పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేనడా (భూగోళము) సంగ్రహ ఆంధ్ర


ఈరి, అంటారియో, అను బ్రహ్మాండమైన మంచినీటి సర స్సులలోని నీరు ఈ నదిగుండా ప్రవహించుచుండును. ఈ సరస్సులు ఒకదానితో నొకటి కాలువల ద్వారమున కలుపబడిఉన్నవి. సెంటులా రెన్సునదీ ముఖద్వారమునుండి నౌకలు ఈ సరస్సుల ద్వారమున చాలదూరమునుచేర గలవు. ఈ నదిశీత కాలమున ఘనీభవించును. సస్కచివాన్, మెకంజి నదులుకూడా మిక్కిలి యెన్నతగినవి. సస్క చివాన్ నది విన్ని పెగ్ సరస్సులోను, మెకంజినది ఆర్కి టిక్ సముద్రములోను కలియుచున్నవి. కెనడాతీరము, ప్రాక్పశ్చిమ ఉత్తర దిశలయందు మిక్కిలి చీలి ఉన్నది. శీతోష్ణస్థితి : కెనడా చాలవరకు సమ శీతోష్ణమండల మున నున్నది. కాని ఇది చాలవిశాలమైన దేశమగుటచే, అత్యధిక శీతోష్ణస్థితులే ఇందు విశేషముగా కానవచ్చును. శీతకాలమున ఉత్తర శీతలపవనములు వీచుటచే చలి విశే షముగా నుండును. నదులలోను, సరస్సులలోను, నీరు గడ్డకట్టును. లాబ్రడార్ శీనలజల ప్రవాహము తూర్పు పవనముల తీరమును అతిశీతలముగా చేయును. కాని పసిఫిక్ తీరము మాత్రము కవోష్ణమగు ఉత్తర పసిఫిక్ ప్రవాహము యొక్కయు, నైరృతి ప్రతివ్యాపార యొక్కయు ప్రభావముచే సమశీతోష్ణముగ నుండును. ఈ కారణముచేతనే తూర్పు తీరమునగల హాలిఫాక్స్ రేవు శీత కాలమున ఘనీభవించి నౌకాయానమునకు ఉపయోగింపకున్నను, పశ్చిమతీరమునగల వాంకోవరు రేవునందు మంచుగడ్డ లేర్పడ కపోవుటచే అది సంవత్సరము పొడవునను నౌకాయానమున కుపయోగించును. వేసవిలో మెక్సికో సింధుశాఖనుండి వీచు వెచ్చని వేడిగాడ్పులు, మధ్య మైదానముపై వీచుటచేతను, ఉష్ణ సింధుశాఖ -వేడిగలుస్ట్రీము తూర్పు ప్రక్కనుండి పారుటచేతను దేశమంతయు 60° ఫా. కంటెను అధికోష్ణము కలిగి యుండును. పశ్చిమ తీరమునను, తూర్పు తీరమునను సంవత్సరము పొడవున వర్షము కురియును. రాకీ పర్వత పంక్తులకు మధ్యనున్న ప్రాంతము వర్షఛ్ఛాయలో నుండుటచే పొడిగా నుండును. మధ్య మైదానములో వేసవిలో మాత్రమే వాన కురియును. జనవరిలో ఉష్ణో గ్రత 32° ఫా. వరకు పోవును.

ప్రకృతిసిద్ధ మండలములు : కెనడాను మూడు ప్రకృతి

సిద్ధ మండలములుగా విభజించవచ్చును. అవి 1. తూర్పు కెనడా 2. మధ్య కెనడాలి. పడమటి కెనడా అనునవి. 1. తూర్పు కెనడా: కెనడాలో నుండెడి జనులలో నాలుగింట మూడు భాగములు తూర్పు కెనడాలో నున్నారు. ఇది గొప్ప వ్యవసాయ ప్రాంతము. ఇచ్చట గోధుమ, ఓట్సు, బార్లీ, రై, బంగాళాదుంపలు అధిక ముగా పండును. కోనిఫర్ వృక్షములును, ఆకురాలు వృక్షములును, ఈ ప్రాంతమున పెరుగును. పరిశ్రమలు కూడా అతి త్వరగా వృద్ధిచెందుచున్నవి, కెనడాకు ముఖ్య పట్టణమైన అట్టావా ఇందే కలదు. అచ్చట కొయ్య గుజ్జుతో కాగితముచేయు కర్మాగారములున్నవి. క్విబెక్ నందు ప్రత్తి పరిశ్రమ, చర్మపు పరిశ్రమ కలవు. ఇనుము, ఉక్కు పరిశ్రమలకు టారంటో ప్రసిద్ధము. ఈరి, అంటా రియో సరస్సులకు మధ్య 'నయాగరా' జలపాతమున్నది. ఈజలపాతము చాల రమణీయమైన దృశ్యము. 167 అడు గుల ఎత్తునుండి ఇదిపడుచున్నది. దీనివలన తయారుచేయ బడు జల విద్యుచ్ఛక్తి కెనడా సంయుక్త రాష్ట్రములకు అంద జేయబడును. తూర్పు కెనడాయందలి పరిశ్రమలు అభివృద్ధినొందుట కిదియొక ముఖ్య కారణము.

కెనడాకు ఉత్తరభాగమున నున్న టండ్రా భూములలో ఎస్కిమోలు నివసింతురు. ఉత్తరముననున్న ద్వీపములు చాలవరకు నిర్మానుష్యముగా నుండును. టండ్రాలకు దక్షిణమున 'కోనిఫర్’ వనములున్నవి. అందు డగ్లస్ ఫర్, రెడ్పీడర్, వైటు పైను అను వృక్షము అధిక ముగ నుండును. అందుచే అచటి జనులకు కలపపరిశ్రమ ప్రధాన వృత్తియైనది. తూర్పు తీరమునకు సమీపమున గల న్యూపౌండ్ లాండ్ దీవి బ్రిటిష్ వారి అధికారమున నున్నది. సెంటు జాదీని రాజధాని. ఈ ద్వీపమున ఇనుము దొరకు గనులున్నవి. చేపలను పట్టుట అచ్చటి జనులయొక్క ముఖ్యవృత్తి. 2. మధ్య కెనడా కెనడా మధ్యభాగమున త్రిభుజాకార ముగా నుండు ప్రెయిరీ భూములు కలవు. అందు ఖండాం తర శీతోష్ణస్థితి కలదు. చాలినంత వర్షముగల తూర్పు ప్రాంతములలో గోధుమలను పండించెదరు. ఎడ్మాన్ టన్, రెజినా, సాస్కటూన్ పట్టణములు ధాన్యమును సేక8