Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ పట్టణము సంగ్రహ ఆంధ్ర

లకు మట్టిగొట్టములు అమ ర్పబడి యున్నవి. వేడినీళ్ల సప్లయి కొరకు ప్రత్యేక మయిన గొట్టము లమర్ప బడినవి. నదీతీరమున నగర నిర్మాణ మొనర్చుట శ్రేయ స్కరమను ప్రాచీనుల ఆశ యమును సవాలు చేయు టకో యనునట్లు గోల కొండయందలి ఇంజనీర్లు జలాశయములను, హవు జులను, బావులను, దుర్గ తటాకములను, నిర్మించి. ప్రజలకు, రాజులకు నీటి సౌకర్యములు కలిగించు టయే కాక, ఉపరితలో ద్యానములకు, ద్రాక్షవన ములకు, సుందరోద్యానములకు, నీటినందించుటకు పెక్కు ప్రయత్నములు కావించిరి.

సైనిక ప్రాధాన్యముగల దుర్గమునందు కళాదృష్టితో, సుందర నగర నిర్మాణమునకు సంకల్పించుట కుతుబు షాహీ సుల్తానులకును, నాటి ఇంజనీర్లకును గౌరవకారణ మైనది. బాలాహిస్సారు ప్రాంతమున రెండు కమానులు గల భవనములు కలవు. దీని సమీపమున విశాలమైన అవరణమున్నది. ఇచ్చట గోలకొండ సుల్తానులు సైనిక వందనమును స్వీకరించెడివారు. ఈ ఆవరణమును "జల్వే ఖానా అలీ" అందురు. దీనికి కొలనిదూరమున మూస బురుజు కలదు. ఈ బురుజునకును ఫతేదర్వాజాకును మధ్య ఎన్నియో శిథిలములు కలవు. కోటపైని రాజసౌధము లలో తొమ్మిది సౌధములు సముదాయముగగల సౌధ రాజము, 'మోతీమహలు' అనునది.

చిత్రము - 128

పటము - 5

మహమ్మదు కులీకుతుబ్‌షా సమాధి

రాజప్రాసాదముల సమీపమున రాయబారులు, విదే శీయులు నివసించుటకు సౌధములు నిర్మింపబడినవి. ఈరాన్ దేశపు రాయబారి వచ్చినపు డీ భవనమునందే అతనికి సమస్త సౌకర్యములు కలిగించబడినవి. ప్రభువులు దర్భారుచేయుటకు తగిన భవనములు కలవు. రాజ సింహాసనము 'దీవాన్ ఖాన్' అను భవనమున గలదు. న్యాయ సభలందు ప్రజలువచ్చి తమ కష్టనిష్ఠురములను విన్నవించు కొనుటకును, వారు కూర్చుండుటకును తగిన వసతులు కలవు. 'దౌలత్ ఖానా' అనునది దర్భారుహాలుగ సుప్రసిద్ధ మైనది. బాలాహిస్సారు ప్రాంతముననే 'తానాషాగద్ది' అని ప్రసిద్ధివహించిన రెండంతస్తుల భవనము గలదు. 'నగీనా బాగు' అను ఉద్యానవనమొకటి కలదు. జింకల రక్షణము కొరకు గోలకొండ సుల్తానులు ప్రత్యేకోద్యానమును నిర్మించిరి. ఈ వనమునగల జింకలను బాధించుటగాని చంపుటగాని తగదని రాజాజ్ఞ యుండెను. గోలకొండ ప్రాంతమున కొన్ని రాజప్రాసాదములు నిర్మింపబడినవి. ఇవి కోటకు కొన్ని మైళ్ల దూరమున గలవు. మహమ్మదు కులీ హుస్సేన్ సాగరము సమీపమున 'Black Hills' ప్రాంతమున వేసవి విశ్రాంతిగృహమును కట్టించుకొనెను. వర్షర్తువులందు కొన్ని దినములు సుఖముగ కాలక్షేపము చేయుటకు 'మహల్ కోహినూర్ * అను భవనమును కట్టించెను. ఈ భవనము ప్రస్తుతము 'ఫలక్ నుమా' సౌధ ముగల ప్రాంతమున నిర్మితమై యుండెను.

గోలకొండ నగరమున రాజసౌధములకు సమీపమున