Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3


ఆహార పానీయములు: గృహజంతువులు, పెంపుడుజంతువులు మానవుడు భుజించు ఎట్టి యున్న శక్తిని ఇతరపదార్థములు పూరించగలుగుటయే ఆహారమునైనను కుక్కలు తినగలవు. తియ్యని పదార్థ ములు కుక్కలకు హానికరములను జనవాక్యము కలదు. కాని ఈ అభిప్రాయము నిరాధారమైనది. యధార్థము నకు కుక్కలు తియ్యని పదార్థములను ముట్టనే ముట్టవు. వరి, గోధుమ, జొన్న ధాన్యములతో తయారైన పదార్థములు, పప్పుదినుసులు, కాయగూరలు, మాంసము, పాలు మున్నగునవి కుక్కలకు అనువైన ఆహారములు. యజమాని భుజించు పదార్థములే కుక్కకుకూడ ఆహార “మగుటచే, దాని కవసరమగు బలవర్ధక పదార్థములన్నియు అందు లభింపగలవు. శాకాహారమువలన గూడ కుక్కలు ఆరోగ్యకరముగను, పుష్టికరముగను జీవింపగలవు. జంతు వులు వాటి సహజజ్ఞానముచే (instinct) చాలినంత ఆహారమును మాత్రమే తినగలుగును. అందుచే కుక్క లకు సరిపడు పరిమాణముగల ఆహారము నివ్వ వచ్చును. పశు

ముఖ్యముగా ఫలోత్పాదకములైన గేదెలకును, ఆవు లకును ఆహారమును సమపాళములో మితముగానిచ్చుట పొదుపుతనము దృష్ట్యా ప్రధానమైన విషయము. వులఆహారమును రెండు తరగతులుగా విభజింపవచ్చును.

1. గడ్డి: ఏరకమైన గడియైనను పశువులకు ఘన మైన పరిమాణములో లభింపగలదు. వరిగడ్డి, జొన్నచొప్ప, జనపచొప్పు, పచ్చగడ్డి మున్నగునవి పశువులకు కడుపు నిండు ఆహారపదార్థములు. ఇరుదేశా

2. సారభూతమైన ఆహారములు : (Concentrates) బియ్యపుతవుడు, గోధుమతవుడు, పప్పుల పొట్టు, జొన్న తొక్కు, మున్నగునవి సారభూతమైన ఆహార పదార్థ ములు. వీటివలన పశువులకు శక్తి సామర్థ్యములు కలు గును. తెలకపిండి, సెనగలు, ఉలవలు, ప్రత్తిగింజలు మున్నగు మాంసకృత్తులవలన పశువుల అంగని ర్మాణము, శరీర సౌష్ఠవము పెంపొందగలదు.

సారభూతమైన ఆహారములో ఒకవంతు మాంసకృత్తు లును, (proteinations), 4 వంతులు బలవర్ధక పదార్థ ములు (energy feeds) ను కలిసియుండవలెను. పశు వులకు ఒక్కరకము ఆహారము కాక, పలురకములగు పదార్థములు నివ్వవలెను. ఒక పదార్థములో లోపించి 423 దీనికి కారణము.

పశువులు దినమునకు 6 నుంచి 8 గంటలవరకు పచ్చిక బయళ్ళయందు మేత మేయవలెను. దీనికితోడుగా ఇంటి వద్ద దినమునకు 15 పౌనుల ఎండుగడ్డియు, 3 పౌనుల సారభూతమైన ఇతర ఆహారములను ఇయ్యవలెను. ఇది కాక, ప్రతి 10 పౌనుల పాలకును ఆవుకు 3 పౌనుల సారభూతమైన ఆహారమును, ప్రతి 10 పౌనుల పాలకును గేదెకు 4 పౌనులు సారభూతమైన ఆహారమును ఇయ్య వలెను. కష్టించి పనిచేయు ఎద్దులకును, దున్నలకును ఒక గంట శ్రమకు 1 పౌను సారభూతమైన ఆహారము నియ్య వలెను. వీటితోపాటుగా 1ఔన్సు బొమికల ఆహారమును (bonemeal), మరియొక ఔన్సు ఉప్పును ఇయ్యవలెను.

గుఱ్ఱములకుగూడ ఈ విధముగనే ఆహారమునిచ్చి పోషింపవలయును. అయినను వ్యక్తిగతముగ, పశువుల యొక్క బరువును అనుసరించి వాటియొక్క ఆహారములు ఎక్కువగా మారుచుండును. అందుచే పైన పేర్కొ నిన సూచనల నన్నిటిని యుక్తాయుక్తముల నెరిగి జాగ రూకతతో పాటింపవలెను.

గర్భధారణస్థితి: పశువులు గర్భధారణస్థితి యందున్న పుడు వాటికి ఆహారమునిచ్చు విషయములో మిక్కిలి శ్రద్ధ వహింపవలెను. సారభూతమైన పదార్థములను, బొమికల ఆహారములను ఇతోధికముగా నివ్వవలెను. పశువులు ఈనుటకు ఒక వారము ముందుగా తేలిక యైన ఆహారము నియ్యవలెను. లేనిచో, వాటికి మలబద్దక ము చేయును. చూడి జంతువులను చివరదశలో పనిభారము నుండి తప్పింపవలెను.

గర్భధారణకాలము : ఆవులు, గేదెలు సుమారు 280- 290 రోజులు; గుఱ్ఱము 330-345 రోజులు; గొట్టెలు, మేకలు 144-151రోజులు; ఒంటె 410 రోజులు; గాడిద 365 రోజులు, కుక్క 58-63 రోజులు; పిల్లి 63-65 రోజులు; సింహము పెద్దపులి 105 - 110 రోజులు ; ఏనుగు 20-22 30ev.

ప్రసవము : పుట్టిన దూడలకు గాయములు తగుల కుండుటకై, పశువులు ఈనుసమయమున గడ్డితో చక్కగా ప్రక్కను అమర్చవలెను. ప్రసవవేదన అధికముగా కలు