Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఖమ్మముజిల్లా 080 సంగ్రహ ఆంధ్ర


భాషలు : ఇచ్చటి ముఖ్యమైన భాష తెలుగు. తెలుగు భాష మాటాడువా రే అత్యధిక సంఖ్యాకులుగా నున్నారు. జిల్లా లెక్కలలో వివరించిన 30,711 మంది కోయజాతివారు ఈ జిల్లా నివాసులే. వరంగల్

విద్య : ఈ జిల్లా విద్యా విషయములో పురోగామిగా నున్నది. విద్యాబోధక సంస్థలు 689 కలవు. వివరము లిట్లున్నవి : 1. ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి 1 2. ఉన్నత పాఠశాలలు 25 3. మాధ్యమిక పాఠశాలలు 44 4. ప్రాథమిక పాఠశాలలు 573 5. బేసిక్ పాఠశాలలు 6. బేసిక్ ట్రెయినింగు 44 పాఠశాలలు 2 మొత్తము 689

వైద్యశాలలు : ఈ జిల్లా ప్రధానస్థానమగు ఖమ్మముపురములో సర్కారు వారి గొప్ప ఆసుపత్రి కలదు. ఇచ్చట మండల ఆరోగ్యశాఖ కలదు. సంచార వైద్య సహాయక నిర్మాణము కలదు. తగు పరికరములతో, ఔషధాదులతో ఒక డాక్టరు గ్రామములలోని జనులకు వైద్యసౌకర్యము కూర్చుచుండును. జిల్లాయంతటను 7 జనరల్ ఆసుపత్రులు 4 వైద్యశాలలు కలవు.

పట్టణములు : ఈ జిల్లాలో 6

ఈ 8 పట్టణ

ములు కలవు. వాటి వివరములు :

ఖమ్మముమెట్టు (లక్ష్మీనరసింహస్వామి), జమలాపురం గొప్పగా జాతరలు జరుగు పుణ్య క్షేత్రములు. ఈ జిల్లా లో నే గాక, ఆంధ్ర దేశములోనే గాక, భారతభూమిలో ప్రఖ్యాతి వహించిన మహా పవిత్ర క్షేత్రము భద్రాచలము. ఇది గోదావరీతీరమున నున్నది. భద్రాచలములోని సీతారామచంద్రుల దర్శనార్థము భారతదేశపు పలు ప్రాంతములనుండి భ క్తులు విచ్చేయుదురు. చిత్రము - 58 జన సంఖ్య 1. కొత్తగూడెము 50,195 2. ఖమ్మం మెట్టు 28,251 3. ఎల్లందు 13,929 4. కల్లూరు 5,094 4,835 3,758 5. మధిర 6. బూర్గుపహడు

పుణ్యక్షేత్రములు : కూడలి, లక్ష్మీ పురం, నేలకొండపల్లి, నాగులవంచ, పటము - 2 శ్రీ భ్రమరాంబా సహిత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయము (కోటగోడ దగ్గరనున్న పురాతన దేవాలయము) 204