Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంధకము

సంగ్రహ ఆంధ్ర

కము ఆమ్లజని (Oxygen ) తో కలసి గంధక ద్విగంధకత్రి ఆమ్లజనిద వాయువులుగా నేర్పడుచున్నది. మొదట 1774 సం.న ప్రీస్‌ట్లీ (Priestly) అను రసాయన శాస్త్రజ్ఞుడు గంధకద్వి ఆమ్లజనిద వాయువును తయారుచేసెను. గంధకము గాలిలో మండుటవలన ఈ వాయువు ఏర్పడుచున్నది. గంధకమును వేడిచేసినపుడు గాని, రాగి, ఇనుము, పాదరసము కార్బను మొదలగువాటిమీద ఉష్ణ గాఢ గంధకికామ్లము (Hot Concentrated Sulphuric acid) పడి ప్రతిక్రియ జరుగుటవలన గాని, గంధకద్విఆమ్లజనిదము తయారగును. ఈ వాయువు రంగులేని ఘాటైన పదార్థము. ఇది నీటిలో కరిగినపుడు ఏర్పడు ఆమ్లమును గంధక సామ్లము (Sulphurous acid) అందురు. గంధకద్విఆమ్లజనిదము ముఖ్యముగా గంధకికామ్లము తయారుచేయుటయందు ఉపయోగపడుచున్నది. ఈ వాయువును రంగులు పోగొట్టుటకు కూడ వాడుదురు దీనిని ఎక్కువగ పీల్చిన హాని కలుగును.

గంధకత్రిఆమ్ల జనిదము (Sulphur Trioxide) : ఇది గంధక రసాయన శాస్త్రములో (Chemistry of Sulphur) ముఖ్యమైనది. ప్లాటినము (Platinum) మీదుగా వేడి గంధకద్వి ఆమ్లజనిదము, ఆమ్లజని మిశ్రమమును పంపినపుడు గంధకత్రి ఆమ్లజని వాయువు ఏర్పడును. ఇది రంగులేని వాయువు. ఇది చల్లారినపుడు ఘనీభవించును. ఈవాయువు నీటిలో కరగినపుడు ఏర్పడు ఆమ్లమే గంధకికామ్లము . గంధకికామ్లము తయారుచేయు పద్ధతులలో నిదియొకటి.

గంధకికామ్లము (Sulphuric Acid): ఇది గంధక, సంయోగ పదార్థములలో చాలముఖ్యమైనది. గంధకికామ్లమును రెండువిధములుగ తయారుచేయుదురు. మొదటిది స్వాభావికముగ దొరకు సల్ఫేటులనుగాని, లేక తయారుచేసిన సల్ఫేటులనుగాని బాగుగా వేడిచేసి గంధకత్రి ఆమ్లజనిదముగ మార్చి పిమ్మట దానిని నీటిలో కలిపి గంధకికామ్లముగ తయారుచేయుట. ఇక రెండవది గంధకము మండించుటవలనగాని, గంధకిదములనుండి గాని గంధకద్వి ఆమ్లజనిదమును తయారుచేసి, ఆ వాయువును ఆమ్లజనితో ప్రతిక్రియ సలిపి గంధకత్రి అమ్లజనిదమును తయారుచేయుట. మొదటిపద్ధతి ఎక్కువ వాడుకలో లేదు. రెండవ పద్ధతివలన తయారగు గంధకికామ్లము ఎక్కువ పరిశుభ్రముగా నుండుటే దీని వాడుకకు కారణము.

రెండవపద్ధతిలో గంధకద్వి ఆమ్లజనిదము తయారు చేయుటలో రెండువిధములు కలవు. మొదటిదానిని 'ఛేంబర్' (Chamber) పద్ధతి అనియు, రెండవదానిని 'కాంటాక్టు' పద్ధతి అనియు అందురు.

'ఛేంబర్' పద్ధతిలో తయారగు ఆమ్లములో నూటికి 80 పాళ్లు ఎరువుల పరిశ్రమలో వాడబడుచున్నది. ఇందు గంధకద్వి ఆమ్లజనిదము, ఆమ్లజని, నీరు ప్రతిక్రియ జరుపబడును. ఈ ప్రతిక్రియ పూర్తిగా కొనసాగుటకు కేటలిస్టు అవసరము. నత్రక ఆమ్లజనిదము (Nitric Oxide) ఇందుకై ఉపయోగింపబడుచున్నది. ఈ నత్రక ఆమ్లజనిదము, ఆమ్లజని వాహకముగా (Oxygen Carrier) పనిచేయును. నత్రజని, ఆమ్లజనిదము పైప్రతిక్రియలో ఆమ్లజనిని సరఫరా (Supply) చేయును. ప్రతిక్రియ అనంతరము నత్రజని తిరిగి ఆమ్లజనిని గ్రహించి, ఈ నత్రజని ఆమ్లజనిదముగానే ఉండును. ప్రతిక్రియారంభము నందును అంతమునందును ఈ కేటలిస్టు నత్రజని ఆమ్లజనిదముగానే ఉండును; మార్పేమియు ఉండదు. ప్రతిక్రియను చురుకుగాను, త్వరగాను జరుపుటయే దీనిపని. ఇదియే కేటలిస్టుపని. గంధకత్రి ఆమ్లజనిదమును, గదుల (chambers) లోపలికి ప్రవహింపచేసి, అందు నీటిజల్లుతో (Water spray) కలుపుదురు. అప్పుడు గంధకికామ్లము తయారగును. ఈ విధముగా నేర్పడు ఆమ్లము తగినంత గాఢముగానే యుండును. ఈ పద్ధతి 1746 వ సంవత్సరము నుండి వాడుకలోనికి వచ్చినది. కాంటాక్టు పద్ధతిలో తయారగు ఆమ్లము స్వచ్ఛమైన ఆమ్లము. ఈ పద్ధతిని ఫిలిప్స్ అను శాస్త్రజ్ఞుడు 1831 లో కనిపెట్టెను. ఇందు మొదట గంధకమును మండించి గంధకద్విఆమ్లజనిదమును తయారుచేయుదురు. ప్లాటినము (Platinum) మీదుగా, వేడి గంధకద్వి ఆమ్లజనిదమును, ఆమ్లజనిద మిశ్రమమును పంపినపుడు గంధకత్రి ఆమ్లజనిద మేర్పడును. ఇందులో ప్లాటినపు ఆక్సైడు కేటలిస్టుగా పనిచేయుచున్నది. గంధకత్రి ఆమ్లజనిదము నీటి బిందువులతో నెమ్మదిగా మిశ్రమ మొంది గంధకికామ్లము ఏర్పడును.

222