Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుణగ విజయాదిత్యుడు386 సంగ్రహ ఆంధ్ర


పూర్వము అసంఖ్యాకముగా గుళ్ళతో నిండి ఉండుట చేతనే ఈ గ్రామమునకు 'గుళ్ళవాడ' 'గుడుల వాడ' అని పేరు వచ్చియుండె ననియు, చివరకు అది గుడివాడగా మారినదనియు చెప్పెదరు.

గుడివాడలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసు, రెజిస్ట్రేషన్ ఆఫీసు, సబ్ కోర్టు, మున్సిఫ్ మేజిస్ట్రేటు కోర్టులు, జుడి షియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేటు కోర్టులును, అసిస్టెంటు సూపరింటెండెటు ఆఫీసుయును, ఇంకా అనేకములగు ఇతర ప్రభుత్వ కార్యాలయములును కలవు.

స్టేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, భారతలక్ష్మీ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకుల శాఖలును, కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజల ఆర్థిక వ్యవహా రములలో తోడ్పడుచున్నవి.

విజయవాడ, భీమవరము, బందరు పట్టణములకు పోవు మీటర్ గేజ్ రైలుమార్గమునకు గుడివాడ కూడలిగా నున్నది. ఇక్కడినుండి బందరు విజయ వాడ రోడ్డును కలుపుచు పామర్రు, కంకిపాడు గ్రామములకును, ఏలూరు, భీమవరము, తిరువూరు, బంటుమిల్లి, బందరు నగరము లకును రాజమార్గములు కలవు. ఈ పట్టణము లన్నిటికి ఇక్కడినుండి బస్సు రవాణా సౌకర్యములు ఉన్నవి.

గ. సీ.

గుణగ విజయాదిత్యుడు (క్రీ. శ. 848 - 91):

క్రీ. శ. 625 నుండి సుమారు నాలుగు శతాబ్దుల కాలము తూర్పు చాళుక్యవంశపురాజులు వేంగి రాజధానిగా ఆంధ్ర దేశమును అతి వైభవముగా పరిపాలించిరి. ప్రఖ్యాతు లై న వీరిలో గుణగ విజయాదిత్యుడు అగ్రగణ్యుడు. ఇతని రాజ్యకాలములో తూర్పు చాళుక్య సామ్రాజ్యము అనేక మార్గాల వి స్తరించెను. ఇతనికీర్తి నలుదిశల వ్యాపించెను. అయిదవ విష్ణువర్ధనునికి రాష్ట్రకూట రాజపుత్రికయగు శీలామహాదేవియందు జన్మించిన నలుగురు పుత్రులలో గుణగ విజయాదిత్యుడు అగ్రజుడు. ఇతడు క్రీ. శ. 848 లో తండ్రి మరణానంతరము వేంగీ సింహాసనమును అధిష్ఠిం చెను.

గుణగ విజయాదిత్యుడు రాజ్యమునకు వచ్చుసరికి ద్రవిడదేశములో పల్లవులు; నేటి మైసూరు రాష్ట్రములో గాంగులు, నోలంబ పల్లవులు, నేటి తెలంగాణ ప్రాంత ములో రాష్ట్రకూటులు. వారికి ఉత్తరముగా చేది హైహయులు పరిపాలనము చేయుచుండెడివారు. ఈ రాజవంశములమధ్య పరస్పరము యుద్ధములు జరుగు చుండెడివి. గుణగ విజయాదిత్యుడు తన రాజ్యముయొ క్ర క్షేమముకొరకు, ముఖ్యముగా రాష్ట్రకూటుల విజృం భణమును అరికట్టుటకొరకు ఆనాటి రాజవంశ ములతో అనేక యుద్ధములు చేయవలసిన వాడయ్యెను. ఈతడు సుమారు 43 సంవత్సరముల కాలము రాజ్యము చేసెను. ఈ దీర్ఘ కాలములో అధిక భాగము యుద్ధములు చేయుట తోనే సరిపోయెను.

ఇతడు రాజ్యమునకు వచ్చిన మొదటి సంవత్సరము లోనే దక్షిణసీమలో ఉన్న బోయజాతివారు అలజడి కలిగించిరి. ఈ బోయలు పల్లవరాజులకు సామంతులుగా ఉండెడివారు. వీరు చేయు కల్లోలములను అణచి వేయు నిమి త్తము పాండురంగడను బ్రాహ్మణ సేనానిని విజయా దిత్యుడు దక్షిణదిశకు పంపించెను. ఈ సేనాని బోయల ముఖ్య కేంద్రములైన నెల్లూరు, కట్టెం దుర్గములను నాశనముచేసి వారి భూములను వేంగీరాజ్యములో చేర్చెను. దానితో తృప్తినొందక పాండురంగడు ఇంకను దక్షిణముగా దండు వెడలి పులికాట్ సరస్సువరకుగల ప్రాంతము నెల్ల జయించి వేంగీసామ్రాజ్యములో చేర్చెను. భవిష్యత్తులో బోయలు తిరిగి అలజడులు కలిగించకుండ కట్టుదిట్టముచేయు నుద్దేశముతో విజయాదిత్యుడు ఈ ప్రాంతమున కంతటికిని కందుకూరు ముఖ్యపట్టణముగా జేసి పాండురంగని పాలకునిగా నియమించెను.

ఇది జరిగిన కొద్దికాలమునకే విజయాదిత్యునికి అప్పటి రాష్ట్రకూట రాజై న అమోఘవర్షునితో పోరు ప్రారంభమై లింగవల్లి వద్ద ఘోర యుద్ధము జరిగెను. ఇందులో వేంగీ చాళుక్యసై న్యములు ఓడిపోయి విజయాదిత్యుడు తాతా లికముగా రాష్ట్రకూటులకు లోబడవలసివచ్చెను ఇట్లు రాష్ట్రకూటులకు లోబడియున్న కాలములో అమోఘ వర్షుని కోరికను అనుసరించి విజయాదిత్యుడు, రాష్ట్ర కూట రాజుపై తిరుగుబాటు చేసిన గాంగులమీద దండ యాత్ర సాగించవలసి వచ్చెను. దండు వెడలిన విజయా దిత్యుడు దారిలో నోలంబ రాజైన మంగిని ఓడించి కడకు ప్రవేశించి, అక్కడ గాంగులనుగూడ ఓడించెను. గంగవాడి