పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కెనడా (చరిత్ర) లారెన్సు నదీలోయలో కొంతభాగమును ఎఱ్ఱ ఇండియ నులు కెనడా యని పిలిచెడివారు. క్రమముగా దేశమంత టికి అదే పేరు వర్తించినది. విస్తీర్ణము-ఎల్లలు : ప్రపంచ రాజ్యములలో, వైశాల్య మున సోవియట్ రష్యా తరువాత పెద్ద రాజ్యము కెనడా. కెనడా వైశాల్యము ఇంచుమించు యూరప్ ఖండము నకు సమానము. తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణమున అమెరికా సంయుక్త రాష్ట్రములు (U.S.A), పశ్చిమమున అలాసారాష్ట్రము, పసిఫిక్ మహాసముద్రము, ఉత్తరమున ఆర్కిటిక్ మహాసముద్రము, అందలి గ్రీన్ లాండు కెనడాకు ఎల్లలు. వీని మధ్యనున్న కెనడా వైశాల్యము 38,45,744 చ. మైళ్ళు. కెనడాకు 24,000 మైళ్ళ తీర రేఖ గలదు. 1956 సం. లెక్కల ప్రకారము కెనడా జనా భా 1,60,80,791. అట్టావా (Ottava) కెనడాకు రాజధానీనగరము. నివసించు ప్రజలు : కెనడాలో పలు తెగల ప్రజలు చున్నారు. అందు 1,65,000 మంది ఆదిమవాసులు ; వీరిలో ఎఱ్ఱ ఇండియనులు, ఎస్కిమోలు ఎన్నదగినవారు. ఎఱ్ఱ ఇండియనులలో 'ఇరాకీ'లు, హ్యూరానులు, ఆల్ జొంకీలు మొదలైన తెగలు గలవు. ఐరోపా జాతులలో మొట్టమొదట కెనడాలో నివాస మేర్పరచుకొన్నది ఫ్రెంచివారు. తరువాత ఆంగ్లేయులు, స్కాట్, ఐరిష్ జాతులవారు, నార్వే, హంగరీ, ఇటలీ, రష్యా దేశముల వారు కెనడాకు వలసవచ్చిరి. 19వ శతాబ్దమున కెనడాలో వ్యవసాయపరిశ్రనులో పనిసంపాదించుకొనుటకై చైనా, జపాన్ దేశములవారు రాసాగిరి. 1908 లో జపాన్ వారి రాకను నిషేధించుచు కెనడా ప్రభుత్వ మొక శాసన మొన ర్చెను. అక్కడక్కడ నగరములలో నీగ్రోలు కన్పించుదురు. కెనడా పరిశోధన : అమెరికా ఖండముతో బాటు, ఆధు నికయుగ ప్రారంభముననే కెనడా, భూగోళ శాస్త్రమున చేరినది. కాని మధ్యయుగముననే కెనడా పరిశోధింపబడి నట్లు చరిత్రకారు లభిప్రాయపడుచున్నారు._10వ శతాబ్ద ముననే లీఫ్ ఎరిక్సన్ నాయకత్వమున, నార్వేదేశస్థులు గ్రీన్ లాండు ద్వీపము నాక్రమించి కెనడాలో ప్రవేశించి యుండవచ్చును. ఈ యాత్రవలన శాశ్వతమైన ప్రయోజ నములు కలుగలేదు. సంగ్రహ ఆంధ్ర ౨ ఆధునిక యుగారంభమున ఐరోపా ప్రజలలో భూగోళ పరిశోధనలయం దెక్కువ ఆసక్తి జనించినది. పశ్చిమాభి ముఖముగ బయలు దేరి తూర్పు దేశములకు సముద్ర మార్గము నన్వేషించుట కనేక ప్రయత్నములు జరిగెను. ఆ ఆశయముతో నే' క్రిస్టఫర్ కొలంబస్ 1492లో పశ్చిమ ఇండియా దీవులను కనుగొనెను. అదే ప్రయత్నములో బయలు దేరిన 'జాన్ కాబట్' అను ఇటాలియను నావికునకు కెనడాను పరిశోధించిన గౌరవము దక్కినది. ఇంగ్లండులో ట్యూడర్ రాజవంశ స్థాపకుడైన ఏడవ హెన్రీ సహాయ ముతో బ్రిస్టల్ రేవునుండి 'మోడ్యూ' అను నౌకలో బయలుదేరి కాబట్ 1497లో కెనడా చేరి “కెనడా కొలం బస్" అను బిరుదమం దెను. నాటినుండి ఐరోపాలోని బెస్తవాండ్రును, ఉన్ని వర్తకులును అసంఖ్యాక ముగ 2 కెనడాకు రాసాగిరి.

చేతులు కెనడా : ఫ్రెంచివారి వలస 15వ శతాబ్దమున, వర్తక వాణిజ్యములలోను, వలసరాజ్య స్థాపనములోను ఐరోపా రాజ్యములమధ్య భయంకరమయిన పోటీ చెల రేగెను. ఇందులో కెనడా మొదలైన రాజ్యములు పెక్కుమార్లు మారినవి. మొట్టమొదట తమ చక్రవర్తుల ప్రోత్సాహముతో ఫ్రెంచివారు కెనడాలో వలసలు స్థాపిం చిరి. మొదటి ఫ్రాన్సిస్ కాలమున (1534) జాక్విస్ కార్టియర్ అను ఫ్రెంచిసాహసికుడు, న్యూ ఫౌండు లాండ్ చేరి సెంటులా రెన్సు నదిపై మూడుమార్లు పరి శోధకయాత్ర సాగించెను. కెనడాలో ఫ్రెంచివలసలు స్థాపించిన వారిలో శామ్యుయల్ షాంప్లేన్ సుప్రసిద్ధుడు. ఫ్రెంచి చక్రవర్తి నాల్గవ హెన్రీ (1588-1610) యొక్క సహాయముతో షాంప్లేను సెంట్రెన్సు నదీప్రాంత మును, హ్యూరాన్, అంటారియో సరస్సులను పరిశో ధించి, అకేడియా (Acadea) అనబడు న్యూబ్రన్ స్విక్, నోవాస్కోషియా అను ప్రాంతములపై ఫ్రెంచిపతాకను ప్రతిష్ఠించెను. పోర్టురాయల్ (1604), క్విబెక్ (1808) నగరములను నిర్మించినదికూడ నితడే. నాటినుండి ఫ్రెంచి వారు తండోపతండములుగ కెనడాకు వలస వచ్చిరి. ఫ్రెంచి ప్రధానులైన కార్డినల్ రిష్ ల్యూ (Richelieu), కోల్ బర్టు (Colbert) కోల్ బర్టు (Colbert) లు కూడ వర్తక సంఘములు స్థాపించి, కెనడా ఆక్రమణను ప్రోత్సహించిరి. కాథలిక్