గుణాఢ్యుడు
సంగ్రహ ఆంధ్ర
బృహత్కథా ప్రాశస్త్యమునుగూర్చి యొకింత తెలిసికొందము. ఈ గ్రంథము పైశాచీ ప్రాకృతమందు రచింపబడెను. అపూర్వ విచిత్ర కథా కావ్యసృష్టి కలదగుటచే పలువురు ప్రాచీన సంస్కృతకవులచే అనేకవిధములుగా శ్లాఘింపబడెను, భట్టబాణుడు,
“సముద్దీపిత కందర్పా కృతగౌరీ ప్రసాదనా
హరవీలేవ నో కస్య, విస్మయాయ బృహత్కథా."
అని ఆ గాథాసంపుటిని పరమేశ్వరుని లీలాత్మకముగా వర్ణించెను. దండిమహాకవిచే "భూత భాషామయీం ప్రాహురద్భుతార్థం బృహత్కథాం" అని అద్భుత కథార్థములు కలదిగా కొనియాడబడెను. గోవర్ధనాచార్యుడు ఆర్యాసప్తశతియందు,
"అతిదీర్ఘ జీవి దోషాద్వ్యాసేన యశోపహారితమ్,
కైర్నోచ్యేత గుణాఢ్యస్స ఏవ జన్మాన్తరాపన్నః"
అని గుణాఢ్యుని వ్యాసునియొక్క అవరమూర్తిగా కీర్తించెను. కాళిదాసు మేఘ సందేశములో ఉదయనుని క థాప్రసంగమున బృహత్కథా ప్రశస్తిని ఇట్లుస్మరించెను. "ప్రాప్యావన్తీ ముదయన కథాకోవిద గ్రామవృద్ధాన్.” సుబంధుడు వాసవదత్తలో “బృహత్కథాలమ్బైరివ సాలభంజికానివహైః" అని ప్రశంసించెను. త్రివిక్ర మభట్టు నల చంపువులో,
"శశ్వద్బాణ ద్వితీయేన నమదాకారధారిణా
ధనుషేవగుణాఢ్యేన నిశ్శేషోరంజితో జనః"
అని పొగడెను. బాణ ద్వితీయుడగు గుణాఢ్యునిచే అశేష జనము ముగ్ధమగునట.
బృహత్కథకంటె ప్రాచీనమగు కథాసంపుటి మరి యొకటి లేదని చెప్పియుంటిమి. కథావస్తువుతోబాటు రసపోషణాదికము కూడ దీనియందు చక్కగా నిర్వహింపబడెను. పూర్తి గ్రంథమందు సప్త విద్యాధర చక్రవర్తులకు సంబంధించిన కథలు అభివర్ణింపబడియుండును. కాని ఒకప్పుడు ఉపలబ్ధమానమైన ఈ సప్తమాంశమందు ఉదయన మహారాజుయొక్క కుమారుడగు నరవాహన దత్తుడు నాయకుడు. అతడు తన మిత్రుడగు గోముఖుని సహాయమున మదనమంజూష యను ప్రేయసిని పాణిగ్రహణ మొనర్చి విద్యాధర సామ్రాజ్యమునకు అధిపతి యగును. ఈ నరవాహనదత్తుడు ఇంకను అనేక దివ్య మానుషాంగనలను వివాహమాడును. ఈ కథావస్తువునకు అనుబంధముగా ప్రాసంగిక గాథలు చిన్నవి, పెద్దవి అనేకములు కూర్చబడెను. అవి ఆయా సందర్భములకు తగినవియై, పాఠకులకు, శ్రోతలకు ఎంతయో అభిరుచిని పెంపొందించుటయే ఈ గ్రంథము యొక్క విశిష్టత కనుక, ప్రధాన కథ అతి మందముగా నడచుచు, అవాంతర కథలే మిక్కిలి మనోహరములై యుండును. అనవసర వర్ణనములు గాని, అసందర్భత్వము గాని కథల యందు కాన్పించదు. రామాయణ, మహాభారతముల వలె, అంతటి ఉత్కృష్టమగు ప్రధాన కథావస్తువు లేకున్నను, బృహత్కథ యొక్క ప్రభావము తరువాతి కథా సాహిత్యము నందు విశేషముగా కాన్పించును. క్రీ. పూ. 2 వ శతాబ్దిలోని భానమహాకవి కృతములగు ప్రతిజ్ఞా యౌగంధ రాయణము, చారుదత్తము, స్వప్నవాసవ దత్తము అను రూపకము లందలి కథావస్తువు బృహత్కథ లోనిదియే. బృహత్కథలోని గోముఖుడు యౌగంధరాయణుడుగాను, మదనమంజూష వసంతసేనగాను. రూపొందించబడినది. అట్లే శ్రీహర్షుడు కూడ తన నాటకముల కవసరమగు ఇతి వృత్తమును ఇందుండియే గ్రహించెను. ముద్రారాక్షసము బృహత్కథామూలకమని ధనికుడు స్పష్టముగా వ్యాఖ్యానించెను. ఇంతేగాక పంచతంత్రము, హితోపదేశము, దశకుమార చరిత్రము, భేతాళ పంచవింశతి విక్రమార్క చరిత్రము, శుకసప్తతి మున్నగు కథారచనల యందు ఆయా కృతికర్తలకు బృహత్కథయే మార్గదర్శకమనుట అతిశయోక్తి కాజాలదు. భట్టబాణుని కాదంబరికి బృహత్కథయే మూలమని స్పష్టముగా తెలియుచున్నది.
బృహత్కథ యొక్క పైశాచీ మూలగ్రంథము నేడు అదృశ్యమైపోయినను క్రీ. శ. 12 వ శతాబ్ది వరకు అది యథాతథముగా ఉండియుండవచ్చునని ధనంజయాదుల ప్రశంసా వాక్యములను బట్టి ఊహింప వీలగుచున్నది. ప్రస్తుతము ఈ మహా గ్రంథము యొక్క సంస్కృతాను వాదములు మాత్రము మూడు లభ్యమగుచున్నవి :
1. నేపాలుదేశీయుడగు బుధస్వామి కృతమగు 'బృహత్కథా శ్లోక సంగ్రహము'. ఈగ్రంథకర్త క్రీ. శ. 8 లేక 9 వ శతాబ్దికి చెందినవాడు. ఇదియే మిగిలిన అనువాదములు రెండింటి కన్న ప్రాచీనమైనది. దీనికి నేపాలు దేశ
392