గుంటూరు జిల్లా
సంగ్రహ ఆంధ్ర
అడవులు : ఈ జిల్లాయందు మొత్తము 781 చ. మైళ్ల విస్తీర్ణముగల అడవు లున్నవి. అవి అంత ముఖ్యమైనవి కావు. వీటిలో తీరప్రాంతమందున్న వాటిలో సర్వి, మడకఱ్ఱ పెరుగును. ఈ కఱ్ఱ వంటచెరకుగా నుపయోగ పడుచున్నది. మిగిలిన ప్రాంతమందలి అడవులలో చెప్పతగిన కలప పెరుగదు. పశుగ్రాసము పుష్కలముగా నుండును.
శీతోష్ణస్థితి, వర్షపాతము : మొ త్తముమీద జిల్లాఅంతయు ఉష్ణప్రాంత మనవచ్చును. తీరప్రాంతములందు సముద్ర ప్రభావముచే కొంత తక్కువ ఉష్ణోగ్రత యుండును. ఏప్రిల్, మే, జూన్ నెలలు వేసవికాలముగను, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు నైరృతి ఋతుపవనముల మూలమున వర్షములు కురియు కాలముగను, అక్టోబరు, నవంబరు నెలలు ఈశాన్య ఋతుపవనముల మూలమున వర్ష ము కురియు కాలముగను, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు శీతకాలముగను ఉండును. ఈ జిల్లాలోని తీరపు తాలూకాలకు పై రెండు ఋతుపవనముల మూలమునను వర్షములు కురియును. అందుచే ఈ ప్రాంతమందు వర్ష పాత మధికముగా నుండును. కాని మెట్ట తాలూకాలలో నైరృతి ఋతుపవనముల వలన కొలదిగా వర్షించును. తెనాలి, రేపల్లె తాలూకాలలో సంవత్సరములో 38" ల వరకు అధిక వర్షపాత ముండును. మెట్ట తాలూకాలలో 26" లు అధిక వర్షపాత ముండును. రెంటచింతల, గుంటూరులలో అత్యధిక ఉష్ణోగ్రత 118°F (48°C) ఉండును.
నేలలు : జిల్లా మొ త్తము విస్తీర్ణములో 85% నల్లనేల. ఇది మిక్కిలి సారవంతమైనది. గుంటూరు - గుంతకల్లు రైలుమార్గము వెంట ఎఱ్ఱచెక్కు నేల కలదు. సముద్రప్రాంతములందు ఇసుక నేల కలదు. కృష్ణానది వెంబడి కొంత వండ్రు మట్టితో కూడిన నేల యున్నది.
నీటి పారుదల : జిల్లాకు ఈశాన్య మందు సరిహద్దుగా నున్న కృష్ణానదికి విజయవాడ వద్ద 1850 లో ఆనకట్ట నిర్మింపబడెను. అచటి నుండి కుడివైపుగా బకింగ్ హాం కాలువ మద్రాసువరకు పోవును. దానినుండి ఒకశాఖ తెనాలితాలూకా గుండా రేపల్లెవరకును, మరియొకశాఖ బాపట్ల తాలూకాలోని నిజాంపట్టణము వరకును పోవును. ఈ రెండు శాఖలు తెనాలి, రేపల్లె తాలూకాలలోని భూములకు పూర్తిగాను, బాపట్ల తాలూకాలోని భూములలో అధిక భాగమునకును సేద్యమునకు ఉపయోగపడు చున్నవి గుంటూరు, ఒంగోలు తాలూకాలలో కూడ కొలదిభూములు ఈ కృష్ణ కాలువల మూలమున సేవ్యమగు చున్నవి. పల్నాడు, వినుకొండ, నర్సారావుపేట, సత్తెనపల్లి తాలూకాలు కేవలము దేవమాతృకములై తరచు క్షామములచే పీడింపబడుచుండును. ఒంగోలు తాలూకాలోను, గుంటూరు తాలూకాలోను వర్షాధారముగల చెరువులక్రింద కొంత సాగు జరుగుచుండుటచే కరువుల బాధ అంతగా ఉండదు. భారతదేశపు ద్వితీయ పంచవర్ష ప్రణాళికక్రింద పల్నాడు తాలూకాలోని నందికొండవద్ద కృష్ణానదిమీద నాగార్జునసాగరమను బ్రహ్మాండమగు జలాశయము నిర్మింపబడుచున్నది. ఈ నిర్మాణముయొక్క పథకము ననుసరించి ఈ జిల్లాయందలి మెట్టతాలూకాలే గాక నెల్లూరుజిల్లాలోని కొంతభాగము కూడ సేవ్యము కాగలదు. జిల్లాయందు చిన్న నీటివనరులు 277 కలవు. చిన్న, పెద్ద వనరులక్రింద మొత్తము 4,37,258 ఎకరముల భూమి సాగుచేయబడుచున్నది.
పంటలు : గుంటూరుజిల్లాలో వరియే ప్రధానమగు పంట. చోళ్లు, రాగులు, కొఱ్ఱలు, మొక్కజొన్న, జొన్న మెట్ట తాలూకాలలో పండించబడుచున్నవి. మిర్చి, పొగాకు, వేరుసెనగ, ప్రత్తి ముఖ్యమైన వ్యాపారపు పంటలు. చీరాల ప్రాంతమందు జీడిమామిడితోటలు పెంచబడును. తెనాలి తాలూకాలో దుగ్గిరాలవద్ద పసుపు విస్తారముగా పండించబడుచున్నది. ఇది యితర రాష్ట్రములకు ఎగుమతి చేయబడును.
రహదారులు : గుంటూరు పట్టణమునుండి విజయవాడకు, నెల్లూరు జిల్లాలోని భాగములకు రోడ్లుకలవు. జిల్లాయందు మొత్తము 1,659 మైళ్ళు నిడివిగల రోడ్లు కలవు తెనాలి, గుంటూరు, ఒంగోలు, నర్సారావుపేట అను పట్టణములు రోడ్ల కూడలి స్థానములు.
ఈ జిల్లాయందు మొత్తము 2951/4 మైళ్ళ పొడవుగల ఇనుపదారులు కలవు. తెనాలి, బాపట్ల, ఒంగోలు తాలూకాలగుండా కలకత్తా-మద్రాసులను కలుపు దక్షిణరైల్వే ప్రధాన మార్గమొకటి పోవుచున్నది. గుంటూరు, రేపల్లె
364