Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుహావాస్తువు 420 . సంగ్రహ ఆంధ్ర


దానికి ఉ త్తరమున కొన్ని కొన్ని గజముల దూరములో పంచపానన(Panchapanana Mandapa) అను మండప మొకటి కలదు. దాని ముఖ భాగముయొక్క వెడల్పు 50 అడుగులు, కుడివైపు ఎత్తు 40 అడుగులు, ఎడమ వైపు ఎత్తు 33 అడుగులు. ఈ మండపము అష్ట కోణా కృతి గల స్తంభములపై నిలిచి యున్నది. ఈ స్తంభ ములు పెద్దపులి ఆకృతులుగల పీఠములపై ముందు భాగ మున ప్రతిష్ఠింపబడినవి. గణేశ్ గుహదగ్గర వైష్ణవగుహ ఒకటి కలదు. హిందూ దేవతాగణమునకు సంబంధిం సంబంధించిన వరాహము, గజలక్ష్మి, వామనుడు, త్రివిక్రముడు మున్నగు పెక్కు దేవతా విగ్రహముల చెక్కడములు కలవు. పూర్తి గావింపబడనివి, గొప్ప విస్తీర్ణము కలవి మరి గుహలు కూడ ఇందు గలవు. మూడవ గుహ 'కోటి కళామండప' మై యున్నది. ఈ కళామండపము దీనికి మూడు మైళ్ళు ఉత్తర శక్తికి అంకితమై యున్నది. ముగా సముద్రపు టొడ్డునగల ఇసుక తిన్నెలయందు కొన్ని రాతిబండలున్నవి. రెండింటిలో గదులు తొలువ బడియున్నవి. ఈ రెండింటిలో ఒకదానికి అహిచండేశ్వర మండపమని పేరు. దీనిపై ఒక శాసన మున్నది. అందు అహిచండుడను పల్లవరా జొకడు పేర్కొనబడినాడు. తెలియదు. రెండవ గుహ ఒక చిన ఇత డెవరో చిన్న బండలో తొలువబడినది. ఈ గుహకు ముందుభాగమున, తొమ్మిది "యాలీల" శిరోభాగములు కలవు. ప్రతి ద్వార పార్శ్వము యొక్క ముందు భాగమునను, ఉద్రిక్త స్థితి కలవిగా మలచబడిన సింహ విగ్ర విగ్రహములును గలవు.

తిరునల్వేలికిని, శ్రీవిల్లి పుత్తూరునకును నడుమనున్న “కులుములు” అను ప్రదేశమున ఒక్కొకదానికి 30 మైళ్ళ దూరమున రాతిబండలలో తొలువబడిన దేవాలయ ములును, ఇతర శిల్పవిగ్రహములును కలవు. వీటిపై జైన శిల్పకళా సంప్రదాయము యొక్క ప్రభావము గోచరించుచున్నది. కాని వీటిని గురించిన వివరములు ఏవియు తెలియుట లేదు. ద్రావి ద్రావిడులు తమ కళా సంప్ర దాయమునకు చెందిన వక్రరేఖావృతమైన దేవళముల వంటి కొన్ని విశిష్ట శిల్పలక్షణములు గుహవాస్తుశిల్పమున ప్రవేశ పెట్టిగని ఈగుహాలయములు తెలియజేయుచున్నవి. పశ్చిమ భారతదేశమందలి గుహవాస్తు శిల్పము

బీహారు, ఒరిస్సా, మద్రాసు, ఆంధ్రప్రదేశము అను తావు' లందలి శిల్పములకం టే అత్యుత్తమమైనది. ఆ ప్రాంతమున గొప్ప పరిమాణముగల గుహలు త్రవ్వబడి అంతస్తులు కల విగా నున్నవి. ఇవి దాదాపు వేయివరకు కన్పించుచున్నవి. అవి విస్తృతములై, కళ యొక్కయు సౌందర్యము " యొక్కయు, గాంభీర్యముయొక్కయు దృష్టిచే విశిష్టము లై నవి. పశ్చిమ కనుమలయందలి శిలాసంచయము తేమకు చొరరానిదై వాస్తుశిల్పమునకు అనువుగా మెత్తని రాళ్ళ పొరలచేతను, కఠినమైన రాళ్ళ పొరలచేతను అంతరితమై యున్నవి. ఈ వేయి గుహలలో 72 బౌద్ధమత గుహాలయ ములును, 160 బ్రాహ్మణ మత దేవాలయములును, జై నమత దేవాలయములును గలవు. బౌద్ధ గుహా 35 లయములు మరల హీనయాన గుహాలయము లనియు, మహాయాన గుహాలయము లనియు ద్వివిధముగా వర్గీక రింపబడవచ్చును. వీటిలో ప్రాచీన విభాగమునకు చెందిన హీనయానమువారు కేవలము నైతిక దృక్పథమును ఆధారము చేసికొనిరి. అందుచే వారు బ బుద్ధుని విగ్రహ మును పూజింపరు. సాధారణముగా స్తూపమును, అతని పాదములను లేదా చక్రమువంటి బౌద్ధచిహ్నములను mi చిత్రము - 113 పటము ధర్మచక్రము Gro