Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 గురుత్వాకర్షణము

B. అనునది చాల చిన్నదిగ చేయబడినచో, రెండవ తల ముపై b. అను అదే ఎత్తును ఎక్కుటకు చాల దూరము ప్రయాణింపవలసి యుండును. క్షితిజ (horizontal) తల ములు (Ba= O) సంకోచ పరచినచో, మొదటి తలము యొక్క అడుగును చేరుటవలన చేకూరిన వేగము (Veloc. ity) చే ఆ పదార్థము అనంతముగ కదలుచుపోవును. అదే వేగముతో పదార్థమును కదలునట్లు చేయుటకై శక్తి అవసరము లేదని దీని యర్థము.

ఖగోళశాస్త్రమందు కెప్లర్ కావించిన ఆవిష్కరణములు : బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని అను అయిదు గ్రహములు పూర్వకాలమునుండి పరిచితము లైనవే. క్రీస్తునకు పూర్వమే వాటి చలనములు అధ్యయన మొనర్పబడినవి. టై కేబ్రాహే (Tyche Brahe, 1546- 1801) అను శాస్త్రజ్ఞుడు తన జీవిత కాలమున ముప్పది సంవత్సరముల వరకు వీలయినంత కచ్చితముగా ఈ గ్రహముల స్థితులను, కదలని నక్షత్రముల స్థితులమ పరిశీలించెను. అనంతరము కెప్లర్ (1571-1830) గ్రహ విషయకములయిన తన దత్తాంశములనుండి (data) సుప్రసిద్ధములైన మూడు ప్రాయోగిక సిద్ధాంతములను అను మేయించెను. వీటిలో ఒకటవది, రెండవది 1609 లోను, మూడవది 1619 లోను తెలుపబడినవి. కెప్లర్ సిద్ధాంతములు క్రింద పేర్కొనబడినవి :

(1) ప్రతి గ్రహముయొక్క కక్ష్య (orbit) సూర్యు నితో సంగమించు బిందువులలో (Foci) ఒక దానిలో అండ వృత్తాయతముగా (Ellipse) నుండును.

(2) గ్రహమును, సూర్యుని కలుపు రేఖ సమాన కాల ములలో సమాన వి స్తీర్ణమును తెలుపును.

(3) గ్రహములు సూర్యుని చుట్టును పోవుటకు పట్టు కాలము యొక్క చతురములు (squares) సూర్యుని నుండి వాటి సగటు (mean) దూరము యొక్క ఘన పరిమాణములకు (cubes) అనురూపముగ నున్నవి. T అనగా = a³ ఒక స్థిరాంకము. ఇది అన్ని గ్రహములకును ఒక టే. ఈ మూడు సిద్ధాంతములను న్యూటన్ తన సర్వ సామాన్య గురుత్వాకర్షణ సిద్ధాంతమును కని పెట్టుటకు సోపాన ప్ర స్తరములుగ ఉపయోగించెను.

న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతము: గెలిలియో, న్యూటనులు కని పెట్టిన గతిశాస్త్ర సూత్రముల సారము ఈ క్రింది మూడు చలన సిద్ధాంతములలో పొందుపరచ బడినది.

(1) ఏదైన నొక శక్తి యొక్క ప్రభావమునకు లోనైననే తప్ప, లేనియెడల ప్రతి పదార్థము దాని విశ్రాంతి స్థితిని (state of rest) లేక సరళ రేఖ యందలి ఏక రూపచలనమును (uniform motion) సాగించుచు నే యుండును.

(2) గతిభారము నందలి (momentum ద్రవ్య రాశి × వేగము) మార్పు యొక్క రేటు ఉపయోగింప బడిన శ క్తికి అనురూపముగ నుండును. 'అది శక్తి పని చేయు దిశ యందు సంభవించును.

(3) ఒక్కొక్క క్రియకు (action) ఒక్కొక్క ప్రతి క్రియ (reaction) గలదు. అది క్రియకు సమముగను వ్యతి రేక ముగను ఉండును.

కెప్లర్ యొక్క మొదటి చలన సిద్ధాంతమును బట్టి ఇట్లు తెలియుచున్నది : గ్రహములు సరళ రేఖలో కదలక పోవుటచే ఒక శక్తి వాటిలో ప్రతిదానిపైనను పనిచేయు చున్నది. రెండవ చలన సిద్ధాంతమును, కెప్లర్ యొక్క రెండవ, మూడవసిద్ధాంతములను న్యూటన్ ఉపయోగించి ప్రతి గ్రహము మీదను పనిచేయుచున్న శక్తి సూర్యుని దిశయం దున్నదనియు, అది F = అను సంబంధ ముచే ద్యోతకమగుచున్నదనియు, అందు M అనునది గ్రహము యొక్క ద్రవ్యరాశిగను, R అనునది సూర్యుని నుండి దాని దూరముగను, K అనునది అన్ని గ్రహము లకు సమమైన ఒకే సంఖ్యగ నున్నదనియు అతడు అనుమే యించెను. పిదప న్యూటన్ తన మూడవ చలన సిద్ధాంత మును ఉపయోగించెను. సూర్యుడు M అను ద్రవ్యరాసి యగు గ్రహమును అను శక్తిచే ఆకర్షించుట వలన ఆ గ్రహము గూడ తుల్యమైన శక్తిచే ఆకర్షింపవలయును. శక్తి (force), మొదటిదాని విషయమున ఆకర్షింపబడిన పదార్థము యొక్క ద్రవ్యరాశికిని, రెండవదాని విషయ మున ఆకర్షించు పదార్థము యొక్క ద్రవ్యరాశికిని అను గుణముగ నుండును గనుక, సౌష్ఠవము (symmetry) కొరకు Kలో M° అను సూర్యుని ద్రవ్యరాశి చేరియున్న దని ఊహించుట సహేతుకమే అగుచున్నది. కావున