Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

కించిన్నానపేక్షిత ముచ్యతే) అనునది ఈ మహాపండితుని ప్రతిజ్ఞ. ఇతడు కాళిదాసత్రయమునకు 'సంజీవినీ' వ్యాఖ్యను, కిరాతార్జునీయమునకు 'ఘంటాపథ' వ్యాఖ్యను, మాఘమునకు సర్వంకష వ్యాఖ్యను, భట్టి కావ్యమునకు సర్వపథీన వ్యాఖ్యను, శ్రీహర్షుని నైషధమునకు జీవాతు సమాఖ్యాన వ్యాఖ్యను, ఏకావళీ వ్యాఖ్యను వ్రాసి వాసిగాంచెను. మల్లి నాథసూరి సరస వ్యాఖ్యాన సరణికి ఉదా :

హేత్వేతి-

తస్మిన్ క్రీడాశైలే కైలాసే 'కైలాసః కనకాద్రిశ్చ మందరో గంధమాదనః, క్రీడార్థం నిర్మితాః శంభోర్దేవైః క్రీడాదయో౽భవన్.' ఇతి శంభురహస్యే. శంభునా శివేన భుజగఏవ వలయః కంకణం, తంహిత్వా గౌర్యా భీరుత్వా త్త్యక్త్వా దత్తహస్తా దత్తహస్తావలంబనాసతీ. గౌరీ, పాదచారేణ, విహరేత్ విచరేత్, యది తర్హి, అగ్రయాయీ పురోగతః, తథాస్తంభితః ఘనీభావం ప్రాపితః, అంతర్జలస్య ఓఘః ప్రవాహో, యస్య స తథాభూతస్సన్, భంగీనాం పర్వణాం భక్త్యా రచనయా, విరచితవపుః కల్పిత శరీరః సన్‌మణీనాం తటం మణితటం తస్యారోహణాయ సోపానత్వం కురు సోపాన భావంభజ'.

(మేఘసం. ప్రథమసర్గము -శ్లో. 64 )

సర్వజ్ఞ సింగభూపాలుడు (క్రీ. శ. 1420) సంగీత సుధాకరమను సంగీత రత్నాకర వ్యాఖ్యను రచించెను. మల్లి నాథుని కుమారుడు కుమారస్వామి సోమపీథి (1439) ప్రతాపరుద్ర యశోభూషణమునకు 'రత్నాపణ' వ్యాఖ్యను, సర్వజ్ఞ చక్రవర్తి పెదకోమటి మేమారెడ్డి (1420) సప్తశతీసార వ్యాఖ్యను, శృంగారామరుక వ్యాఖ్యను, రచించిరి. కాటయవేముడు (1415) కాళిదాస మహాకవి నాటకత్రయమునకు కుమారగిరి రాజీయ వ్యాఖ్యను వ్రాసెను. క్రీ. శ. 16 వ శతాబ్ది మధ్యకాలమున నున్నవాడును గరికపాట్యుపనామకుడునైన అన్నంభట్టు ఉద్దండ పండితుడై వరలెను. తర్కశాస్త్రమున, స్వరచిత తర్క సంగ్రహమునకు దీపికయను మహోజ్జ్వలమయిన వ్యాఖ్యను, జయదేవుని ఆలోకమను తత్త్వ చింతామణికి ఆలోకసిద్ధాంజనమను వ్యాఖ్యను రఘునాథ శిరోమణికృత 'దీధితి'కి సుబుద్ధి మనోహరమను వ్యాఖ్యను; మీమాంసా శాస్త్రమున భట్ట సోమనాథుని రాణకమునకు రాణకోజ్జీవిని అనుటీకను, తంత్రవార్తి కటీకను; వేదాంతశాస్త్రమున, బ్రహ్మసూత్రములపై మితాక్షర అను వృత్తిని; వ్యాకరణశాస్త్రమున, పాణిని అష్టాధ్యాయిపై వ్యాకరణ మితాక్షర అను సులభమయిన వ్యాఖ్యను; కైయటుని ప్రదీపముపై భాష్య ప్రదీపోద్యోతనమను వ్యాఖ్యను; వేదముపై స్వర లక్షణమను గ్రంథమును నిర్మించి, అన్నంభట్టు విఖ్యాతుడయ్యెను. వ్యాఖ్యాతగా అన్నంభట్టునకుగల స్థాన మత్యున్నతము. 'తర్క సంగ్రహదీపిక' అతని ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయి. 'టీకాం శిశుహితాం కుర్వే తర్క సంగ్రహ దీపికాం' అని అన్నంభట్టు గ్రంథాది యందు చెప్పియున్నను, ఆతని తర్క సంగ్రహ దీపికయను టీక అత్యంత ప్రౌఢముగను, పండితైక వేద్యముగను అలరారుచున్నది. ఉదా :

నిధాయేతి-

“నను మంగళస్య సమాప్తి సాధనత్వం నాస్తి మంగళే కృతే౽పి కిరణా వళ్యాదౌ సమాప్త్య దర్శనా న్మంగళా భావే౽పి కాదం బర్యాదౌ సమాప్తి దర్శనా చ్చాన్వయ వ్యతిరేకాభ్యాం వ్యభిచారాది తిచేన్న, కిరణావ ళ్యాదౌ విఘ్న బాహుళ్యా త్సమాప్త్య భావః । కాదంబర్యాదౌ గ్రంథా దృహిరేవ మంగళం కృతమతో నవ్యభిచారః నను, మంగళస్య కర్తవ్యత్వే కిం ప్రమాణ మితిచేన్న. శిష్టాచారానుమిత శ్రుతేరేవ ప్రమాణత్వాత్ । తథాహి । మంగళం వేదబోధిత కర్తవ్యతాకం । అలౌకికా౽విగీత శిష్టాచార విషయత్వాత్ । ధర్మాదివత్ । భోజనాదౌ వ్యభిచార వారణాయా లౌకితేతి । రాత్రిశ్రాద్ధాదౌవ్యభిచార వారణాయా విగీతేతి. శిష్టపదం స్పష్టార్థం । నకుర్యా న్నిష్ఫలం కర్మేతి జలతాడనా దేరపి నిషిద్ధత్వాత్ । తర్క్యంతే ప్రతిపాద్యంత ఇతి తర్కాః ద్రవ్యాది పదార్థా స్తేషాం సంగ్రహ స్సంక్షే పేణ స్వరూప కథనం క్రియత ఇత్యర్థః.

(తర్కసంగ్రహ టీక)

గద్య భేదములు :

ముక్తకము, వృత్తగంధి, ఉత్కళికాప్రాయము, చూర్ణిక, స్తవము అనునవి - అప్రధానములయిన గద్య భేదములు, ఛందోమంజరి యందు గద్యము మూడు రీతులుగా విభజింపబడినది. అవి (1) వృత్తకము (2) ఉత్క

302