Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (సంస్కృతము)

1325 సంవత్సరముల మధ్యకాలమున వరంగల్లు నేలిన ప్రతాపరుద్రదేవుని ఆస్థాన పండితుడుగ నున్న వాడు. మాధవానల కామకందలా నామమున నొక గద్యకావ్యమున్నది. ఇందలి కథ కల్పితము. అనంతభట్ట రచితమయిన పంచోపాఖ్యాన సంగ్రహము, విష్ణుశర్మ పంచతంత్రమునకు సంగ్రహరూపమైయున్నది.

15 వ శతాబ్దారంభముననున్న వామనభట్టుచే నిర్మితమును, వీరనారాయణ చరితమను నామాంతరముచే శోభితమును అగు వేమభూపాలీయమను గద్యకృతి గణనార్హము. ఇందు అద్దంకి రాజధానిగా నేలిన ప్రోలయ వేమభూపాలుడు మున్నగు త్రిలింగ దేశాధిపతుల చరితము సంకీర్తిత మయినది. పెదకోమటి వేమభూపాలుడు (వీరనారాయణుడు) కొండవీటి రెడ్డిరాజు. ఇతడు క్రీ. శ. 1403 -1420 సం. రముల నడిమి కాలమున కొండవీటిని పాలించెను. వామనభట్టు అభినవబాణుడను బిరుదము ధరించెను. బాణుని అనంతరము ఆతనివలె సరస గద్య రచన మొనర్చు కవి ఎవ్వడును లేడని లోకమున స్థిరపడి యున్న అపకీర్తిని తొలగింపగల వాడనని ఆత్మప్రశంస నొనర్చుకొనుచు, 'బాణకవీంద్రా దన్యే కాణాః ఖలు సరస గద్యసరణీషు, ఇతిజగతి రూఢమయశోవామన బాణోప మార్ష్టి వత్సకులః' అను శ్లోకమున ఇతడు సగర్వముగ వాక్రుచ్చి యున్నాడు. చరిత్ర గ్రంథములలో ఉత్తమమైన ఈ గద్యకావ్యమున, కవి, వేమభూపాలుని దిగ్విజయ యాత్రావర్ణనములను సమర్థమును, మధురమును, సాలంకృతమునైన గద్యగుంఫముచే నొనర్చి, తన వర్ణన సామర్థ్యమును ఆవిష్కరించి యున్నాడు.

రాజవిజయసూరి శిష్యుడైన దేవవిజయగనియను నతడు క్రీ. శ. 1596 వ సంవత్సరమున 'రామచరిత'మను గద్య కావ్యమును శ్రీ మాలపురమువద్ద వ్రాసెను. ఇందు ఈ కవి, హేమచంద్రుని రామాయణము ననుసరించెను. చెంగల్పట్టుజిల్లా చిన్నంపట్టులో, 1809 వ సంవత్సరమున జన్మించినవాడును, తిరుమలాచార్యుడను నామాంతర విలసితుడును అగు శ్రీశైల దీక్షితుడు రచించిన శ్రీకృష్ణాభ్యుదయమను గద్యకావ్యము, రమ్యవచన రచనోప శోభితమై, సంస్కృతవచన వాఙ్మయమున కలంకార మనదగినది. ఇందు రెండుభాగములున్నవి. ఈ కావ్యమున శ్రీకృష్ణుని చరితము భక్త్యావేశముతో సమగ్రముగ వర్ణింపబడినది.

అర్వాచీన గద్యరచనలు పెక్కులున్నవి. బంకించంద్రుని ‘లావణ్యమయి', 'కపాలకుండల' అను నవలలకు అనువాదములును, కళాపూర్ణోదయ సంస్కృతీకరణమును పేర్కొనదగినవి.

'మంజుల భాషిణి', 'ఉద్యానపత్రిక', 'సహృదయ', 'సంస్కృతము' వంటి సంస్కృత పత్రికలందు ప్రచురింప బడిన వ్యాసములు సులభమును, లలితమును, బహుజనోప యోగకరము నగు సంస్కృత గద్యరచనకు మార్గదర్శకము లైనవి. 'సహృదయ' యందు ప్రకాశితము లయిన మదాలసాచరితాది సంస్కృత కథానికలు మంజుల సులభ గద్య సుశోభితములు.

'లాంబ్స్ టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్' అనుదాని పద్ధతి ననుసరించి మహాలింగశాస్త్రి వ్రాసిన భాసనాటక కథా సంగ్రహము, తదితర సంగ్రహములు పేర్కొనదగినవి.

శ్రీమల్లాది సూర్యనారాయణశాస్త్రి విరచిత సంస్కృత కవి జీవితములు, పండిత ద్విజేంద్రనాథశాస్త్రిచే రచితమైన సంస్కృతసాహిత్య విమర్శము - ఇత్యాది సంస్కృత సారస్వత విమర్శాత్మక గ్రంథములు అల్పసంఖ్యాక ములు లభించుచున్నవి.

సంస్కృత గద్యవాఙ్మయ స్వరూపము గద్యమయ కావ్యములందు కంటె, భాష్య- వ్యాఖ్యానగ్రంథములందు మిక్కిలి విపులముగ కనిపించుచున్నది. వేద - శాస్త్ర - స్మృతి - సూత్ర - పురాణాదులకు సరస - సరళ - సంపూర్ణ - సంస్కృత వ్యాఖ్యలను సంతరించి, సంస్కృత గద్యమును సుసంపన్న మొనర్చిన ప్రాచీన పండితప్రకాండు లనేకు లున్నారు. సంస్కృత వ్యాఖ్యానములు వెలయించిన వారిలో ఆంధ్రపండితులు పెక్కురు కలరు. సాయణాచార్యుని వేదభాష్యములు జగద్విదితములు. మహామహోపాధ్యాయ మల్లినాథసూరి (క్రీ. శ. 1400 - 1414) వ్యాఖ్యాతృ చక్రవర్తిగా అజరామరమయిన కీర్తిచే వలయితు డై నాడు. “అన్వయముఖముననే సర్వమును వ్యాఖ్యానించెదను. అమూలములును, అన పేక్షితములు నైన అంశములను వ్రాయను.” (ఇహాన్వయ ముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా । నామూలం లిఖ్యతే

301