Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3

వ్యక్తుల పేర ప్రసిద్ధినొందినవి. ఉదా: మీరుజుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా. కొన్ని వీథులు, ప్రాంతములు 'కమా'ను లనబడు చుండెను. హర్షికమాన్ మున్నగు నవిట్టివే. ఈ సంప్రదాయము నేటికిని హైదరాబాదులో నిలచియున్నది. చార్ కమాన్, మళ్లీ కమాన్, అను వాటి పేర చార్ మినారు వద్దగల ప్రాంతమును వ్యవహరించు చున్నారు. మరి కొన్ని ప్రాంతములందు హవుజులుండుట వలన అవి హవుజుల పేర ప్రసిద్ధినొందినవి. ఉదా: కటోరా హవుజు.

గోలకొండలోగల రాజసౌధములు మహలులని వ్యవహారమును గాంచినవి. మంత్రులనివాస గృహములు, రాజాధికారులు సౌధములు, రాయబారులకు, విదేశాగం తకులకు తగిన విశ్రాంతి మందిరములు, సైనికులకు తగిన వసతి సౌకర్యములు అన్నియు — ఇందుకలవు. రాజ సైనికులు ప్రాసాదములకు సమీపమున నే కల్పింపబడినవి. తుపాకిగుండ్లు, యుద్ధ పరికరములు కల భవనము లీ ప్రాంతమునగలవు.

చిత్రము - 125 పటము - 4 ఇబ్రహీం కుతుబ్షా సమాధి

వసతులు

గోలకొండ దుర్గమునకు దాదాపు 87 బురుజులును, 8 ప్రధాన ద్వారములును కలవు. ఇట్టి ప్రధాన ద్వార ములను దర్వాజాలు అనుచుండిరి. బంజా రాద ర్వాజా, ఫత్తేదర్వాజా వాటిలో ముఖ్యమైనవి. మొన్నటి వరకును హైదరాబాదు నగరమును ఆవరించిన కోటలకు ప్రధాన ద్వారములు నాలుగు దిక్కులం దుండినవి. ప్రయాణ సౌకర్యముల దృష్టితో నగరమును విస్తృత పరచుటకై ప్రభుత్వమువారు ఇటీవల ఢిల్లీ దర్వాజా, లాల్ దర్వాజా, గౌలిపురము దర్వాజ అను వాటిని పడగొట్టించిరి. పురా త త్త్వశాఖవారు చరిత్ర ప్రసిద్ధ మయిన ఫత్తే ద ర్వాజాను చారిత్రక ప్రాధాన్యముగల కట్టడమని గుర్తించి భద్ర ముగ కాపాడినారు..

సామాన్య గృహము లన్నియు, ప్రాద్దక్షిణో త్తర దిశలందుండ, రాజసౌధములు పడమటి దిశయందు నిర్మి తము లైనవి. సామాన్య గృహముల విషయము తెలి యదు కాని, రాజసౌధముల శిథిలముల వలనను, చెక్కు చెదరని కోటగోడల వలనను, నాటి సౌధనిర్మాణ పద్ద తియు, ఇంజనీర్లు సమకూర్చిన సౌకర్యములును తేటపడు చున్నవి. కోటలోని సౌధములు మూడేసి, నాలుగేసి, A ఐదేసి అంతస్తులు కలవిగా నున్నవి. గోలకొండ పట్టణము కలవిగా నున్నవి. ఈ మందిరముల పై భాగమున నేటి రూఫ్ గార్డెన్సు (Roof Gardens) వంటి చిన్న తోటలు కలవు. భవనములందు విశాలమైన గదులు కలవు. స్నానము చేయుటకు, భోజనము చేయు టకు, విశ్రాంతినొందుటకు ప్రత్యేకముగ గదులు నిర్మింప బడినవి. ఎంత ఎత్తైన ప్రదేశమునకైనను, మట్టి గొట్ట ములద్వారా, నీటి నందించుటకు సౌకర్యములు కల్పింప బడినవి.

సౌధ ప్రాంతములందు చక్కని ఉద్యానవనములు, ద్రాక్షవనములు, జలాశయములు, దుర్గ తటాకములు కలవు. కటోరాహవుజునుండి భూగర్భమున మందిరము