Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖమ్మముజిల్లా

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 55

పటము - 1

గల్ తాలూకాలో ఉద్భవించి, మునేరుతో సమాంతరమున ప్రవహించుచు జగ్గయ్యపేటకు దక్షిణమున 7 మైళ్ల మీద కృష్ణలో పడును. కిన్నెరసాని నది పాకాల, ఎల్లందు, పాలవంచ తాలూకాలలో 55 మైళ్లు ప్రవహించి, భద్రాచలము వద్ద గోదావరిలో కలియును. వైరానది మునేరునకు ఉపనదిగా జల్పల్లి దగ్గరమునేరులో కలియును. నూగూరు, భద్రాచలం తాలూకాలకు గోదావరి నది తగులును.

అరణ్యములు : ఈజిల్లాలో 1518873 ఎకరములు అరణ్య ప్రాంతము. టేకు, ఇప్ప, నల్లమద్ది, చండ్ర, వెదురు మొదలగు వృక్షజాతులు కలవు. పులులు, చిరుత పులులు, దుప్పులు, జింకలు, తోడేళ్లు, నక్కలు మొదలగు వన్య మృగములు కలవు.

ఖనిజములు : ఈ జిల్లాలోని ఖనిజసంపత్తి పేర్కొనదగినది. నేలబొగ్గు, కెంపు రాయి, ఇనుము ముఖ్యములయినవి. నేలబొగ్గు సింగరేణిలోను, కొత్తగూడెములోను త్రవ్వబడుచున్నది. మధిర, ఖమ్మము తాలూకాలలో అభ్రకము లభించును. పాపటపల్లి రైలుస్టేషనుకు 8 మైళ్ళ దూరమున జస్తిపల్లిలో 1928 లో పాలరాళ్లు కనిపెట్టబడినవి. ఈ రాళ్ళ మునక అనుకూలముగా లేనందున, ఈ రాయి సున్నము చేయుటకు ఉపయోగింపబడుచున్నది. పాల్వంచ తాలూకాలో యల్ల బేలువద్ద పాత రాగిగను లున్నట్లు తెలియుచున్నది. ఎల్లందు తాలూకాలో బలపపురాయి విస్తారముగా నున్నది.

ఇండియా ప్రభుత్వ భూగర్భ శాస్త్రపరిశోధకుడగు డా. కింగ్ 1872లో ఎల్లందు సమీపమున సింగరేణిలో నేలబొగ్గు గనిని కనిపెట్టెను. 1886 లో ఈ గని త్రవ్వకము ప్రారంభ మయ్యెను. నేలబొగ్గుగనులలో లాభసాటిగానున్న గని యిది సింగరేణి క్షేత్రములో నాలుగు అంతరములు కనబడినవి. మొదటిది 30 నుండి 50 అడుగులలోతున నుండును. రెండవది మొదటిదానికి సుమారు 100 అడుగులక్రింద నుండును. మూడవది రెండవదానికి సుమారు 30, 40 అడుగులక్రింద నుండును. నాల్గవది మూడవ అంతరముక్రింద నున్నది. ఈ నాలుగు అంతరములలో బొగ్గుగుణము వేర్వేరుగా నుండును. నాల్గవ అంతరము నందుండు బొగ్గు అన్నింటిలోను శ్రేష్ఠమైనదని తెలియుచున్నది. ఈ శ్రేష్ఠమైనబొగ్గుకు "కింగ్" అని దానిని కనిపెట్టిన డాక్టరు కింగ్ పేరు పెట్టియున్నారు. దీని వైశాల్యము 9 చ. మైళ్లు. ఈ నాల్గవ గనిలో 4,75,00,000

202