Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 349 385 66 గుడివాడ


గుడివాడ తాలూకా వరిపంటకు ప్రశ సమైనది. ఇచ్చట ఇరువదియారు బియ్యపుమిల్లులు పెద్దవి రాత్రిం బవళ్ళు పనిచేయుచుండును. ఇక్కడినుండి ప్రతివారము సుమారు 15 లక్షల రూపాయలు విలువగల బియ్యము ఎగుమతి అగుచుండును.

ఈ నగరములో పురపాలక సంఘమువారిచే మూడు ఉన్నత పాఠశాలలు నిర్వహింపబడుచున్నవి. ఇందులో ఒకటి బాలికలకు ప్రత్యేకింపబడినది. ఇవికాక 1950 లో ప్రారంభమై క్రమాభివృద్ధిని చెందుచు, ప్రస్తుతము డిగ్రీ కోర్సులకు శిక్షణ గఱపుచున్న కళాశాల కూడ ఉన్నది. 15 సంవత్సరముల క్రిందట స్థాపించబడిన 'ఆంధ్ర ప్రావిన్షి యల్ హోమియోపతిక్ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్'లో హోమియోపతిక్ వైద్యశాస్త్రము ఆధునిక పద్ధతులలో బోధింపబడుచున్నది. ఇది దక్షిణ హిందూ దేశమున కంతటికిని ఏకైక హోమియో కళా శాలయై యున్నది. కేంద్రప్రభుత్వము వారిచే గుర్తింప బడిన ఈ కళాశాలకు, వైద్య విద్యాభ్యాసముకొరకై విదేశములనుండి గూడ విద్యార్థులు వచ్చుచున్నారు.

సంగీత సాహిత్య సంస్థలు : లలితకళా నిలయముగా విరాజిల్లుచున్న ఈ నగరములో సుమారు 25 సంవత్సర ముల క్రిందట స్వర్గీయ శ్రీ కోడూరు శ్రీరాములు గారి స్మృతిచిహ్నముగా 'శ్రీ రామవిలాస సభ' ఏర్పడి నృత్య నాటక, సంగీత శాస్త్రముల పోషణము జరుగుచున్నది. ఇటీవల ఈ సంస్థ 'ఆంధ్రప్రదేశ సంగీత నాటక అకాడమి'కి అనుబంధించబడినది. రాష్ట్ర ప్రభుత్వము ఈ సంస్థ యొక్క కృషిని గుర్తించి విరాళమిచ్చెను. 1956 లో 'ఆంధ్ర నలంద' అను పేరుతో ఒక సాహితీసంస్థ ఏర్పడి ఏటేట కవి పండిత సత్కారములు చేయుచు వివిధ రంగములలో సాహిత్యకృషి సాగించుచున్నది. 1955లో ప్రారంభ మైన 'ఆంధ్ర రచయితల సంఘము' తరచుగా సాహిత్యసభలు జరుపుచు సాహిత్యరంగములో ముందడుగు వేయు చున్నది. ఈ నగరము దివ్యజ్ఞాన సమాజము యొక్క 'సర్కార్స్ ఫెడరేషన్'కు కేంద్రమై యున్నది.

దేవాలయములు; సత్రములు : ఇచ్చటి గుడులు పురా తనములు, ప్రశస్తములైనవి. వీటిలో శ్రీ భీమేశ్వరస్వామి, శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి వారల ఆలయములు ముఖ్య మైనవి. శ్రీ భీమేశ్వరస్వామి ఆలయములో నున్న శాసన ములనుబట్టి ఈ ఆలయమును “గణపతిదేవ మహారాజు సకల సేనాధిపతియైన మచ్చర రిపుగండ మాచ్చెలపుర వరాధీశ్వర శ్రీ మన్మహాసామంత నామి రెడ్డి తీర్పరి గృద్రారమునకు వెలనాంటికి నధికారి” మల్యబోయిండు కాకతి రాజ్య ప్రవర్థ మానశక వర్షంబులు ౧౧"కు పూర్వము కట్టించినట్లు స్పష్టపడుచున్నది. మల్యబోయిని కొడుకు పోతనబోయిండు, మేనల్లుడు గుండెబోయిండు, సాతమ సెట్టియు,ఇతరులును "గుడివాడకుందేశ్వర శ్రీమహా దేవర" దీపారాధన వగైరాలకు అప్పటప్పట దానములు చేసి శాసనములు వ్రాయించినట్లు కన్పించుచున్నది. ఈ శాసనములలో నూనె కొలతకు “గరుడమానిక " ను ఉపయోగించిరి. ఈ కున్దమహేశ్వరుడే తరువాత భీమే శ్వరుడుగా, సత్యముగల దేవుడుగా ప్రసిద్ధిచెందెను. విజయ నగర సమ్రాట్టు అగు తుళువ వీరనృసింహరాయల పాలన కాలమునాటి మాడయ్య అను కవి వ్రాసిన మైరావణ చరిత్రలో భీమేశ్వర స్తవము ఈరీతిగా చేయబడినది :

చ. “వలనుగ నాత్మలోన గుడి వాడపురాధిపు భీమలింగ నిం దలచి, కరంబు లెత్తి ప్రమ దంబున మ్రొక్కి నుతించి, భక్తి ని శ్చలమతి నివ్వటూరి పుర శాసను మద్గురు మల్లి కార్జునిన్ గొలిచి తదాజ్ఞ చే బ్రకట కోమల కావ్య క ళావి వేకి నై ."

పై ఆధారములనుబట్టి 'గుడివాడ' నామములు రెండును ఈ పట్టణమునకు వాడుకలో ఉన్నట్లు కన్పించుచున్నవి. ఆ రోజులలో 'గృధ్రవాడ’

ఈ భీమేశ్వరాలయములో ఒక జై నవిగ్రహము దొర కగా, స్థానికముగా నున్న జైన వ్యాపారులు ఈ విగ్రహ మును చూచి వారి మతసిద్ధాంతము ప్రకారము అది సర్వలక్షణ శోభితమై ఉన్నదని భావించి, దానిని వేరొక చోట ప్రతిష్ఠ చేసి, పాలరాతితో సుందరమయిన దేవా లయమును నిర్మించి 'అనుదినమును పూజలు చేయు చున్నారు. దక్షిణాపథములో ఇంతటి సుందర జైనా లయము మరియొకటి లేదని ప్రసిద్ధి.