన మహమ్మదీయులకు బీవరు దర్బారు సముచితముగ ఆతిథ్య మొసగుచుండెను. సుల్తాన్ ఖులీకూడ రాజును సందర్శించి, ఆతని ఆశ్రయమును సంపాదించుకొని స్థిరనివాస మేర్ప రచికొ నెను. మహమూద్ షా క్రమముగ సుల్తాన్ ఖులీ పాండితీగరిమను, దక్షతమ గ్రహించి ఆతనిని ఆద రిం చెను . కొంత కాలము తరువాత మాతృదేశమున ప్రశాంత వాతా వరణ మేర్పడినందున సుల్తాన్ ఖులీ తనదేశ మునకు పయన