Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పటము 3
కొండమీది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము
దుర్గము: ఖమ్మము పట్టణమునకు గల విశిష్టతలో ఇచ్చటి దుర్గ మొకటి. ఈ దుర్గము (ఖిల్లా) 300 అడు గుల యెత్తుగల యొక మహాప్రస్తరముమీద దీర్ఘ చతు రస్రాకారమున నిర్మితమయినది. కోటవైశాల్యము 1/16 చ. మైళ్లుండును. కోట ప్రాకారము ప్రచండమైన బండ రాళ్లతో నిర్మితమయినది. ఎడఎడముగా ఒక్కొక్కదిశ యందు రెండేసి, మూడేసి బురుజులు కలవు. వీటిపై ఫిరంగు లుండుచుండెను. ప్రాకారకుడ్యము 40 నుండి 80 అడుగుల యెత్తువరకు మారుచుండును. ప్రతి బురుజు యొక్క పై భాగము 14 అడుగులకుమించి వెడల్పుం డును. లోపలి భాగములో పైకి పోవుటకు మెట్లు కలవు. ఒక్కొక్క బురుజు మీద రెండేసి ఫిరంగులు కలవు. ఒకటి 6 అడుగుల పొడవుకలది. రెండవది 4 అడుగుల పొడవు కలిగియున్నది. ప్రక్కగా ఒక నీటికుండి యున్నది. యుద్ధ సమయములో ఈ కుండినిండ నీరు నింపి యుంచబడును.

ఈ కోటకు రెండు ప్రవేశద్వారములు కలవు. లోపలి సింహద్వారము 30 అడుగుల ఎత్తుగలిగి నలుచదరముగా ప్రచండ -శిలా స్తంభములతో నొప్పియున్నది. దీనికి సమీ పమున 6 అడుగుల పొడవుగల ఘనమయిన ఫిరంగి గలదు. కోటలో నొక భాగమున కొన్ని యిండ్లు గలవు, ఆ యిండ్లలో జనులు నివసించుచున్నారు. అయితే ఈ ప్రాంతమంతయు శిధిలావసలో నున్నది. ఈ కోటలో చక్కని మసీదు కలదు.ఒక నడబావి గూడ గలదు. ఈ బావి పొడవు 80 అడుగులు; వెడల్పు 20 అడుగులు. బావిలోనికి దిగుటకు విశాలమైన మెట్లు కలవు. ఒక మందుకొట్టుకూడ గలదు.ఈ బావి నుంచి స్థితిలో నిర్మల జలపూర్ణమైయున్నది.ఈ బావినీరే పురవాసులకు పానోదకముగా నుపకరించుచున్నది. శిఖరము చేరుటకు మార్గము కలదు. ఈ మార్గమున చిన్నచిన్న రాతిగోడలు గల ఆవరణములును, ప్రవేశ