పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కెకులే (1829 - 1896):

ఈతని పూర్తి పేరు ఫ్రెడ్రిక్ అగస్ట్ కెకులే. కెకులే జర్మను దేశీయుడు. రసాయన శాస్త్రవేత్త. అతడు డార్మ్ స్టాట్ అనుచోట క్రీ. శ. 1929వ సంవత్సరమున సెప్టెంబరు 7వ తేదీన జన్మించెను. కెకులే మొదట 'గీసెన్' అను ప్రదేశమున శిల్పశాస్త్రము నభ్యసించి, లీజిగ్ అను ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్తయొక్క ప్రభావబలముచే రసాయనశాస్త్ర మభ్యసించుట ప్రారంభించెను. అతడు గీసెన్ నుండి పారిస్కు వెళ్ళి, పిమ్మట ఇంగ్లండునకుగూడ పోయి, అచ్చటనున్న ప్రఖ్యాత రసాయనశాస్త్రజ్ఞులతో కొంతకాలము సహవాసము చేసెను. జర్మనీ దేశమునకు తిరిగివచ్చి, హీడెల్ బర్గులో కొలది సాధన సామగ్రితో నొక చిన్న రసాయన పరిశోధనాలయమును నెలకొల్పి, అచట ముఖ్యమగు పరిశోధనము లెన్నియో చేసెను. 1856వ సంవత్సరమున హీడెల్ బర్గులో కెకులే రసాయన శాస్త్రమున అసిస్టెంటు ప్రొఫెసరై 1858 లో మెంట్ అనుచోట ప్రొఫెసర య్యెను. 1865వ సంవత్సరములో ప్రొఫెసయ్యెను. ఇతడు 'డాన్' నగరమునకు ప్రొఫెసరుగా ఆహ్వానింప బడెను. జీవితాంతమువరకు అతడాపదవియందే (సుమారు 81 సంవత్సరములు) పనిచేసెను. రసాయనశాస్త్ర సిద్ధాం తమునకు, ముఖ్యముగా కర్బనసంయోగ పదార్థముల నిర్మాణమును గూర్చి కెకులే చేసిన శాస్త్రవిజ్ఞాన సేవ చాల ముఖ్యమైనది. 1858వ సంవత్సరమున కర్బనము చతుళ్ళక్తికము (tetravolent), అనగా దానిసంయోగ సామర్థ్యము 4 రెట్లగుటకు కారణములను నిరూపిం చుచు, కాకులే అతని ప్రసిద్ధసిద్ధాంతమగు 'పరమాణువుల లంకె' (Doctrine of linking of atoms) అను దానికి ముఖ్యలక్షణములను వెలిబుచ్చుచు నొక పరిశోధనా పత్రమును ప్రకటించెను. 1865వ సంవత్సరమున సేంద్రియ రాసాయనిక పదార్థములలో నొక శాఖకు మూలాధారమగు ' బెన్జిన్' అను పదార్థనిర్మాణమును గూర్చి 'సంవృత బంధము' లేక 'వలయము' (closed chain or ring) అను సిద్ధాంతమును కెకులే సూత్రీకరించెను. సేంద్రియ రసాయనశాస్త్ర మంతటిలో ఆ సిద్ధాంతము మహోజ్జ్వలమైనదని శాస్త్రజ్ఞు లామోదించిరి. ఆ సిద్ధాంతమువలన సువాసన నిచ్చెడి సేంద్రియ సంయోగ పదార్థముల నిర్మాణము స్పష్టమగుటకు అవకాశము కలిగినది. కెకులే 1898వ సంవత్సరమున జూన్ 18వ తేదీన కాలధర్మము నొందెను.

1898 వ సంవత్సరములో ప్రొఫెసర్ ఎఫ్. ఆర్. జాష్ అనునతడు కెకులే స్మారకోపన్యాసము నిచ్చుచు, ఆధునిక సేంద్రియ రసాయనశాస్త్రములో ముప్పాతిక వంతు సూటిగవో, వక్రముగనో కెకులేయొక్క బెనిన్ సిద్ధాంతమునుండి బయలు దేరినదే నని వక్కాణించెను. కెకులే రసాయనశాస్త్ర పత్రిక నొక దానికి సంపాదకత్వము నిర్వహించెను.

బి. వి. ర.

కెనడా (చరిత్ర):

కెనడా, ఉత్తర అమెరికా ప్రధాన రాజ్యములలో నొకటి. కెనడా అనుమాటకు అమెరికా ఆదిమవాసులైన ఎఱ్ఱ ఇండియనుల (Red Indians) భాషలో పట్టణమని యర్థము. ఐరోపావారీ దేశమునకు రాకపూర్వమే సెంటు