విజ్ఞానకోశము - 3
గుహావాస్తువు
సింహాకారములతో సన్నగానుండును. గదులేమో అన్నట్లు భ్రాంతిగొల్పు విచిత్రాలంకారములు పై అంతస్తులలో నుండును. వీటిలో మొదటి అంతస్తునందు 16 గదులును, రెండవదానియందు 12 గదులును, మూడవదాని యందు 8 గదులును కలవు. ఈ గదులకు ముందుగల భాగము అర్ధచంద్రాకారమున మోరపాక ఆకృతిలో గవాక్షములచే అలంకరింపబడి యున్నది. ఆ గదులకు వెనుక భాగమున గోడలు సన్నని చతురస్రస్తంభములచే పొడుగైన గదులుగ విభజింపబడియున్నవి. వాటియందు దేవతా విగ్రహములు ప్రతిష్ఠింపబడియున్నవి. నిరాడంబరములయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలును, పెక్కు అర్ధనారీశ్వర విగ్రహములును అందు కనిపించు చున్నవి.
ఈ రథములన్నియు-ముఖ్యముగా అర్జున, ధర్మరాజ రథములు అత్యధిక సహనశీల పరిశ్రమకు ఉదాహరణములై యున్నవి. ఈ గుణమునకు భారతీయులు ప్రసిద్ధికెక్కియున్నారు. వాస్తుశిల్పదృష్ట్యా ఈ రథములు దక్షిణ భారతములోగల వేలకొలది హిందూ దేవాలయముల ఆరంభావస్థను పోలియున్నవి. అయిదవదగు సహదేవ రథము అవతలికొండకు సమీపమున నున్నది. దాని పొడవు 18 అడుగులు, వెడల్పు 11 అడుగులు, ఎత్తు 16 అడుగులు. దాని తూర్పుభాగము పూర్తిచేయబడలేదు. ఈ రథము, కొలది ప్రమాణములో, చైత్యగుహయొక్క బహిరాకారమును పోలియున్నది. పశ్చిమముననున్న గుహాసముదాయములో ఇదియొక ముఖ్యలక్షణము. కప్పుయొక్క అంతర్భాగము అర్ధవలయాకారముగ నుండును.
మహాబలిపురము వద్ద గల కొన్ని గుహలు మిక్కిలి సుందరముగ నున్నవి. కాని వాస్తుశిల్పదృష్ట్యా వాటికి ప్రత్యేక ప్రాముఖ్యములేదు. పశ్చిమ భారతదేశమందలి ఇతర గుహలయందువలె వాటియందు కల్పనౌచిత్యమును, గాంభీర్యమును కానరావు. ఈ గుహల స్తంభములు సన్నగా నుండును. వాటియందు వాస్తుశిల్పమునకు సంబంధించిన వివరములు గోచరింపవు.
ఈ పంక్తికి దక్షిణాగ్రమునందు ఇప్పటికిని చెక్కుచెదరక ఒక గుహ కనిపించుచున్నది. దానిపేరు 'ధర్మరాజ మండపము', దాని పొడవు 17 అడుగులు, వెడల్పు 121/2 అడుగులు. అందు నాలుగు స్తంభములున్నవి. స్తంభములు అడుగుభాగమునందు, అగ్రభాగమునందును చతురస్రాకారమును, మధ్యభాగమున అష్టకోణాకృతిని కలిగి యున్నవి శిల్ప విన్యాసముకల దక్షిణ ప్రస్తరము వెనుక భాగమున రెండు స్తంభములుకల ఒక గుహకలదు. ఇది పూర్తి కావింపబడినది కాదు.
మొదటిదానికి ఉత్తరమున యమపురి లేక 'మహిషాసురమర్దని' అను పేరుగల ఒక మండపమున్నది. దీని పొడవు 331/2 అడుగులు, వెడల్పు 15 అడుగులు. స్తంభాగ్రములందు దృఢమయిన చూళికలు కలవు. వాటిపై సమచతురస్రాకృతిలో పెంకు లమర్పబడి యున్నవి. శేష శాయి, నారాయణునివంటి కొన్ని ఉబ్బెత్తు చిత్రములు కలవు. చావడికి మరియొక చివరియందు దుర్గామహిషాసురుల పోరును రూపొందించు మహోద్రేక సంభరితమగు శిల్పవిన్యాసము కలదు. దీనికి పశ్చిమముగా కొండకు పశ్చిమ భాగమునందు వరాహస్వామి ఆలయమొకటి కలదు. అచటనే రాముని పూజించుచున్నట్లు ఆంజనేయుని శిల్ప విగ్రహముకూడ ఒకటి కాననగును.
దానికి సమీపమున 'రామాయణ మండప' మను మరియొక గుహ కనిపించును. దానిపొడవు 181/2 అడుగులు, వెడల్పు 10 అడుగులు. అందు సింహవిగ్రహముల శిరములపై మోపబడియున్న రెండు స్తంభములున్నవి. ఓలక్కా మేశ్వరస్వామి గుహయొకటి అచ్చట నున్నది. ఇది పూర్తి కావింప బడలేదు. ఇందు సింహవిగ్రహముల శిరములపై అమర్పబడిన నాలుగు స్తంభములు కలవు. ఉత్తరమునకు పోయినచో అచ్చటి మొట్టమొదట కనిపించునది కృష్ణధర్మశాల అనునది. ఇది అనంతరకాలమున త్రవ్వబడినట్లు కనిపించును. దీనిపై చోళశిల్పకళా సంప్రదాయ ప్రభావము ప్రసరించినది. ఇచ్చటి మండపము 48 అడుగుల పొడవును, 23 అడుగుల వెడల్పును కలిగి యున్నది. ఇందు మూడు శ్రేణులుగా 12 స్తంభ నిర్మాణములు కలవు. ఆరు స్తంభములలో మూడింటికి అడుగుభాగమున యాలీలు (yalis) లేక శార్దూలములో ఉన్నవి. స్తంభాగ్రములను కలుపు చూరుబల్లయొక్క పై భాగమున ఒండొంటిపై అమర్పబడిన రాతిపలకలచే మండపము యొక్క కప్పు ఏర్పడియున్నది.
419