గుఱ్ఱపు దళము
సంగ్రహ ఆంధ్ర
ములను నిర్మించుట పదాతి దళముయొక్క లక్ష్యమని చెప్పనగును. శత్రువుయొక్క ఆశ్విక దళములను తెగటార్చుటగూడ స్వపక్షమునకు చెందిన ఆశ్విక దళముయొక్క ప్రధానలక్ష్యమై యుండవలెనని యుద్ధనిపుణుల అభిప్రాయము. శత్రు పదాతిదళములను కనుమరగి వంచించుట, అదనుచూచి ప్రతిఘటించుటకు శత్రువునకు అవకాశము నియ్యకుండ వెనుక భాగమును దునుమాడుటకు అవసరమైన వేగమును సంపాదించుకొనుట రెండవ బాధ్యతగా గుర్తెరుగవలెననిరి. శత్రువుయొక్క సైనిక వ్యూహ నిర్మాణము, యుద్ధపాటవము తమవాటికంటె మిన్నగా నున్నపుడు, పైన పేర్కొన్న చర్యక్లిష్టమైనదిగా నుండును. కాన నిర్మాణము, వ్యూహము, నాయకత్వము, సహకరించి శక్తిమంతములుగా నున్నపుడే, ఆశ్వికదళము యొక్క చతురత, చలనశక్తి, త్వరితగతి, అభివృద్ధియై ప్రచండమైన యుద్ధాంగముగా వ్యవహరింప గల్గును.
అలెగ్జాండరు కాలమునుండి ఆశ్వికదళము ప్రధానమైన యుద్ధాంగమాయెను. క్రీ. పూ. 218, 216 సం. లలో జరిగిన 'ట్రెబ్బియా' 'కాన్నా' యను యుద్ధములలో రోమనులకు ఆశ్వికదళములు లేనందువలన కార్తేజియన్ ఆశ్వికబలములు వారిని నుగ్గునూచము చేయగలిగెను. ఇదే విధముగ రోమకచక్రవర్తి యగు జూలియస్ సీజర్ కాలములో, పార్థియన్ సేనానివలన, రోమన్ సైన్యములు, ఘోరమైన ఓటమి చెందెను. ఆశ్విక పదాతిదళములను సంయోగము చేయుటకు మారుగా, రెండింటిని వేరుపరచి, ఒక్కదాని మీదనే ఆధారపడుటవలన ఈ ఓటమి సంభవించెనని చరిత్రకారులు వ్రాసియున్నారు.
క్రీ. శ. 378 లో జరిగిన 'ఏడ్రియా నోపిల్' యుద్ధముతో అశ్వికదళ శకము ప్రారంభమాయెను. సంగ్రామ చరిత్రలో ఇది నూతనాధ్యాయముగా చెప్పబడుచున్నది . మొట్టమొదటిసారిగా ఆశ్వికదళము జయాపజయములు నిర్ణయింపగల 'షాక్ ట్రూప్స్' (ఆకస్మికముగ అదురు దెబ్బ కొట్టగలది) గా పరిణామము చెందినది. పూర్వమువలె గాక, 'షాక్ ట్రూప్స్' స్వతంత్ర శక్తిగా శత్రువుతో తలపడి విజయము సాధించుటకు ప్రారంభించెను. అప్పటినుండి 1000 సంవత్సరముల వరకు యుద్ధ వ్యూహమునందు ఆశ్విక దళములదే పైచేయి యైనది. ఈ కాలమందు అత్యద్భుతమైన కౌశల్యము కలిగిన విలుకాండ్రతో మాత్రమే ఆశ్వికదళములను నిర్మించుటకు సైనికనిపుణులు నిశ్చయించిరి. అత్తిలుని అనంతరము అఖిలప్రపంచమును గడగడలాడించిన మంగోలియా నాయకుడు చెంఘిస్ ఖాన్ యొక్క నాయకత్వమున విలుకాండ్రతో ఆశ్వికదళముల నిర్మాణము సంపూర్ణముగా అభివృద్ధిచెందెను. అనుపమానమైన ఈ ఆశ్వికదళముల సహాయమున చెంఘిస్ ఖాన్ అసంఖ్యాకములైన విజయములను సాధింపగల్గెను. ఇతడు ప్రయోగించిన షాక్ ట్రూప్స్ యొక్క ప్రచండమైన శక్తి, పెక్కు భంగులలో జర్మన్ ఫాసిస్టులు గతయుద్ధమున ప్రయోగించిన “బ్లిట్జ్ క్రిగ్” విధానమును పోలియుండెనని ఆధునిక సైనిక వ్యాఖ్యాతలు అభిప్రాయపడిరి.
17 వ శతాబ్దిలో అశ్వికదళముల సంఖ్య ఇతర సేనాంగములకంటె అత్యధికముగా నుండెను. ఆ శతాబ్దములో ఇంగ్లండులో జరిగిన అంతర్యుద్ధములో ప్రజాప్రతినిధుల సైన్యములోకంటె రాజుపక్షపు (Royal) సైన్యములో, ఆశ్విక సైనికుల సంఖ్య అధికతరముగా నుండెను. ఈ యుద్ధమందును, పిదప ఐరోపాఖండములో జరిగిన అనేక యుద్ధములందును కత్తులు, కటారులు, బల్లెములు, ఈటెలు, తుపాకులు మొదలైన ఆయుధములు ధరించగల పెక్కు శ్రేణులకు చెందిన అశ్వికదళములు ఉపయోగపడినవి. అయితే శక్తిమంతములైన నూతనాయుధములు అవతరించినంతనే, ఆశ్వికుని ఖడ్గకుంతలాదులు ప్రాతపడి, ఆశ్వికదళముల ఉపయోగము నుండి దూరమయ్యెను.
వేయిసంవత్సరముల కాలము అప్రతిహతమైన శక్తిగా వెలుగొందిన ఆశ్వికదళము ఇపుడు తన ప్రత్యేకమైన ప్రాముఖ్యమును కోల్పోయి ఇతర యుద్ధాంగములలో ఒకటియైనది. శత్రుస్థావరములను కనిపెట్టుటకు, శత్రువునకు నష్టము కలుగజేయుటకు శత్రువుల రహదారులకు, సరఫరాలకు చీకాకు కల్గించి ధ్వంసముచేయుటకు ఆశ్వికదళములు అత్యావశ్యకములే కాని, శత్రువును నిర్మూలించుటకు ఆధునిక యాంత్రికయుగములో అశ్వికదళము స్వతంత్రమైన శక్తిగా వ్యవహరింపజాలదని పెక్కు యుద్ధశాస్త్రపారగులు నుడువుచున్నారు.
406