పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కెనడా (చరిత్ర)


ప్రభుత్వము డర్హం సూచనలను తిరస్కరించినను, క్రమ ముగా నివియే 'కామన్ వెల్తు' భావమునకు మార్గదర్శ కము లై నవి. ఆంగ్ల ప్రభుత్వము 1840 లో నొక శాసన మొనర్చి కెనడాలో శాంతి నెలకొల్పుటకు ప్రయత్నించెను గాని లాభము లేకపోయెను. కెనడా డొమినియను : కెనడా వాసులు గూడ 'ఐక మత్యమే బలము'అను సూత్రార్థమును గ్రహించి సమైక్య పరిపాలనా విధానమునకు ప్రయత్నములు సాగించిరి. 1862 లో క్విబెక్ నగరమునను, 1864 లో ఛార్లెట్ ఔనులోను సమావేశములను జరిపి తమ కోర్కెలను బ్రిటిషు పార్ల మెంటునకు విన్నవించిరి. న్యూఫౌండ్ లాండ్, ప్రిన్సు ఎడ్వర్డు దీవులు మాత్రము సమాఖ్యలో చేరుటకు సమ్మతించలేదు. మిగిలిన కెనడా ప్రాంతముల కోరిక ననుసరించి 1867 మార్చిలో పార్లమెంటు బ్రిటిష్ ఉత్తర అమెరికా శాసనము గావించెను. ఇదియే కెనడా రాజ్యాంగమునకు ప్రాతిపదిక యైనది. కెనడాకు డొమిని యను లేక అధినివేశ ప్రతిపత్తి లభించెను; అనగా అంత రంగిక వ్యవహారములలో కెనడా స్వతంత్రముగ వ్యవహ రించవచ్చును. కెనడాలో బాధ్యతాయుతమైన సమాఖ్య (Federal) ప్రభుత్వ మేర్పడెను. 1887 లో సమైక్య కెనడా డొమినియనుకు కన్సర్వేటివ్ పార్టీ నాయకుడైన సర్ జాన్. ఎ. మాక్డొనాల్డ్ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై నాడు.. కెనడా విస్తరణము, వికాసము: 1867 నాటి కెనడా డొమినియనులో క్విబెక్, అంటారియో, నోవస్కోషియా, న్యూ బ్రన్సువిక్ అను 4 రాష్ట్రములు మాత్రముండెను. నేటి కెనడా విస్తీర్ణములోనది పదియవవంతు మాత్రమే. క్రమముగా 1867 తరువాత కెనడా విస్తరింప సాగినది. 1870 లో ఫ్రెంచి తిరుగుబాటు ఫలితముగ 'మానిటో డా'ను కెనడా ఆక్రమించినది. 'మానిటోబా' కెనడాలో 5 వ. రాష్ట్రమైనది. 1871 లో బ్రిటిష్ కొలంబియా, 1878 లో ప్రిన్సు ఎడ్వర్డుదీవి కెనడాలో చేరినవి; 1905 లో ఆల్బర్టా, సస్కాచివాను చేర్చుకొనబడెను. రెండవ ప్రపంచ యుద్ధానంతరమూ 1948 లో న్యూఫౌండ్ లాండ్ కెనడాలో పదవ రాష్ట్రముగా చేరినది. రాజకీయముగ ప్రశాంత వాతావరణ మేర్పడిన తరు

వాత కెనడా ఆర్థికాభివృద్ధి సాధింపగల్గెను. ప్రెయిరీ భూములలో వ్యవసాయ, పశుపాలనా పరిశ్రమ లభివృద్ధి చెందెను. 1880-1888 సం. ల మధ్యకాలమున వాంకూ వర్, మాంట్రియల్ నగరములను కలుపుచు కెనడియన్ పసిఫిక్ రైలుమార్గము నిర్మింపబడినది. దీనివలన రవాణా సౌకర్యములు పెంపొంది వర్తక వాణిజ్యములకు ప్రోత్సా హము కలిగెను. కెనడా ప్రభుత్వము యొక్క రక్షణ విధానము దేశీయ పరిశ్రమల వికాసమునకు తోడ్పడెను. కెనడా ; ప్రపంచయుద్ధములు : మొదటి ప్రపంచయుద్ధము : 1914 లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధములో కెనడా, మాతృదేశమున కపారమగు సహాయ మొనర్చెను. కన్సర్వేటివ్ ప నాయకుడైన సర్ రాబర్ట్ బోర్డెన్, లిబరల్ పక్షమును కలుపుకొని మిశ్రమ మంత్రివర్గ మేర్పరచి యుద్ధ ప్రయ త్నము లొనరించెను. కెనడా సైన్యములు, ఫ్రాన్సు రంగమున 11 ఫిబ్రవరి, 1915 తారీఖున ప్రవేశించి జర్మ నులతో హోరాహోరి పోరాడెను. వివిధ రంగములలో 60,000 మంది కెనడా సైనికులు వీరస్వర్గమును బడసిరి. ఇదిగాక మిత్రమండలి రాజ్యములకు కెనడా 70 కోట్ల డాలర్లకుపైగా ఋణ మొసం గెను. యుద్ధానంతర వికాసము: యుద్ధానంతరము కెనడా ప్రభుత్వము తన దేశముయొక్క ఆర్థిక పునర్నిర్మాణము నకు పూనుకొనెను. 1920 లో బోల్డెన్, మంత్రి పదవికి రాజీనామా చేసెను. 1921 ఎన్నికలలో లిబరల్ పథము అధికారములోనికి వచ్చి, విలియం మెకంజీ కింగ్ ప్రధాని యైనాడు. ఇతని కాలమున పెయిరీ భూములు పూర్తి ఆర్థిక వినియోగమునకు గొనిరాబడెను. రైలుమార్గ నిర్మాణము విశేషముగ జరిగెను. ఇంతలో 1229 నాటి ఆర్థికమాంద్యము కెనడాలోగూడ ప్రవేశించి వ్యవసా యము, పరిశ్రమలు, వాణిజ్యము నష్టపడినవి. 1980 లో రిచర్డు బి. బెన్నెట్ ప్రధానిగా కన్సర్వేటివ్ పార్టీ అధికా రములోకి వచ్చి వాణిజ్యాభివృద్ధికి కృషి చేసినది. 1982లో జరిగిన అట్టావా సామ్రాజ్య సమావేశము (Imperial Conference)లో బ్రిటిష్ కామన్ వెల్తులోని రాజ్యము లలో కెనడా వాణిజ్యసౌకర్యములను బడసెను, ఐరోపా రాజ్యములతోను, సంయుక్త రాష్ట్రములతోను, కెనడా 5