పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కెనడా (చరిత్ర)


తుది అంకము సప్తసంవత్సర సంగ్రామము 1756 - 1789) ప్రపం చాధిపత్యమునకై తమ బలాబలములను తేల్చుకొనుటకై ఆంగ్లేయులు, ఫ్రెంచివారును ప్రష్యా, ఆస్ట్రియాల పడమున చెరియొకరు చేరి ఈ యుద్ధ మొన ర్చిరి. అమెరికా, ఇండియా, ఐరోపా రంగము లన్నిటి లోను ఫ్రెంచివారు పరాజయమందిరి. 1768లో జరిగిన పారిస్ శాంతిసంధిలో ఫ్రెంచివారు కెనడాను ఆంగ్లే యుల కొసగిరి. కెనడా ప్రభుత్వ సమస్య: కెనడాలో ఆం గ్లేయులు మొదట జనరల్ ముద్దై అధిపతిగా సైనిక ప్రభుత్వమును స్థాపించిరి. ఐనను కెనడా పరిపాలన వారికొక సమస్య యైనది. ప్రజలు ఫ్రెంచివారు, కాథలిక్ మతస్థులు. జన రల్ ముట్టే ఎంతసమర్థతతో పరిపాలనమును నిర్వహించి నను వారికి సమ్మతముకాలేదు. 1788 నుండి ఆంగ్లవలసలు మాతృదేశమునకు వ్యతిరేకముగ నారంభించిన ఉద్య మము ఫ్రెంచివారికి మరింత ప్రోత్సాహమొసగెను. ఈ అశాంతిని తుదముట్టించుటకు అంగ్లప్రభుత్వము కెనడాలో కొంతవరకు బాధ్యతాయుత పరిపాలన నేర్పరచుచు 1774లో క్విబెక్ శాసనము గావించెను. ఈ శాసనము ప్రకారము కెనడా గవర్నరునకు స్థానిక సలహాసంఘ మొకటి యేర్పాటుచేయబడినది. న్యాయస్థానములలో ఫ్రెంచి భాష నుపయోగించుట కనుమతి ఈయబడెను. కాథలిక్ మతమునకు గౌరవము లభించెను. కెనడా రాజ్యాంగశాసనము - 1791: అమెరికాస్వాతంత్ర్య యుద్ధమువలన కెనడాకు క్రొత్త సమస్య లేర్పడెను. వల సల తిరుగుబాటును వ్యతిరేకించి, మాతృదేశముపట్ల విశ్వాసము వహించిన (Loyalists) ఆంగ్లేయులు సుమారు 40,000 మంది ఎగువ కెనడాకు వలసవచ్చి స్థిర నివాసము లేర్పరచుకొనిరి. ఈ వలసనే 'అంటారియో' అందురు, క్రొత్తగా వలసవచ్చిన ఆంగ్లేయులు స్థానిక స్వపరిపాలనకు అలవాటుపడిన వారు. అదియునుగాక వీరికివి ఫ్రెంచివారికిని సంప్రదాయసిద్ధమగు సంఘర్షణ ప్రారంభ మైనది. అందుచేత - పరాసు సంఘర్షణల నాపుటకును, అంటారియో రాష్ట్రమున గూడ స్థానిక స్వపరిపాలన నెలకొల్పుటకును 1791 లో త్వము, కెనడా రాజ్యాంగ శాసనము నమలుజరిపెను. పై శాసనము ప్రకారము, కెనడా అంటారియో, క్విబెక్ రాష్ట్రములుగా విభజింపబడినది. ప్రతి రాష్ట్రము సకును ఒక లెఫ్టినెంటు గవర్నరు. ఆంగ్ల పార్వభౌమునిచే నియమింపబడిన సలహాసంఘము, శాశ వనభయు ఏర్పాటు T చేయబడెను. శాసనప భాసక్యులను ప్రజలే ఎన్నుకొందురు. కెనడా మొ స్తముపై నొక గవర్నరుండును. కెనడా రాజ్యాంగ శాసనము కెనడాలో శాంతి నెలకొల్పుటకు బదులు అసంతృప్తిని రెచ్చగొట్టినది. అంటారియో ఆంగ్ల రాష్ట్రము క్విక్ ఫ్రెంచి రాష్ట్రము; రాజ్యాంగము ఈ రెంటిని సమైక్యమొనర్చి కెనడాలో జాతీయతను నెలకొల్పుటకు బదులు, శాశ్వతముగా కెనడా వాసులలో అనైక్యతకు బీజములు వాటినది. 1812-14 మధ్య ఇంగ్లండు, సంయుక్తరాష్ట్రములకు యుద్ధము జరిగినది. అందు కెనడాకు సంయుక్తరాష్ట్ర ముల నుండి దండయాత్ర భయము కలిగినది; ఐనను ఆంగ్లేయులు, ఫ్రెంచివారు తమ విభేదములను విస్మరింప లేకపోయిరి. క్రమముగా వారిమధ్య సంఘర్షణలు కూడ ప్రారంభ మైనవి. అదియునుగాక పై శాసనము కెనడాలో నేర్పరచినది ప్రాతినిధ్య ప్రభుత్వమేగాని బాధ్యతాయుత పరిపాలన కాదు. ఈ కారణమువలన 1887 ప్రాంతమున దిగువ కెనడాలో లూయీ పెపివాల్ నాయకత్వమునను, ఎగువ కెనడాలో విలియం లియన్ మెకంజీ నాయకత్వ మునను, తిరుగుబాటులు జరి గెను. విక్టోరియా మహారాణి ప్రభుత్వ మీ తిరుగుబాటుల నణచివేసి, కెనడాల్లో ఇంతటి అశాంతి ప్రజ్వరిల్లుటకు గల కారణములను పరిశీలింపుమని రాజనీతి ధురంధరుడైన డర్ఘంప్రభువును నియమించెను. డర్హం నివేదిక (1838): డర్ఘంప్రభువు వలన పరి పాలనా విధానమును సవిమర్శక ముగ పరిశీలించి తన నివేదికను సమర్పించెను. "వలసల మాగ్నా కార్టా (హక్కుల పత్రము)" అని ప్రసిద్ధిపొందిన దర్ఘంని వేదిక బ్రిటిషు సామ్రాజ్యవాద చరిత్రలో నొక మైలురాయి. ఎగువ దిగువ కెనడాలను సమైక్య మొనరించవలెననియు, బాధ్యతాయుత పరిపాలన నేర్పరచవలెననియు, కెనడా మాతృదేశము పట్ల విశ్వాసము వహించియుండుటకది యే మార్గముగాని నిరంకుశ పరిపాలన కాదనియు వర్షం ప్రభువు తన నివేదికలో సూచించెను. అప్పటికి ఆంగ్ల 4