పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3


నామమున పది రాష్ట్రముల కలయికతో ఏర్పడినది. నోవ స్కోషియా, న్యూ బ్రన్ స్విక్, ప్రిన్సు ఎడ్వర్డుదీవి, క్విబెక్, అంటారియో, మానిటోబా, సాస్కచివాన్, ఆల్బర్టా, బ్రిటిషు కొలంబియా, న్యూఫౌండ్ లాండ్ అనునవి ఆ పది రాష్ట్రములు. కెనడా వైశాల్యము 36,19,616 చ. మైళ్లు. ఈ దేశమున కు త్తరమున ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణమున అమెరికా సంయుక్త రాష్ట్రములు, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, పడమట పసిఫిక్ మహా సముద్రమును కలవు. ఇంచుమించుగా పశ్చిమదిశయందు 140° ప. రేఖాంశము అలాస్కా, కెనడాలకు మధ్య సరి హద్దుగాను, దక్షిణదిశయందు కెనడా, సంయుక్త రాష్ట్రములకు మధ్య సరిహద్దుగాను 49° . అక్షాంశము ఉన్నవి. నైసర్గిక స్థితినిబట్టి కెనడాను మూడు సహజ భాగ ములుగా విభజించవచ్చును, అవి (i) గుట్టలతోను, అడ వుల తోను నిండిన తూర్పు ప్రాంతము, (ii) రాకీ పర్వత ములతో నిండిన పశ్చిమ ప్రాంతము, (iii) ఈ రెంటికిని మధ్యగానున్న పెయిరీభూమి. తూర్పుదిశయందుగల ముఖ్య పర్వత శ్రేణులు సెంటు లారెన్సు నదికి సమానాంతరముగా నున్నవి. ఇందు ఉత్త రమున నున్న లారెన్సు శ్రేణియు, దక్షిణముననున్న షిక్ షాక్ శ్రేణియు ముఖ్యమైనవి. ఇవి సుమారు 4000 అ. ఎత్తుకలవి, పశ్చిమముననున్న రాకీ పర్వతములు రెండు వరుసలుగా నున్నవి. సముద్రతీరముననున్న శ్రేణిని కోర్టు రేంజి అనియు, లోతట్టు శ్రేణిని ఎండికట్ శ్రేణి యనియు అందురు. ఈ పర్వతములలో రాబ్సన్ (18,700 అ. ఎత్తు), మౌంటు ఇలియస్ (18,000 అ. ఎత్తు) అను శిఖరములు ముఖ్యమైనవి. పెయిరీప్రాంతము చాల భాగము మైదాన ముగ నున్నది. ఇందు అనేకములగు గుట్టలు కలవు. ఇవి అడవులతో నిండియున్నవి.

కెనడాలో అనేకనదులు, సరస్సులు కలవు. కొన్ని సరస్సులు వందమైళ్ళకు మించిన పొడవుకలవిగా ఉన్నవి; 35 సరస్సులు 50 మైళ్ళకు మించినపొడవుకలవిగా ఉన్నవి. కెనడా నగులలో నెల్సన్, ఆల్బనీ, చర్చిల్ మొదలయిన నదులు హడ్సన్ అఖాతములోను, మెకంజి, కాపర్ మైన్ మొదలయినవి ఆర్కిటిక్ మహాసముద్రములోను, ఫ్రేజర్, స్కీనా మున్నగునవి పసిఫిక్ సముద్రములోను కలియు చున్నవి. కెనడా నదులలోకెల్ల ముఖ్యమైనది సెంటు లా రెన్సు అను పేరుగలది. ఇది అట్లాంటిక్ సముద్రములో కలియుచున్నది. లేక్ సుపీరియర్, మిథిగన్, హురాన్.

చిత్రము 1.

7