Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురుత్వాకర్షణము సంగ్రహ ఆంధ్ర

ప్రదముగ ప్రతిపాదింప గల్గుటచే, అతని ప్రతిభ గొప్ప ప్రశంసకు పాత్ర మగుచున్నది. ప్రముఖమైన ఈ సూత్రా విష్కరణ మందలి ప్రధానాంశములను గురించి దూర వ్యాప్తి గల తదంతర్గతాంశములను, ఇటీవలి భావపథ ములను తెలిసికొందము.

గతిశాస్త్రమందు గెలిలియో సాధించిన ఘనకార్యములు : గెలిలియోకు పూర్వమే చలనములను గూర్చిన రెండు అపార్థములు ప్రచారమం దుండెను. (1) ఒకే ఎత్తునుండి రెండు భౌతిక పదార్థములు నిరాటంకముగా భూమి పై పడుటకు వలసిన కాలము వాటి బరువుపై ఆధారపడి యుండునని విశ్వసింపబడినది. (2) అనవరత గతి వేగము (Constant velocity) తో నొక భౌతిక పదార్థమును చలింపజేయుటకు శక్తిని ఉపయోగించుట అవసరమని భావింపబడినది. ఆతడు తన బుద్ది కౌశల్యముతో ఆలోచించి, యుగములనుండి వ్యాప్తియందున్న ఈ అపార్థములందు గల దోషములను బయలుపరచెను. గెలిలియో ఇట్లు వాదించెను : 'A', 'B' అను రెండు భౌతిక పదార్థము లున్నవనుకొనుము. 'A' కంటె 'B' బరువైనది. ఒకే ఎత్తునుండి 'A' యును, 'B' యును క్రిందికి జార వేయ బడినవనుకొనుము. అపుడు బరువైన భౌతిక పదార్థము తేలిక యైన భౌతిక పదార్థముకంటె వేగముగా పడునని అనుకొనినచో, 'B' కంటే 'A' పడుటకు ఎక్కువకాలము పట్టును. ఈ రెండు పదార్థములను జతపరచి ఒకే ఎత్తు నుండి జారవిడచినచో, తేలికయగు 'A' అను పదార్థము అంతకం టె బరువయిన 'B' అను పదార్థముకంటే మెల్లగా క్రిందపడుటకు యత్నించును. కావున 'B' 'A' చే పైకి లాగబడును. ‘A' యొక్క సంబంధముచే 'B' యొక్క చలనము మందీకృతమగును. 'B' ఒంటరిగా నున్నచో వదులుటకు పట్టు కాలముకంటె, 'A' 'B' లు కలిసి యున్నపుడు దీర్ఘకాలము పతనమందు అవసరమగును. ఈ రెండు విషయములందలి ఫలితములలో పరస్పర వైరుధ్యము కలదు. అందుచే, గురుతరమైన భౌతిక పదార్థములు ఎక్కువ వేగముగా క్రిందపడునను అంగీకృత ముఖ్య సూత్రమును గూర్చి సందేహము జనించుచున్నది. ఆ రెండు భౌతిక పదార్థములు ఒకే ఎత్తునుండి క్రిందపడు టకు వలసిన కాలము సమానమే అని అనుకొనినచో ఈ రెండు ప్రయోగములను తృప్తికరముగా వివరింప వచ్చును. దీనిచే ప్రేరేపితుడై, గెలిలియో తా నొనర్చిన సుప్రసిద్ధ ప్రయోగమందు భిన్నమైన బరువులుగల రెండు భౌతిక పదార్థములను 'పైసా' నగరమందలి గోపురము నుండి క్రింద పడ పై చెను. ఆ పదార్థములు ఏక కాలమున నే భూమి పై పడెను. దీనితో బహు కాలమునుండి వ్యాప్తి యందున్న దోషము సవరింపబడెను. అనంతరము గెలి లియో ‘T' అను కాలములో 'S' అను ఎత్తునుండి పడు భౌతిక పదార్థము S=GT' అను సంబంధముచే ప్రతి పాదింపబడునని కనుగొనెను. ఇందు 'G' అనునది గురు త్వాకర్షణమువలన నేర్పడిన వేగాధిక్య (acceleration) మగుచున్నది. శాస్త్రవిజ్ఞానమునకు గెలిలియో చేసిన అమూల్యమగు సేవ మరియొకటి కలదు. అది అతడు కనుగొనిన జడిమత్వ సిద్ధాంతము (Law of Inertia). అతడు ఊహాజనిత మైన ఒక ప్రయోగమును దర్శించుటచే ఈ నిశ్చయమునకు వచ్చెను. ఆ ప్రయోగములో వంగిన రెండు తలములు (inclined planes) క్రింది చూపబడిన రీతిగా ఉంచబడెను. సంఘర్షణము లేనిచో, ఒక తలమునకు సంబంధించిన ‘bi’ అను ఎత్తునుండి క్రిందికి పొర్లు పదార్థము రెండవ తలముపై ‘b.' అను ఆ ఎత్తునకే ఎక్కును. ఇందు

చిత్రము - 105