Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ పట్టణము సంగ్రహ ఆంధ్ర

కొనిరి. సుల్తాన్ నగరము, నయాఖిల్లా, హైదరాబాదు మున్నగునవి నిర్మింపబడినవి.

మొదటి గోలకొండ పట్టణము దుర్గప్రాకారమధ్యగత మున నిర్మింపబడినది. మూడు ప్రాకారములతో అలరా రిన గోలకొండ దుర్గము యొక్క కైవార మేడు మైళ్ళు. గోలకొండ నగరమునందు కాంక్రీటుతో నిర్మింపబడిన 50 వేల గృహము లుం డెననియు, నగరమున దాదాపు రెండు లక్షల పరిమితికల జనసంఖ్య ఉండెననియు, చరిత్ర కారులు అంచనా వేసిరి. కాని పరిసరప్రాంతములను, విస్తృత నగర వైశాల్యమును గమనించినచో గోలకొండజనాభా అంతకు మించి యుండు ననవచ్చును. నగరాభివృద్ధికై గోలకొండ సుల్తానులు దాదాపు 78 లక్షల హోనులు వ్యయమొనర్చిరి.

గోలకొండ నగరమన కేవలము సామాన్యప్రజలు నివ సించు వీథులుగల ప్రాంతమే కాదు. దుర్గమున నిర్మిత ము లైన సౌధములు, అక్కడి ఉద్యోగులు, రాజాధి కారులు, రాజులు, అంతఃపుర స్త్రీలు మున్నగువారి నివాసగృహ ములు అన్నియు నగర పరిధిలో చేరును. గోలకొండకు దూరమున నిర్మితములయిన కొన్ని భవనములు, శ్మశాన వాటికలుకూడ నగరమున చేరును. నగర పరిధినుండి దుర్గ ప్రాంతమును తదితరప్రాంతములను తొలగించుట సమం జనము కాదు.

గోలకొండ పట్టణమును నిర్మించుటకు తగిన పథక ములను దీర్చినవాడు 'ఆజంఖాను' అను ఇంజనీరు. విస్తృత గోలకొండ నగరనిర్మాణమునకు తదనంతరము భాగ్య నగర నిర్మాణమునకు, నాజర్ - ఉల్ - ముల్క్ వంటి ఇంజనీర్లు ఎందరో పథకములను సిద్దము చేసిరి.

గోలకొండనగరమును మూడు ప్రధాన భాగములుగ విభజింపవచ్చును. (1) సామాన్యప్రజానీకము నివసించు భాగము, విపణివీథులు, వర్తక కేంద్రములు మున్నగు నవి. (2) రాజసౌధములు, అధికారులని వాసగృహములు సైనికులు వీధులు మొదలగునవి. 3) విస్తృతనగర (8) ప్రాంతము.

తొలిదశయందు మొదటి ప్రాకారమునకును రెండవ ప్రాకారమునకును మధ్యగల ప్రాంతమున గోలకొండ నగరము నిర్మితమైనది. ఇచ్చట సామాన్యప్రజలు నివసించు టకు తగిన సౌకర్యములు కలిగించబడినవి. ఈ ప్రాంత మునగల వీధులు 'మొహల్లా'లని వ్యవహరింపబడినవి. గోలకొండనగరమునందు మీరుజుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లాలవంటి వెన్ని యో యుండెను. నేటికిని హైదరా బాదులోగల కొన్ని వీధులు మొహల్లాలనియే వ్యవహ రింపబడుచున్నవి. రాజమొహల్లా. పంచమొహల్లా — మొదలగునవి యిట్టివే. గోలకొండలోని మొహల్లాలు

చిత్రము - 124 పటము 3

కుతుబ్షాహి యొక్క సమాధుల సాధారణ దృశ్యము 472