Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3 గృహజంతువులు, పెంపుడుజంతువులు

మాత్రమే వారు పూజింతురు. బుద్ధునికి పిదప దాదాపు 500 సంవత్సరములకు నాగార్జునాచార్యుడు మహాయాన మతశాఖను ప్రవేశ పెట్టి, అందు బుద్ధ విగ్రహమునకు పూజారాధనలు కల్పించెను. నాగార్జునుని మహాయాన మతశాఖ మూలక ముగా శిల్పకళా శిల్పకళాభివృద్ధికి ఎక్కువ అవకా శము కలిగినది. బౌద్ధ వాస్తుశిల్పమునందు ఈ క్రింది వివ రములు కాననగును. (1) స్తూపములు (2) అలంకృత మైన ప్రాకారములు (3) చైత్యశాలలు (4) విహారములు (5) పొంధీలు అనబడు నీటి కుండములు. కథియవాడ : కథియవాడ ప్రదేశమునందు మిశ్రమ • ప్రజల నివసించుచున్నారు. అశోకుని కాలమందును, తదనంతర కాలమందును వీ రందరును బౌద్ధమత ప్రవిష్టు లై నట్లు కన్పడుచున్నది. ఈ ప్రాంతమున అశోక చక్రవర్తి వ్రాయించిన ప్రఖ్యాతశాసనములు కొన్నికలవు. గిర్నార్ పర్వత మందును, దాని పరిసర ప్రాంతము లందును ఈనా టికిని అశోకుని శాసనములయొక్క శిథిలావశేషములు కానవచ్చుచున్నవి. కథియవాడలోకూడ దాదాపు 140 గుహలున్నవి. కాని గణనీయమైన చైత్యశిల్ప మొకటియు అచ్చట కానిపించదు. 15 నుండి 20 అడుగుల లోతుగల ఆలయములనదగినవి కలవు. వీటియందు దాగో బాలు (ధాతుగర్భములు) కలవు. కాని స్తంభములులేవు. విహారములు కూడా స్తంభములు లేని శాలలుగ నున్నవి. వరండాలకు మాత్రము స్తంభాధారములు కలవు. జునగడ్ వద్ద, జుమ్మామసీదునకు ఉత్తరమునగల ఉపా ర్కోట దుర్గము దిగుడు వంపులలో రాతిలో మలచబడిన కొన్ని శాలలున్నవి. అచ్చటి శిల్పము చాలవరకు మాసి పోయి యున్నది. ఐనను, అచ్చట క్రింది అంతస్తునందున్న పడసాల యందలి ఆరు స్తంభములపై కాననగు స్థాపత్య రచనా సంపదలు నిస్తులములుగ నున్నవి. 11 చదరపు అడుగుల వైశాల్యముగల సుందరమయిన కొలనుకలదు . ఆ కొలనికి మూడు ప్రక్కలయందు శిల్పవిన్యాసముకల ఒక వసారాయును అచ్చటకలదు. కొండ పై భాగమునకు ఈ కొలను నుండి గొట్టములద్వారమున నీటిని చేర వేయు గొప్ప ఏర్పాటుకలదు. ఈ కొలను పై భాగమున స్తంభములుగల సాలలును, రేఖావిన్యాసముగల ఎబాసీ (abaci)యు గలవు. ఆర్. ఎం. జో.


గృహజంతువులు, పెంపుడుజంతువులు :

గృహజంతువులను ప్రజలు తమ స్వప్రయోజనము నాశించి పెంచుకొనెదరు. పలురకములైన పశువులు, మహిషములు, గుఱ్ఱములు, గొజ్జెలు, మేకలు, పందులు, ఒంటెలు, గాడిదలు, కోళ్లు గృహజంతువులలో ముఖ్యము లైనవి. ఈ జంతువులన్నియు మానవునకు ఫలితముల నొసగునవియే. ఇవికాక పెంపుడుజంతువులను కొందరు మక్కువతోడను, గారాబముతోడను పెంచుకొనియెదరు. కుక్కలవంటి కొన్ని పెంపుడుజంతువులు మాత్రమే ఉపయోగకరములు. పిల్లులు, పావురములు, చిలుకల వంటి పిట్టలు, సీమకుందేళ్లు, సీమపందికొక్కులు, తాబేళ్లు, దుప్పులు, సింహములు, పెద్దపులులు, చిరుత పులికూనలు మున్నగు జంతువులు వినోదముకొరకు పెంచబడుచున్నవి. పాములవాడు పాములను మచ్చిక చేసికొని వాటిద్వారా జీవయాత్ర గడుపుకొనుచున్నాడు. పైన ఉదహరించబడిన జంతువులను సేకరించి వాటికి వసతులను కల్పించు విధా నములను గూర్చియు, వేర్వేరు ఋతువులలో వేర్వేరు వాతావరణ, పరిసర పరిస్థితుల ననుసరించి వాటికివ్వదుగు ఆహార పానీయాది విషయములను గూర్చియు, గర్భము ధరించిన దశయందును, ప్రసవసమయమునను, శిశువుల యొక్క బాల్యదశయందును, వాటిని పెంచి పోషించు పద్ధతులనుగూర్చియు, ఈ దిగువ సండి ప్తముగా వివరింప బడినది. ఈ జంతువుల నన్నిటిని సాధారణముగా పీడించుb రోగములనుగూర్చి తరువాత ముచ్చటిం చెదము. ఎన్నిక : పెంపుడు జంతువులను అభిమానించువారు కలితీలేని మేలిరకములకు చెందిన కుక్కలను సేకరించు టకు యత్నింతురు. ఇట్టి మేలిరకములను సంపాదించవలె నన్నచో వాటి తాతముత్తాతల పుట్టుపూర్వోత్తరములను విచారింపవలెను. ఇట్టి సమాచారములను ఆ జంతువులలో వ్యాపారము చేయువారివద్దను, గొప్ప నగరమ్ములయం దుండు "కెన్నెల్ క్లబ్బుల” (Kennel clubs) యందును మాత్రమే లభింపగలదు. వివిధ జాతులకు చెందిన పెంపుడు పరిమాణమునందును, ఇతర లక్షణముల యందును ఎంతో వైవిధ్యము కలదు. ఎవరి అభిరుచి ననుసరించి వారు ఇట్టి జంతువులను సేకరించి, శ్రద్ధా సక్తులతోడను, మక్కువతోడను పెంచుకొనియెదరు.