Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ a 50 393 గురుజాడ వేంకట అప్పారావు

మందు ప్రచారములో నున్న బృహత్కథ మూలమై యుండవచ్చును. ఈ మొత్తము గ్రంథము యొక్క 28 సర్గలలో 6 మాత్రమే ప్రస్తుతము లభించుచున్నవి.

2. క్షేమేంద్ర రచితమగు బృహశ్చ థా మంజరి. ఈకవి కాశ్మీర దేశపు రాజగు అనంతుని ఆశ్రితుడు. ఇతడు 11 వ శతాబ్దిలోనివాడు. ఇతని గ్రంథమందు 7500 శ్లోకములు మంచి కవిత్వపటిమను కలిగియుండును. కవిత్వమున కెక్కుడు ప్రాధాన్యము నిచ్చియుండుట చే ఇతడు మూలము నెంతగా అనుసరించెనో చెప్పుట కష్టము.

3. సోమదేవునిచే రచింపబడిన కథాసరిత్సాగరము. ఈ కవి గూడ కాశ్మీరాధిపతియగు అనంతుని (1029-1081) ఆశ్రితుడు. మేమేంద్రుని సమకాలికుడు. అనంతుని భార్య యగు సూర్యమతీదేవి యొక్క ప్రోత్సాహమున సోమ దేవభట్టు పై శాచిభాషలోని బృహత్కథను కథాసరిత్సాగర మను పేరుతో సంస్కృతభాషలోనికి అనువదించెను. ఈతని యనువాదమే మిగిలిన రెండింటికన్న సంపూర్ణ మైనదై బహుళ ప్రచారము నొందియున్నది. దీనియందు 24,000 శ్లోక ములు కలవు. ఈ కవి తన అనువాద రచనను గూర్చి,

"యథా మూలం తథై వై తన్నమనాగ ప్యతిక్రమః ఔచిత్యాన్వయ రణా చ యథాశక్తి విధీయతే కథారసా విఘాతేన కావ్యాంశ స్వచయోజనా వై దగ్ధ్యఖ్యాతి లాభాయ మమనై వాయ ముద్యమః కింతు నానాకథాజాల సృ్మతిసౌకర్య సిద్ధయే”

“మూలమును ఏమాత్రము అతిక్రమించకుండ యథా తథముగను, ఔచిత్యాన్వయములను చెడగొట్టకుండగను, కథ యొక్క రసభంగము జరుగకుండునట్లుగను, కావ్యాం శమును పాటించునట్లుగను, ఈ యనువాదమును చేయు చుంటిని ; స్వప్రతిభను చాటుటకుగాని, కవిత్వాడంబరము కొరకుగాని, నా యీ ప్రయత్నము యొక్క ఉద్దేశము కాదు. నానా విధములగు కథలను సులభముగా తెలుపు టయే, దీని ప్రయోజనము" అని సవినయముగా చెప్పు కొని యుండుటనుబట్టి ఈతని యనువాదము యథా మూలముగనే యుండునని ఊహింపవచ్చును. కావున బృహత్కథను గూర్చి ఏమి చెప్పదలచినను సోమదేవుని కథాసరిత్సాగరమును అనుసరించియే యుండును.

శ్రీ కథాసరిత్సాగరములోని విషయము 18 భాగములు, 124 తరంగముల క్రింద విభజింపబడెను. క్షేమేంద్రుని బృహత్ర థామంజరి యందుకూడ 18 భాగము లే యున్నవి. కనుక మూలము కూడ అంతే గ్రంథమయి యుండును. కథాభాగములు హైందవనాగరికతా సంస్కృతులతో, అనగా పాపపుణ్యములందలి నమ్మకము, లోకాంతర ప్రాప్తి, జన్మాంతర సంభవము, దైవరాక్షసభూతపిశా చాదులు సంబంధము, యౌగికశక్తులు, మున్నగు సన్ని వేళములతో కూడిన వై, అప్పటి సాంఘిక స్థితి యొక్క ప్రత్యేకతను ప్రతిబింబింపజేయుచుండును. గుణాఢ్యుని కీర్తిని ఈ మాత్రమైనను నిలబెట్టినది, సంస్కృత కథా సరిత్సాగర మనక తప్పదు. దీని యనుకరణములు, అను వాదములు భారతదేశ భాషలందును పాశ్చాత్య భాష లందును అనేకములు వెలసినవి. మహామహోపాధ్యాయ వేదం వేంకటరాయశాస్త్రిగారు ఆంధ్రభాషలోనికి దీనిని చక్కగ అనువదించి యున్నారు.

పు. ప. శా.

గురుజాడ వేంకట అప్పారావు :

తొలుత వీరి పూర్వులది కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా, గురుజాడ గ్రామము. వీరి ప్రపితామహులు పట్టాభిరామయ్యగారు మచిలీపట్టణమున స్థిరపడిరి.

పట్టాభి రామయ్యగారి జ్యేష్ఠపుత్రులు సీతాపతిగారు, సీతాపతిగారి జ్యేష్ఠపుత్రులు వేంకట రామదాసుగారు, విజయనగర సంస్థానమున మొదట కుమఠాం ఠాణా లోను తరువాత జలంత్రా ఎస్టేట్ లోను అటుతరు వాత శృంగవరపుకోటలోను, చివరన విజయనగర మునం దు ఖిల్లేదారులుగను ఉద్యోగము చేసి అచటనే స్థిరపడిరి. వీరి సతీమణి కౌసల్యమ్మ ఎలమంచిలి తాలూకా, రాయవరం గ్రామస్థు లగు గొడవర్తి కృష్ణయ్య పంతులు గారి కూతురు. వేంకట రామదాస కౌసల్యాంబల తొలి చూలు మన గురుజాడ వేంకట అప్పారావుగారు. వీరు దుందుభి సంవత్సర భాద్రపద శుద్ధ ౧౩ ఆది వారము (80–11–1861) న జన్మించిరి. జననము, శైశవము, అక్షరాభ్యాసము మాతామహుల ఇంటనే జరిగినది. తరు వాత గులివిందాడలో వెలిపాల రామమూర్తి పంతులుగారి కడ వీరికి సంస్కృతాంధ్రాంగ్లము లభ్యస్తము లైనవి.