Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణిత భూగోళము సంగ్రహ ఆంధ్ర మును బట్టిగాని గీయబడు ఒక సరళరేఖను తెలుపును. భూమిమీద నుండు వాస్తవమైన గొప్ప దూరములను, కొలది దూరములను తెలుపుటకై ఆ సరళ రేఖ తగినన్ని ప్రధానాంశములు (Primaries) గను, అప్రధానాంశములు (Secondaries) గను విభజింపబడును. కర్ణమాప కము (diagonal), అప్రధానాంశముయొక్క అత్యల్ప తర విభాగములను గూడ తెలుపును. (చూడుము 4 B పటములో △ ABC).

     ఒక పటముయొక్క కొలమానమును సంకోచ పరచు నపుడుగాని, విస్తృత మొనరించునపుడుగాని, ఉదా. A ను పొందవలెనన్న, మూల (Original) కొలమానము యొక్క భిన్నమును క్రొత్త కొలమానముయొక్క భిన్నాంశముచే విభజింపవలెను. పిదప మూలపటమును తగినన్ని సమ చతురస్రములు (Squares)గా విభజింప వలెను. సంకోచ పరచునపుడు నిజపటముయొక్క భుజముగాగల సదృశమగు (similar) సమ చతురస్రము లను ఏర్పరచుచు క్రొత్త ఆకారరేఖ (outline) ను తయారు చేయవలెను, కొలమానమును విస్తృత మొనర్చు నపుడు క్రొత్త ఆకారరేఖ (outline) యొక్క పార్శ్వములను మూల పటముయొక్క పార్శ్వములకు A రెట్లు ఉండు విధమున చూడవలెను. క్రొత్త పటముల యొక్క అల్లిక (hetwork) లోని చతురస్రములందు మూల పటముయొక్క వివరములను ఉల్లేఖింపవచ్చును. -పెంటో గ్రాఫ్ కనిపెట్టబడిన తర్వాత విస్తృతీకరణము గాని, సూక్ష్మీకరణముగాని యాంత్రికముగా చాల త్వరగా జరుగుచున్నది.
    కొలతలనుబట్టి పటమును తయారుచేయుట సర్వేయింగ్ (భూమి కొలత) అని అనబడును. గొలుసు (chain), సమతలముగల టేబిల్, ప్రిస్మాటిక్ కాంపస్ (Prismatic compass), క్లినో మీటర్(Clinometre) లేక థియోడొలైటు (theodolite) అనునవి భూమి కొల తకు ఉపయోగించు పరికరములు.
    నై సర్గిక స్వరూప నిరూపణము (Relief Representation) :నై సర్గిక స్వరూపములు (physical features) పటములందు ఈ క్రింది విధముగా చూపబడును.

(1) త్వరగా కావలసిన మిలిటరీ, సివిల్ సర్వేలలో ఆకాశమునుండి ఛాయాపటమును (aireal photography) తీసికొనుట ముఖ్యము. క్షితిజ సమాంతర దిశలలో సులభముగా పరిశీలింపబడజాలని విషయములను అధోలోహిత కిరణములు (Infra red) ఛాయా చిత్రముతో విశదము చేయవచ్చును. ఛాయాచిత్రములను తీసికొనునపుడు కేమెరా యొక్క స్థానమును నాభ్యంతరము (Focal length) యొక్క విలువను గుర్తించవలెను. ఫిల్మును నిలువుగా గాని, తగినంత ఏటవాలుగా గాని ఉంచవలెను. బాగుగా కనిపించు వస్తువులమధ్య నుండు కోణములను థియొడొలైటుతో గాని, రెండు కాంపస్ బేరింగులతో గాని కొలువవలెను. ఈ పనిచేయునపుడు వస్తువులనుండి వచ్చు ఏకాంతికిరణములచే కెమేరాలోని ఫిల్ము మార్పుచెందునో ఆ కిరణములనే ఉపయోగించ వలెను. ఈ విధముగా ప్రింటు (Print) లోని రెండు ప్రదేశముల మధ్యగల దూరములు వాటి కోణ దూరము లగును. రేఖాపట నిర్మాణము (Graphic construction)ల వలన వాటిని సులభముగా కనిపెట్టవచ్చును. కెమేరా (Camera) సరియగు మట్టములో నున్నచో, ప్రింటులో సగము పైగా నున్న ఒక క్షితిజ సమాంతర రేఖ క్షితిజ సమతలమును తెలుపును. ఈ విషయమును దృష్టి యందుంచుకొనినచో ఒక ప్రదేశముయొక్క ఎత్తునకును, దాని దూరమునకును గల నిష్పత్తి (Ratio) మట్టపు రేఖ (level line) నుండి ఆ ప్రదేశమునకు గల దూరము నకును, కెమేరా యొక్క నాభ్యంతరమునకును గల నిష్పత్తికి సమానముగా నుండును. ఆ ప్రదేశమునుండి మట్టపు రేఖకు గల దూరమును కొలువవచ్చును. నిర్ణీత (selected) స్థానముయొక్క ఎత్తును సుమారుగా తెలిసి కొనవచ్చును. పట లేఖనములో ఫోటో గ్రాఫులను ఉపయోగించునపుడు ఖండన పద్ధతులను (Methods of inter- sections), 5 (perspective grids) ఉపయోగించవలెనని సూచింపబడెను. (2) నిమ్నోన్నత రేఖావిధానము (contouring) ను అనుసరించి నిస్సంశయముగా అత్యుత్తమమగు భౌతిక పటములను గీయవచ్చును. నిమ్నోన్నతరేఖ (contour) అనగా సముద్రమట్టముపై ఒకే ఎత్తులో నుండు ప్రదేశ ములను అన్నిటిని కలుపు రేఖ. ఈ రేఖలు పెద్ద కొల

254