పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కెనడా (చరిత్ర)


మత ప్రచారకులైన జెస్సూటులు (Jessuits) కష్టము లను లెక్కింపక హ్యూరాను ఇండియనులలో క్రిస్టియన మత ప్రచార మొనరింపసాగిరి. 1642 లో నిర్మింపబడిన మాంట్రియల్ నగరము కెస్సూటు మతాధికారులకు కేంద్రమైనది. హ్యూరానులు ఫ్రెంచివారియం దభిమా వము వహించినను, ఇరాకీలు ఫ్రెంచివారిపై కత్తిగట్టిరి. 1882 లో ఇరాకీలు ఫ్రెంచి స్థావరములపై దాడి చేసి ప్రజల ననేక విధముల హింసించిరి. కాని గవర్నరైన ఫ్రాంటినాల్ ప్రభువు కింగ్స్టన్ దుర్గమును నిర్మించి, ఇరాకీల నణచి వలసలకు శాంతి చేకూర్చెను. ఫ్రెంచి ప్రభువులు కెనడాను తమ సామ్రాజ్యభాగముగా పరిగ ణించి, 'నవఫ్రాన్సు' (New France) అని వ్యవహరించిరి. 17వ శతాబ్ది ఉత్తరార్ధమున, అమెరికాలో ఫ్రెంచి సామ్రాజ్యము విస్తరించినది. పెట్టీ రాడిసన్, మేడార్టు షూవార్డులు పశ్చిమమునందున్న ప్రెయిరీ భూములలో ప్రవేశించిరి (1859). సుపీయర్ సరస్సుతీరమున 1862 వాటికే ఫ్రెంచి మతప్రచారకుల స్థావరము లేర్పడెను. 1882 నాటికి రెనీ రాబర్ట్ కెవిలియర్ అను నాతడు మిసిసిపీ నదీలోయ నాక్రమించి, తమ చక్రవర్తి యైన 14వ లూయీ (Louies XIV) పేర, దానికి లూయీ సియావా అని పేరిడెను. ఈ విధముగ నుత్తర అమె రికాలో ఫ్రెంచివారికి కెనడా, లూయీ సియానా అను రెండు పెద్దవలస లేర్పడెను. ఆంగ్లేయుల రాక : ఆంగ్లేయులు కూడ తూర్పుదేశము లకు పశ్చిమోత్తర మార్గమును పరిశోధించు వాళ్లతో కెనడాను చేరిరి. ఇంగ్లండులోని మాస్కోవి వర్తక సంఘముయొక్క ప్రోత్సాహముతో, హెన్రీ హడ్సన్ అను నావికుడు ఆర్కిటిక్ మహాసముద్రములో నాలుగు లొనరించి 1600 లో కెనడా ఉత్తరమునందున్న అఖాతమును చేరెను. అది అతని పేర నేటికిని 'హడ్సన్ బే' అని వ్యవహరింపబడుచున్నది. నాల్గవయాత్రలో హడ్సన్ అనువులను కోల్పోయెను. కాని అతని పరిశోధన లాంగ్లే యులకు ప్రోత్సాహమిచ్చెను. 1870 లో ఆంగ్లేయులు హడ్సన్ లే కంపెనీనీ స్థాపించి కెనడా ఉత్తరప్రాంతము లలో వర్తక స్థావరములను నెలకొల్పసాగిరి. ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, పోటీ: ఆంగ్లేయులు

హడ్సన్ బే తీరము నాక్రమించుటతో కెనడాలో ఫ్రెంచి విస్తరణమునకు ఆటంకము కలిగినది. నాటికే ఆం ఆంగ్లేయులు అట్లాంటిక్ తీరమున న్యూఇంగ్లండ్, మేరీలాండ్, వర్జీ నియా, న్యూయార్కు, పెన్సిల్వేనియా మున్నగు 18 వలసలు స్థాపించి యుండిరి. ఆ వలసలకు ఉత్తర దక్షిణములందు ఫ్రెంచి స్థావరములైన కెనడా, లూయీ సియానాలు గలవు.' అదే విధముగ ఫ్రెంచి కెనడా ఉత్తర దక్షిణములం దాంగ్ల వలసలున్నవి. ఫ్రెంచివారును, ఆంగ్లేయులును ఆగర్భ శత్రువులు; అందుచే అమెరికాలో వారిమధ్య సంఘర్షణము అనివార్యమైనది. ఫ్రెంచివారు ఫ్రాంటినాల్, నయాగరా, క్రౌన్ పాయింట్ మున్నగు దుర్గములను నిర్మించి ఆంగ్ల వలసలను దిగ్బంధన మొనర్చి, ఆంగ్లేయులను అమెరికానుండి తరిమివేయ ప్రయత్నింపు సాగిరి. ఫ్రెంచి యెత్తులకు ఆంగ్లేయు లెదురెత్తు లెత్తు చుండిరి. ఈ పరిస్థితులలో ఐరోపాఖండ రాజకీయములు ఆంగ్ల పరాసు స్పర్థకు పదును బెట్టుచు, సంఘర్షణమున కవకాశములు కల్గించుచుండెను. కెనడా ఆంగ్లేయుల వశమగుట కెనడాలో ఆంగ్ల పరాను పోరాటము 1628 లోనే ప్రారంభమై, తాత్కా లికముగ 1832లో జరిగిన సెంట్ జర్మెయిన్ సంధితో ముగిసినది. తిరిగి ఐరోపాలో ఇంగ్లీషు వారసత్వ యుద్ధ మారంభమైనంతనే, కెనడాలో 'ఫ్రెంచివారును, ఆంగ్లేయులును పోరాడసాగిరి. 1800 లో సర్ విలియం ఫిలిప్సు, బోస్టన్ నుండి బయలు దేరి నోవస్కోషియాను జయించి క్విబెక్ ను ముట్టడించెను. కాని ఫ్రెంచి గవర్న రైన ఫ్రాంటినాల్ ఆంగ్లేయుల నోడించి క్విబెక్ ను రక్షింప గల్గెను. రిస్విక్ సంధితో ఈయుద్ధమాగినది. ఐరోపాలో జరిగిన స్పానిషు వారసత్వ యుద్ధమును (క్రీ.శ. 1718) ఫ్రాన్సు, ఇంగ్లండులు చెరియొక, పక్షము వహించి పోరాడెను. ఫ్రెంచి చక్రవర్తియైన 14 వ లూయీ యొక్క దురాశను, దురాక్రమణను అరికట్టు టకే ఈ యుద్ధము జరిగినది. ఇందు ఫ్రెంచివారు పూర్తిగా ఓడి 1718లో జరిగిన ఉ (Utrecht) సంధి ప్రకారము నోవాస్కోషియాను ఆంగ్లేయుల పర మొనర్చిరి. దీనితో ఫ్రెంచి అధికార భానుడు పశ్చిమాభిముఖుడై నాడు. ఫ్రెంచి సామ్రాజ్యపతనములో 3