Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 255 గణిత భూగోళము

మానముగల (large scale) పటములతో అనుకూల మైన నిట్రపు అంతరముల (Vertical intervals) తో గీయబడును. అంతరము తక్కువగుచో ఎక్కువ వివరములను చూపవచ్చును. అంతరము ఎక్కువగుచో, సాధారణ లక్షణములు మాత్రమే వ్రాయబడును. దగ్గర దగ్గరగా నుండు నిమ్నోన్నత రేఖలు (contours) నిట్రనిలువగు పాతమును (steep gradient) చూపును. ఎక్కువ దూరముగా నుండు రేఖలు క్రమమైన ఏటవాలును తెలుపును. అత్యౌన్నత్యములను చూపు నిమ్నోన్నత రేఖలు అదేవరుసలో తక్కువ ఎత్తులను చూపు నిమ్నో న్నత రేఖలకంటే చాల దగ్గరగా నున్నచో, అట్టి ఏట వాలు (slope) నతోదరమై (concave) యుండును. అట్లుకాక ఆ రేఖలు దీనికి వ్యతి రేకముగానున్నచో, వాలు ఉన్నతోదరమై (convex) ఉండును. క్రమరహితమగు (irregular) వాలులను తెలుపు నిమ్నోన్నత రేఖలు విషమమైన (irregular) దూరములలో నుండును.

నైసర్గిక స్వరూపమునందలి విచ్ఛిత్తులు (Breaks of topography) ఆ దిశలలోని మార్పులవద్దనుండు నిమ్నోన్నత రేఖల మీదుగా గీయబడు సరళ రేఖలచే చూపబడును. 'కిటిరో' విధానము (Kitiro Method) ననుసరించి గీయబడు నిమ్నోన్నత రేఖల సాయమున ఉత్తమమగు భౌతిక పటములను గీయవచ్చును. ఏటవాలు యొక్క పోలిక నుబట్టి పరస్పర దృగ్గోచరత్వము (natu- ral visibility) ను నిర్ణయింపవచ్చును క్లుప్తముగా చెప్పవలయునన్నచో, నిమ్నోన్నత రేఖలు భూస్వరూపము యొక్క వివరముల నన్నిటిని చూపుచు సెక్షన్ డ్రాయింగు సందర్భమున దాని నిజస్వరూపమును తెలుపును. పట మును చదువునపుడు సహాయపడుట కొరకు నిమ్నోన్నత రేఖల మధ్య ఆకృతి రేఖలు సుమారుగా గీయబడును.

వివిక్త ప్రదేశముల యొక్క స్థలౌన్నత్యము (Spot height) బెంచి గుర్తులు (bench marks), త్రికోణమితికి చెందిన ఔన్నత్యములు—ఈ మూడును భౌతిక నిర్మా ణమునకు చెందిన స్వల్ప లక్షణములను గుర్తించుటకు మిక్కిలి ఉపయోగించును.

భౌతిక పటముల (Relief maps) లో వ్రాయబడు “హెచూర్సు" అనబడు చిన్న సమాంతర రేఖలు ఏట

వాలు యొక్క దిశను సూచించును. నిట్రనిలువగు వాలులను చూపు సమాంతర రేఖలు దట్టముగను, దగ్గర గను ఉండును. క్రమమైన ఏటవాలును చూపుటకు అవి సన్నముగను, ఎడముగను వ్రాయబడి యుండును. కాని ఒక్కొక్క ఘనాంగుళములో చూపబడు 'హెచూర్ల' యొక్క సంఖ్య అన్ని విధములగు ఏట వాలులకును సమీపముగ నే యుండును. నిమ్నోన్నత రేఖలు 'హెచూర్లు', స్థలౌన్నత్య దర్శక రేఖలు (Spot heights) అను అంశములు అనేక భౌతిక వివరములను తెలుపును.

వాతావరణోషము (Atmospheric heat) : సూర్యోత్పన్న మైన శక్తిలో (Sular output) 1,000,000,000 కంటె తక్కువ భాగమును భూమి అడ్డగించును. సూర్యుని నుండి అత్యల్పమగు తరంగముల (1.000 నుండి ror,000 అంగుళముల పొడవు గలవి) రూపమున సెకండు నకు 1,86,000 మైళ్ళ వేగముతో ప్రసరించు వికిరణశక్తి సౌర వికిరణము (Solar Radiation) అనబడును. భూమిమీద ఒక స్థానమందు సంక్రమించు వికిరణముయొక పరిమితి కిరణములయొక్క ఏటవాలు పైనను, దిన దైర్ఘ్యము (duration of the day) పైనను ఆధార పడి యుండును.

సామాన్య పరిస్థితులలో ఔన్నత్యము హెచ్చినకొలది ఉష్ణోగ్రత తగ్గుచుండును. తగ్గుదల యొక్క క్రమము (rate) రోజుయొక్క వేళ నుబట్టియు, ఋతువునుబట్టి యు స్థానమును బట్టియు మారుచుండును. ప్రతి 1000 అడు గుల ఔన్నత్యమునకు సగటు తగ్గుదల 3.3°ఫారన్ హీటు ఆకాశ నిరక్షరేఖ యొద్ద సుమారు 10 మైళ్ళ ఎత్తు పైన, 45-50° అక్షాంశ రేఖలమీద 6 మైళ్ళ ఎత్తుపైన, ధ్రువములవద్ద 4 మైళ్ల ఎత్తుపైన ఉష్ణోగ్రతలోని సాధా రణమైన తగ్గుదల అకస్మాత్తుగా ఆగిపోవును. ములో మరొక 12 మైళ్లవరకు ఉష్ణపరిస్థితులు స్థిరముగా నుండును. దీనిని సమతాపమండలము (stratosphere) అని అందురు. దీర్ఘములును, నిర్మలములును, నిశ్చల ములును, చల్ల నినియునగు కొన్ని శీత కాలపు రాత్రులందు భూమియంతయు మంచుచే కప్పబడి యున్నప్పుడు సాధా రణ పరిస్థితి విపరీతమయి, ఉష్ణోగ్రతలో విలోమ పరిస్థితు లేర్పడును. సముద్రమట్టమునకు సమముగా తగ్గిపోవుచు