Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణీత భూగోళము 256 సంగ్రహ ఆంధ్ర


ఒ కే ఉష్ణోగ్రతను కలిగియుండు ప్రదేశములను కలుపు రేఖ లను సమోష్ణ రేఖలు (Isotherms) అని అందురు. భూ భాగము, జలభాగము ఒకదాని వెంబడి యొకటి ఏకాంత రితముగా వ్యాపించియుండుటను బట్టియు, వాటియొక్క ఉష్ణకరణ, శీతకరణ ధర్మములలోని భేదములనుబట్టి యు, సమోష్ణ రేఖలు ముఖ్యముగా క్రింది వాతావరణములో సమాంతరముగ నుండునని మన మూహింపజాలము.

వాతావరణ పీడనము : ఎత్తునకు పోయినకొలది గాలి యొక్క పీడనము తగ్గుచుండును. సముద్రమట్టమునకు కొలది వేల అడుగుల ఎత్తువరకు పీడనముయొక్క హాస క్రమము (Rate reduction) ప్రతి 900-1000 అడు గులకు 1" లేక 34 మిల్లి వారులు చొప్పున ఉండును. మిక్కిలి ఎత్తునకు పోయిన కొలది, గాలి అధికముగా తేలికయగుచు పోవును. 18,000 అడుగుల ఎత్తున పరిశీలించినచో వాతావరణము యొక్క పీడనము సముద్రమట్టమున నున్న పీడనములో సగమగును. తరు వాత మరొక 18,000 అడుగుల ఎత్తునకు పోయినచో మిగిలిన పీడనము మరల సగమగును. ఇట్లు ప్రతి 18.000 అడుగుల ఎత్తునకు వాయుపీడనము సగము వంతున తగ్గుచుండును. పీడనముయొక్క క్షితిజ సమాంతర వ్యాప్తి (horizontal distribution) ఉష్ణోగ్రతారూప మైన ట్టియు, చలన రూపమైనట్టియు (dynamic) ప్రభావ మును కలిగియున్నది. ఈ విషయము పటములందు సమభార రేఖ (Isobars) లచే చూపబడును. సమభార రేఖ లనగా సముద్రమట్టపు సమపీడనమునకు తగ్గిపోవుచు ఒకే వాయుపీడనముగల ప్రదేశములనన్నిటిని కలుపు రేఖలు. సమభార రేఖలకు సమకోణము (Right angle) లో కొలువబడు పీడనముయొక్క ప్రాసక్రమము భారమితిపాతము (Barometic gradient) అనబడును. నావికా పరిమాణపు మైళ్ళలో (nautical miles) 1or అంగుళపు తగ్గుదల భారమితి పాతము యొక్క ప్రమాణ మగును. పీడనము ఒకే పరిమాణములో హెచ్చునట్టిగాని, తగ్గునట్టిగాని ప్రదేశములను కలుపు రేఖలు ఐసలో బార్స్ (Isallobars) అనబడును.

విక్షేపములు (Projections) : గోళముమీద నుండు అక్షాంశ రేఖలను, రేఖాంశవృత్తములను, పట లేఖనము కొరకు సమతలముమీదికి మార్చు విధానములను విశే పములు (Projections) అందురు. చిత్ర దృశ్యము యొక్క పట నిర్మాణమందలి వి క్షేపములు ఒక కాంతి జనక బిందువు (point) సహాయమున ఛాయల నేర్పర చును. అట్లుకాని విక్షేపములు రేఖాగణిత నిర్మాణము లను కల్పించును. నిజమగు వైశాల్యములు విశేపములు తుల్యపరిమాణ లేఖనము (Homolographic) అనబడును. కచ్చితమైన ఆకారములను తెలుపు ఇతర విశేపములను సువి డే పలేఖనము (Orthomorphy) అని అందురు. వి శేపములు నాలుగు రకములుగానుండును. (1) స్తూపా కారములు (Cylindrical); (2) శంకువు ఆకారములు (Conical); (8) ఖస్వస్తికాకృతులు (Zenithal); (4) సంప్రదాయ సిద్ధములు (Conventional).

(1) స్తూపాకార విశేపములు (Cylindrical Projections) : ఈ రకపు విక్షేపములు నిరక్షరేఖా ప్రాంతముల పట లేఖనమందు గాని, ఉత్తర దక్షిణములకు అధిక ముగా వ్యాపించియుండు సన్నని మాభాగముల పట లేఖనమందుగాని ఉపయోగించబడును. సాధారణమగు స్తూపాకారపు వల (అల్లిక = net) యందు నిరడ రేఖయు, యామ్యోత్తర రేఖలన్నియు లేఖల పరిమాణము (scale) ననుసరించి గీయబడును. అక్షాంశ రేఖల మధ్యనుండు దూరములు కచ్చితముగా గీయబడును. కాని యామ్యో త్తర రేఖల మధ్యనుండు దూరములు ధ్రువముల వైపుకు పోవుకొలది హెచ్చుచుండును. నిరక్షరేఖనుండి దూరము పోయిన కొలది అక్షాంశ రేఖల మీది కొలమానము (scale) క్రమముగా హెచ్చుచుండును.

తుల్య పరిమాణ రేఖాత్మకమగు స్తూపాకారపు అల్లిక (Homolographic cylindrical net పటము 6 ఎ) యందు 30° అంతరముగా గీయబడు అక్షాంశ రేఖలు, రేఖాంశ వృత్తములు- అన్నియు ఒకదాని కొకటి సమ కోణములో (లంబముగా నుండు సరళరేఖలచే చూప బడును. అక్షాంశ రేఖలన్నియు సమముగా నుండి సామాన్య స్తూపాకారపు విక్షేపములలో నుండు లోపములను కలిగియుండును. యామ్యోత్తర రేఖలన్నియు సమముగా నుండి, నిరక్ష రేఖమీద సరియగు దూరములలో గీయబడినను, కొలమానము (scale) ప్రకారముగా నుండవు.