Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 గోలకొండ పట్టణము

బీదలకు అన్న దానము, విద్యార్థులకు వేతనములు విద్వాంసు లకు సత్కారములు జరిగెడివి. 'నౌరోజా' (పర్షియనుల ఉగాది) ఉత్సవ మారంభ మయిననాడు సుల్తాను ఆస్థాన జ్యోతిష్కుల వలన సంవత్సర ఫలములను చెప్పించుకొను చుండెను. సామంతులు ఇట్టి ఉత్సవ సందర్భములందు కప్పములు చెల్లించుచుండిరి.

వసంతోత్సవము తెలుగువారికి ప్రియతమ మైనది. రెడ్డి రాజుల కాలమునుండి ఈ ఉత్సవములు మహావై భవ ముతో జరుగుచు వచ్చినవి. ఢిల్లీసుల్తానులలో అమీరు ఖుస్రో కాలమునుండి వసంతోత్సవములు మహమ్మదీయు లకు అభిమాన పాత్రములైనవి. వారు వసంతోదయ మున చిగిర్చిన పుష్పములను పెద్దల సమాధులపై నుంచెడి వారు. స్త్రీలు కేశములను పుష్పములచేత అలంకరించు కొనెడివారు. గులాబిరంగు వస్త్రములను ధరించెడి వారు. కుతుబుషాహీ సుల్తాను లీవిధముగ వసంతుని ఆగమనము నకు సంతసించి, తమ ఉత్సాహమును వివిధరీతుల ప్రద ర్శించుచుండిరి. కుతుబుషాహీ ప్రభువులలో మహమ్మదు కులీకి అత్యంతా మోదమును, ఉల్లాసమును కూర్చునట్టిది మృగశిరాప్రవేశోత్సవము. ఈ చక్రవర్తి వర్షర్తువులో విహారమునకు బయలుదేరెడివాడు. విలాసముగ కొన్ని వారములు ఆనందమున కాలక్షేపము చేసెడివాడు. 'కోహినూర్ ' భవనమునకు సపరివారముగ వెడలి అచ్చట అనుక్షణము ప్రియాపరిరంభణ సుఖాసక్తుడై మహమ్మదు కులీ మైమరచుచుండెను. చందనము. కస్తూరి, కర్పూ రము, కుంకుమపువ్వు మున్నగువాటి వాసనలచే ఆతని సౌధ భాగములును, నగరమును గుబాళించుచుండెను. నగరోద్యానములందుగల ద్రాక్షలు రసధునులై, సుంద రాంగనల నవయౌవనమును, ప్రేయసీ ధమ్మిల్ల సుమ సౌరభములను, కామినీచంచల నేత్రాంచల కజ్జల రేఖాలం కృతులను తమలో రంగరించుకొని, అంతఃపుర ప్రాసాద ప్రాంగణములందు, పానశాలలందు ప్రవహించి, భాగ్య మతీ హృదయ విహారి యగు మహమ్మదు కులీని బ్రహ్మా నంద మగ్ను నొనర్చుచుండెను.

గోలకొండ సుల్తానుల కాలమున రంజాను, మొహరము వంటి పండుగలు ప్రత్యేక వైభవము కలవై యుండెను. ప్రభుత్వముచే వేలకొలది ధనము వెచ్చింపబడుచుం డెను. 477

ఆలంను స్థాపించి రోదన దినములవరకును ఈ పండుగలు మహమ్మదీయ మత సంప్రదాయానుగుణముగ జరుగు చుండెను. ఇందు హిందువులు సమధిక సంఖ్యలో పాల్గొను చుండిరి. నేటికిని హైదరాబాదులో జరుగు మొహరం పండుగలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొను చున్నారు. పట్టాభిషేక వసంతోత్సవాది సందర్భము లందేకాక, సామాన్యకాలము లందును, మహమ్మదీయ సుల్తానులు, అధికారులు, ధనికులు, భోగలాలసత్వమున జీవించు చుండిరి. గోలకొండ రసికుల చిత్తవృత్తి ననుసరించి వేలకొలది వేశ్యాంగనలు, గోలకొండలో స్థిరనివాసముల నేర్పరచుకొనిరి. ఆ కాలమున దాదాపు 25 వేల వేశ్య లుండిరని అనేకములయిన ఆధారములవలన తెలియు చున్నది. రాజులు తమ ఉంపుడుకత్తెలకు ప్రత్యేక మందిర ములు నిర్మించెడివారు. ఇరాను తుర్కీ దేశ ములనుండి వచ్చిన సుందరాంగనలుకూడ రాజాంతఃపురములలో చెలికత్తెలుగ ప్రవేశించిరి. గోలకొండ రాజులలో మహమ్మదు కులీయు, తానీషాయు, రసికులుగ ప్రశస్తి నొందిరి. మహమ్మద్ కులీకి ప్రియురాండ్రెందరో ఉండిరి. వారిలో భాగ్యమతి, మహమ్మదు కులీ హృదయ దేవతయైయుం డెను. భాగ్యనగర నిర్మాణము, ఆమె స్మృతిచిహ్నముగ నేటి హైదరాబాదు రూపమున, కనులపండుపై ఒప్పుచున్నది. సరోజిని, పద్మిని, మున్నగుప్రియురాండ్రు అతని హృదయమును తమవళ మొనర్చుకొనియుండిరి. గోలకొండ నగరోద్యానములనుండి వీచిన మందమారుత ములు ప్రేయసీ ప్రియుల ప్రణయ సౌరభ సంవాసితములై వందలకొలది ప్రేమగాథలకు ఊపిరిపోసినవి. ప్రియురాండ్ర పేరనిర్మితము లయిన ఉద్యానవనములు, మందిరములు, శిథిలములై నామమాత్రావశిష్టములై, గోలకొండ సుల్తానుల రసి కత్వమును వేనోళ్ళ కీర్తించుచున్నవి. గోలకొండ నగర మునగల వేశ్యలలో నృత్యము చేయువారికి ప్రభుత్వము వలన కొంత ధనము బ త్తెమురూపమున లభించుచుండెను. వేశ్యలకు నాయకురాండ్రుండిరి. తమ నాయకురాండ్ర ద్వారా వారు వారమున కొకసారి అధికారులను దర్శించుచుండిరి.

గోలకొండ సుల్తానులు తమతమ మత సంప్రదాయ