పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కెనడా (భూగోళము) సంగ్రహ ఆంధ్ర

వాణిజ్య ఒప్పందములు చేసికొని ఆర్థికమాంద్యమునుండి కోలుకొనసా గెను.

సంపూర్ణస్వాతంత్ర్యము: మొదటి ప్రపంచ యుద్ధానంత రము బ్రిటిషు సామ్రాజ్యము, బ్రిటిషు కామన్ వెల్తు ఆఫ్ నేషన్సుగా రూపొందినది. 1926 లో బాల్ఫరు ప్రభువు చేసిన ప్రకటన ననుసరించి డొమినియనులకు మాతృదేశ ముతో సమానమగు హోదాకలదనియు, అవి కామన్ -వెల్తులో స్వచ్ఛంద సభ్యత్వమును కలిగియుండుననియు స్పష్ట మొనర్పబడెను. 1931లో పార్లమెంటు చేసిన వెస్టు మిస్టర్ శాసన మీ సూత్రమును చట్టబద్ధ మొనర్చినది. వి దేశ వ్యవహారములలో గూడ కెనడా పూర్తి స్వతంత్ర రాజ్యమైనది. ఇందుకు ఉదాహరణము 1914 లో కెనడా పక్షమున బ్రిటనే జర్మనీపై యుద్ధమును ప్రకటించినది. రెండవ ప్రపంచ యుద్ధములో కెనడాయే స్వయముగ జర్మనీ, జపానులపై యుద్ధం ప్రకటన గావించెను. రెండవ ప్రపంచయుద్ధము: మొదటి నుండియు కెనడా, హిట్లర్ నియంతృత్వమును, దురాక్రమణలను నిరసించి నది. చివరకు 1939 సెప్టెంబరు 10వ తేదీనాడు జర్మనీ పైనను, పెరల్ హార్బరుపైనను దాడి జరిగిన మరునాడు (1941 డిసెంబరు 8) జపానుపైనను, కెనడా ప్రభుత్వము యుద్ధము ప్రకటించెను. 1940 లో అమెరికా సంయుక్త రాష్ట్రములతో కలిసి సంయుక్త రక్షణ సంఘమును స్థాపించి తన సర్వశక్తులు యుద్ధప్రయత్నముపైనే కేంద్రీ కరించి కృషి సల్పెను. కెనడా సైన్యములు, కెనడా నౌకాదళము, రాయల్ కెనడియన్ విమానదళమును వీరోచితమైన పాత్రను నిర్వహించినవి. జర్మన్ విమాన దాడులనుండి, నౌకాదిగ్బంధమునుండి, తామదేవతనుండి బ్రిటన్ రక్షింపబడుటకు కెనడా చేసిన సహాయ మసా మాన్యమైనది. ౨ యుద్ధానంతర కెనడా యుద్ధానంతరము ఐక్యరాజ్య ఉత్తర అట్లాంటిక్ సంధికూటమిలోను చేరి కెనడా ప్రపంచశాంతికి అవిరళమగు కృషి చేయుచున్నది. దక్షిణకొరియాపై ఉత్తరకొరియా దురాక్రమణ నరి కట్టుటకై సైన్యమునంపి ఐక్యరాజ్యసమితితో సహకరించి నది. సంయుక్త రాష్ట్రములతో కలిసి ఐరోపా ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమమున కెంతయో సహాయ

మొనర్చినది. ఐరోపాలో నిర్వాసులైనవారిలో పెక్కు మందికి కెనడాలో రక్షణ లభించెను. అణుశక్తి పరిశోధ నములోను, ని రాయుధీకరణ కార్యక్రమములోను కెనడా ప్రత్యేక శ్రద్ధ వహించుచున్నది. shatral కెనడా ప్రభుత్వము : కెనడా బ్రిటిషు కామన్ వెల్తులో సభ్యురాలు. అది బ్రిటనుతో సమానమైన హోదాకలిగిన స్వతంత్ర ప్రజాస్వామ్య రాజ్యము. 1887 మార్చిలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన శాసనమే కెనడా రాజ్యాంగ మని చెప్పవచ్చును. దాని ప్రకారము కెనడా ఒకసమాఖ్య. రాష్ట్రములకు పెక్కు విషయములలో స్వాతంత్ర్య మున్నది. ఐనను కేంద్రమున పార్లమెంటరీ ప్రభుత్వ విధాన మనుసరింపబడినది. కెనడాలో వయోజనులై న (21 సం॥లు నిండిన) స్త్రీ పురుషు లందరికి వోటు హక్కు గలదు. కెనడాలో ఉన్నత కార్యనిర్వహణాధికారి గవర్నర్ జనరలు. ఇతనిని కెనడావాసులే ఎన్నుకొందురు; కాని నామకః ఇతడు ఆంగ్ల సార్వభౌమునిచే నియమింపబడును. ఇతనికి సహాయముగ మంత్రివర్గముండును. వీరు శాసన సభలకు బాధ్యులై యుందురు. 1958, సెప్టెంబరు 1వ తేదీన జాన్ జి. డీఫెన్ బేకర్ ప్రధానమంత్రిగా కన్సర్వే టివ్ పార్టీ మంత్రివర్గ మేర్పడినది. ఉండలు పైబడిన కేంద్రమున రెండుసభలు గల పార్లమెంటు గలదు. ఎగువసభకు సెనేట్ అని పేరు. ఇందలి సభ్యుల సంఖ్య 102; దిగువసభ సామాన్యులసభ (House of Commons) అని వ్యవహరింపబడును. దీనికి 5 సం॥ల కొకమారు, దేశజనాభా ననుసరించి ఎన్నికలు జరుగుచుండును. ప్రతి రాష్ట్రమునకు ఒక లెఫ్టి నెంట్ గవర్నరు, మంత్రి వర్గము, శాసనసభ ఉన్నవి. లెఫ్టినెంటు గవర్నరును గవ నియమించును. క్విబెక్ రాష్ట్ర

సభలో రెండువిభాగము లున్నవి. మిగిలిన రాష్ట్రములకు ఒక్కటే శాసనసభ ఉండును. a 2001,886 బడర్ డిగ్రీ వి. యస్. యల్. హరి - కెనడా (భూగోళము) : కాండ కెనడా దేశము ఉత్తర అమెరికాలో నున్నది. ఇది బ్రిటిషువారి అధినివేశ రాజ్యముగా 1867వ సంవత్సర మున “ఉత్తర అమెరికా బ్రిటిషు ఫెడరేషను" అను