Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖమ్మముజిల్లా

టన్నులబొగ్గు కలదని లెక్క వేయబడినది.

1955 లో తీసిన నేలబొగ్గు 9,98,316 టన్నులు. ముడి యినుము 90,678 టన్నులు; గ్రాఫైటు 100 టన్నులు; క్రోమైటు 70 టన్నులు; ఇసుక 136995 టన్నులు.

శీతోష్ణస్థితి : ఖమ్మముజిల్లా అధికోష్ణమునకు ప్రసిద్ధిచెంది యున్నది. ఇచ్చట ఉష్ణముయొక్క తీవ్రత 120 డిగ్రీలవరకు నుండును.

వర్షపాతము : ఈజిల్లాలోని వర్షపాతము సగటున 39 అంగుళములు.

వృత్తులు :

1. వ్యవసాయము జీవనాధారముగా గలవారు 5,96,600
2. వ్యాపారము జీవనాధారముగా గలవారు 26,398
3. ఉద్యోగములలో నున్న వారు 74,542
4. ఇతర ఉత్పత్తికర వృత్తులు 1,15,452
మొత్తము 8,12,992

భూమి వివరములు : ఈ జిల్లాయందలి భూమి వివరము లీ క్రింది విధముగా నున్నవి :

ఎకరములు
1. మొత్తము భౌగోళిక విస్తీర్ణము 37,36,521
2. అరణ్యప్రాంతము 15,18,873
3. సాగుకు పనికిరాని బంజరుభూమి 1,34,729
4. వ్యవసాయమునకు పనికివచ్చు పడావా భూమి 1,01,372
5. బీడుభూమి 83,852
6. సేద్యమగుచున్న భూమి 9,33,507
7. పంటభూమి 8,63,053
8. మాగాణిభూమి 1,05,550

ష. రా : 3, 4, 5, 7 సంఖ్యలలో భద్రాచలము, నూగూరు అంకెలు చేరలేదు.

ఈ జిల్లాలో వరి సేద్యమునకు నీటికొరత లేకుండ వైరా, పాలేరు, బేతుపల్లి, సింగభూపాలెం ప్రాజెక్టులు నిర్మితమైనవి :

ప్రాజెక్టు వైశాల్యము ఆయకట్టు
పాలేరుప్రాజెక్టు (ఖమ్మం తా.) ఆరగాణి 651 చ. మై. 17.000 ఎ.
వై రాప్రాజెక్టు (మధిర తా.) 19,000 ఎ.
బేతుపల్లి ప్రాజెక్టు (మధిర తా.) ఆరగాణి 102 చ. మై. 4800
సింగభూపాలెంప్రాజెక్టు (ఎల్లందు తా.) 1,700 ఎ.

ఇవికాక 1568 నీటివనరులు జిల్లాలో కలవు. 64, 974 ఎకరముల భూమి సాగు అగుచున్నది. ఈ ఆయకట్టుకాక 36,600 ఎకరములు వివిధములైన ప్రాజెక్టులక్రింద మాగాణి వ్యవసాయము సాగుచున్నది.

పంటలు : ఈ జిల్లాలో వరి, పచ్చజొన్నలు, సజ్జ, మొక్కజొన్న, కందులు, పెసలు, సెనగలు, ఉలవలు, వేరుసెనగ, పొగాకు ముఖ్యమయిన పంటలు. ఇచ్చటి భూమి సామాన్యముగా ఇసుకమయము. నేల ఎగుడు దిగుడుగా నుండును. అయినను సారవంతములగు సమతల భూములు కలవు. పాల్వంచ ప్రాంతమందలి నేల ఇసుకమయ మయినను, గోదావరీనది యొడ్డులయందలి భూమి డెల్టాభూములను పోలియుండును. ఎల్లందుప్రాంతముగూడ అట్టిదియే. ఖమ్మముమెట్టు, మథిర, ఎల్లందు, పాల్వంచ తాలూకాలలో రేగడిభూమి విస్తారముగా గలదు.

పశుసంపద : ఖమ్మముమెట్టు, మధిర ప్రాంతములలోని పశుజాతి మైసూరుజాతిని ఎక్కువగా పోలియుండును. ఉత్తమతరగతికి చెందినవై ఇవి గొప్ప రూపములో నుండును. ఇవి ఎక్కువ విలువగలవి. మధిరతాలూకాలోని ఎఱ్ఱనిచాయ, పెద్ద ఆకారము కల గొఱ్ఱెజాతి దేశములోని సామాన్యపు నల్లగొఱ్ఱెలతో భిన్నించియుండును. గుఱ్ఱములు అంత శ్రేష్ఠమైనవి కావు.

రవాణా : ఈ జిల్లాలో 420 మైళ్ల పొడవుగల రోడ్లు కలవు. అన్ని తాలూకాలయొక్క ప్రధానపట్టణములతో జిల్లా కేంద్రమునకు రోడ్ల సంబంధము కలదు. కాజీపేట - బెజవాడ రైలుమార్గము ఈ జిల్లాగుండ ఉత్తర దక్షిణముగా సుమారు 50 మైళ్లు పోవును. డోర్నకల్లునుండి సింగ రేణికి 17 మైళ్లును. డోర్నకల్లునుండి భద్రాచలమునకు 44 మైళ్లును గల రెండు శాఖామార్గములు గలవు. ఎల్లందు, ఖమ్మము, మధిర, భద్రాచలమురోడ్డు - ఈ నాలుగును జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషనులు.

203