విజ్ఞానకోశము - 3
ఖమ్మముజిల్లా
తాలూకాలు : ఈ జిల్లాలో 7 తాలూకాలు కలవు.
1. ఖమ్మముమెట్టు తాలూకా
విస్తీర్ణము | 591.36 చ. మై. |
గ్రామములు | 156 |
పట్టణములు | 1 |
జనాభా | 2,35,078 |
పురుషులు | 1,19,882 |
స్త్రీలు | 1,15,196 |
జనసాంద్రత | 398 |
2 మధిర తాలూకా
విస్తీర్ణము | 771.84 చ. మై. |
గ్రామములు | 157 |
పట్టణములు | 2 |
జనాభా | 1,70,661 |
పురుషులు | 88,123 |
స్త్రీలు | 82,538 |
జనసాంద్రత | 227 |
3. ఎల్లందు తాలూకా
విస్తీర్ణము | 754.93 చ. మై |
గ్రామములు | 49 |
పట్టణములు | 3 |
జనాభా | 1,19,367 |
పురుషులు | 60,794 |
స్త్రీలు | 58,573 |
జనసాంద్రత | 158 |
4. పాల్వంచతాలూకా
విస్తీర్ణము | 1,295.36 చ. మై. |
గ్రామములు | 69 |
జనాభా | 1,31,310 |
పురుషులు | 68,035 |
స్త్రీలు | 63,275 |
జనసాంద్రత | 101 |
5. బూర్గుంపహడు తాలూకా
విస్తీర్ణము | 568.06 చ. మై. |
గ్రామములు | 42 |
పట్టణములు | 1 |
జనాభా | 43,590 |
పురుషులు | 22,255 |
స్త్రీలు | 21,335 |
జనసాంద్రత | 77 |
6. భద్రాచలం తాలూకా
విస్తీర్ణము | 911 చ. మై. |
గ్రామములు | 327 |
జనాభా | 77,620 |
పురుషులు | 39,016 |
స్త్రీలు | 38,604 |
జనసాంద్రత | 85 |
7. నూగూరు తాలూకా
విస్తీర్ణము | 593. చ. మై |
గ్రామములు | 146 |
జనాభా | 35,366 |
పురుషులు | 17,880 |
స్త్రీలు | 17,486 |
జనసాంద్రత | 60 |
ఈ జిల్లా ప్రధాన స్థానము ఖమ్మము పురము. దీని ప్రాచీననామము కంబముమెట్టు. తరువాత ముస్లిముల నోటిలో ఖమ్మము మెట్టు అయినది. ఇప్పుడు సర్కారువారి ఆదేశానుసారము “ఖమ్మము" గా వ్యవహరింపబడుచున్నది. ఖమ్మము పురము సముద్ర మట్టమునకు 315 అడుగుల ఎత్తున నున్నది.
పర్వతములు : పాకాల - సింగరేణి నుండి చిన్నగుట్టల వరుస యొకటి బయలుదేరి ఆగ్నేయదిశ యందున్న అశ్వారావుపేట వరకు పోయి, దిగువ గోదావరిలోయకు సరిహద్దుగా నుండును. జిల్లా యంతటను చుక్కల వలె చిన్న చిన్న గుట్టలు చెదురుగా నున్నవి. తూర్పు కనుమల పర్వతములు సముద్రతీరము నుండి క్రమముగా పైకి లేచుచు నూగూరు, భద్రాచలము తాలూకాలలో వ్యాపించియుండును.
నదులు : ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు మునేరు, పాలేరు, కిన్నెరసాని, వై రా అనునవి. మునేరు పాకాల చెరువు నుండి బయలుదేరి వై రాతో కలిసి 96 మైళ్లు హిప్రంచి కృష్ణలో సంగమించును. పాలేరునది వరం
201