Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3

ఇట్లు కాంతి వక్రీభవనము వలన దిన ప్రమాణము హెచ్చు చున్నది M. N ల మధ్యగల కోణమును కాలములోనికి మార్చినచో అది సందెవెలుగు (twilight) యొక్క పరిమితిని తెలుపును. 3వ పటములోని M. N బిందు వులను దాటుకు బృహద్వృత్తము (Great circle) సూర్యునిగుండా కూడ పోవునపుడు సందె వెలుగుయొక్క పరిమితి అత్యల్పముగా నుండును. సూర్యుడు అత్యధిక మగు ఉత్తర దిక్పతనము (declination) ను పొందె ననుకొన్నచో _CH =23,°; HK=18°; KB == 481° ఉండును. ఇట్టి పరిస్థితిలో 481° ఉత్తర అక్షాంశము మీద నుండు స్థానములు కొలది దినములపాటు 24 గంటలు చీకటి పూర్తిగా సందె వెలుగులో నుండును. పూర్తి ఏర్పడదు. దానికి దగ్గరలో దక్షిణముగా నుండు ప్రదే శములందు హ్రస్వములగు దైనిక అంధకారాంతములు (short diurnal intervals of darkness) ca ధ్రువముచుట్టు J D వెంబడి 51° అనగా GD-GJ లేక 23]° - 18° మధ్య నిండుచీకటి యుండును. సూర్యుడు 9° దక్షిణ దిక్పాతము నొందినపుడు ఉత్తర ధ్రువము, సందె వెలుగు ఉండు మండలము యొక్క మధ్య భాగ మున ఉండిపోవును. ఈ పరిస్థితిలో ఉత్తర ధ్రువమునకు చుట్టు 9° వరకు ఉండు ప్రదేశములన్నియు సందె వెలుగులో నిరంతరము తిరుగుచుండును. అచట నిండు చీకటిగాని, స్పష్టమగు పగటి వెలుతురుగాని ఏర్పడనే ఏర్పడదు. నిజమునకు ధ్రువములో సంవత్సరమున 24 నెలలు మాత్రమే నిండు చీకటి యుండును. సూర్యుడు కర్కట మకర రేఖలమీద ఉండునపుడు నిరక్ష రేఖయొద్ద 1 గం. 18 నిమిషముల పరిమితిగల అత్యంత దీర్ఘకాలిక మైన (longest) సందె వెలుగు సంభవించును. విషువత్తు (Equinox) లో 1 గం. 12 ని. పరిమితిగల అత్యల్ప కాలిక (Shortest) మగు సందె వెలుగు ఉండును.

పట నిర్మాణము - కొలమానము : (Cartography Scales): ఏదేని పటమును వ్రాయవలెనన్నచో ఒక కొలమానమును గ్రహించవలెను. ఆ పరిమాణము పటము మీద నుండు దూరములకును, భూమిమీదనుండు దూరములకును మధ్యగల సంబంధము (Ratio) ను తెలుపును. క్షితిజ సమాంతరముగా నుండు కొలమానములు -గణిత భూగోళము (Scales) భూమి పొడుగుననుండు దూరములను, నిలువుగానుండు కొలమానము (Vertical Scales) సముద్ర మట్టము పైగల ఎత్తులను తెలుపును. ఏ పటము నందై నను కొలమానము అన్ని ప్రదేశములందు, అన్ని దిశలందు కచ్చితముగా నుండదు. కొన్ని విక్షేపముల (Projections) మీద ఒక భాగములో కచ్చితముగా నుండు పటములు ఇతర భాగములో కచ్చితముగా నుండవు. కొలమానము (scales) పట లేఖనము యొక్క ఉద్దేశము ననుసరించి నిర్ణయింపబడవలెను. అట్లాసు (Atlas) పటములు సాధారణముగా చిన్న కొలమానములతో వ్రాయబడును. కాని నగర పటములు ఎప్పు డును పెద్ద కొలమానములతో వ్రాయబడును. చిన్న కొలమానములతో వ్రాయబడిన గొప్ప విస్తీర్ణముల యొక్క పటములు పెద్ద కొలపరిమాణములతో వ్రాయ బడిన చిన్న అట్లాసులకంటే ఎక్కువ వ్యత్యాసములు గలిగియుండును. కొలమానములు ఈ క్రింద చూపబడినట్లు మూడు విధములుగా సూచింపబడినవి : (1) 1"= 1 మైలు అను సరళమైన (direct) విధానము. దీనిలో పటము నందలి ఒక అంగుళము, భూమిమీద ఒక మైలు దూర మును చూపును. (2) ప్రత్యామ్నాయ అంశమును (fraction) 1oor గా తెలుపుట. ఈ విధానమందు పటములోని ప్రతి ప్రామాణికాంశము (unit) భూమి మీద అట్టి 1000 ప్రామాణికాంశములను తెలుపుచుం ఈ ప్రతిప్రత్యామ్నాయాంశము (represen- ఈ tative fraction) ను ప్రతిపాదనము (statement) గను, ప్రతిపాదనమును ప్రత్యామ్నాయాంశముగను మార్చవచ్చును. (8) సాదాకాలమానము (పటము 4-A) ఇది ప్రతిపాదనమును బట్టిగాని, ప్రత్యామ్నాయాంశ

చిత్రము - 87 ." = గజము ప్రత్నామ్నాయాంశము 36 3 గజములు 3 గజములు పటము - 4.